మీ ఇష్టాలను గుర్తించండి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవికెరీర్

మీ ఇష్టాలను గుర్తించండి

ఉన్న ఓ పెద్ద సమస్య ఏంటంటే.. కుటుంబ సభ్యుల్లోన్ని అన్ని కళలనీ గుర్తిస్తారు.. వారికి అన్నీ అమరుస్తూ పైకి వచ్చేలా చూస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి తరువాత చూద్దాంలే అనుకుం టారు. ఓ సంగీతమో, సాహిత్యమో.. ఇంకేదైనా తమకు ఇష్టమైన పనో ఉందనుకోండి దాన్ని నెరవేర్చుకోడానికి సమయం కావాలి. కానీ అందరి బాగోగులు చూసేసరికి వారికి తమకంటూ సమయమే మిగలదు. దాంతో ఆ ఆశ ఎక్కడో అడుగున పడిపోతుంది. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదనట్టు వదిలేస్తారు. కానీ ఇలా కొన్నేండ్లు గడిచాక ఎక్కడో ఎవరో తమకి నచ్చిన పని చేస్తూ. కనబడతారు. అంతే ఇకమనసులో బాధ మొదలవుతుంది. ఇంకా ప్రతి నిముషం ఆ విషయం మనసుని తొలుస్తూనే ఉంటుంది. ప్రతి పనీ భారంగానే అనిపిస్తుంది. చివరకు చిరాకు ఎక్కువై చిన్న విషయానికే కోప్పడుతుంటారు.
మొన్నటి వరకు బాగానే ఉన్న మనిషి సడన్‌గా ఇలా ఎందుకు ప్రవర్తిసుందో అనుకుని ఇంట్లో వాళ్ళకు అసలు విషయం తెలియక తికమకపడుతుంటారు. ఇప్పటికీ చాలా మంది మహిళలు తమ ఇష్టాలను ఇంట్లో వాళ్ళకు చెప్పే ధైర్యం చేయరు. నిజానికి తనకంటూ ఓ ఇష్టం ఉందని చెప్పడం ఇంకా అలవాటు కాలేదు. ఈ వయసులో ఇవేం కోరికలు అని అందరూ నవ్వుతారేమో అన్న భయమే దీనికి ముఖ్యమైన కారణం.
అసలు విషయం బయటకు చెప్పకుండా లోలోపలే కుమిలిపోతే ఈ సమస్య పెద్దదై ఇంట్లో గొడవలు మొదలవుతాయి. అందుకే మహిళలు తమ ఇష్టాలు తమలో ఉన్న టాలెంట్‌ ని వారే గుర్తించి బయటపెట్టుకోవాలి. అందరికీ నిర్మొహమాటంగా చెప్పుకోవాలి. అయితే ఈ విషయంలో ఇంట్లో వారి బాధ్యత కూడా చాలా ఉంది. ఇంత లేట్‌ ఏజ్‌ లో ఇదెందుకు అని అనకుండా వారిని ప్రోత్సహించాలి.
- ఎంతో లేట్‌ అయిందని అనుకునే కన్నా ఇప్పటికైనా మొదలు పెట్టా కదా, అని మిమ్మల్ని మీరే మెచ్చుకోండి.
- ఇంట్లో వారి పనులు అన్నీ మీరే చేసెయ్యాలనుకోకుండా పనిని అందరితో పంచుకోండి. అప్పుడు మీకంటూ కాస్త సమయం దొరుకుతుంది.
- మీలానే ఆలోచించే ఇంకొందరిని కలవండి. పెరుగుతున్న టెక్నాలజీతో వాట్సాప్‌ లాంటి గ్రూపులు మనకు అందుబాటులో వున్నాయి. ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. అప్పుడు మీకు తోడు దొరకడమే కాదు ఆ పనిలో ఉత్సాహం కూడా కలుగుతుంది.
- ఒకవేళ ఇంట్లో మిమ్మల్ని ప్రోత్సహించే వారు లేకపోయినా నిరాశపడకండి. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్‌ లో దొరకని వీడియో లేదు. మీ కావాల్సింది మీ ఫ్రీ టైమ్‌లో మీ ఇంట్లోనే నేర్చుకోవచ్చు.
- మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కుటుంబం, పిల్లలు, ఇంటి పట్ల బాధ్యతగా వుండాలనుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ అదే బాధ్యత మీ పట్ల కూడా కాస్త చూపిస్తే జీవితం సుఖంగా, తృప్తిగా ఉంటుంది. మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు.

మీ ఇష్టాలను గుర్తించండి

MORE STORIES FROM THE SECTION

manavi

కెరీర్

అందమైన మనసు

19-03-2020

స్త్రీలు జుట్టుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అవి తమ సౌందర్యాన్ని రెట్టింపుచేస్తాయి. అందుకే ఒక్క వెంట్రుక రాలినా భరించలేరు. జుట్టు పొడువుగా, అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఓ

manavi

కెరీర్

కుటుంబ పోషణ కోసం...

19-03-2020

బాబీతాయి అవాలే... మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌ జిల్లాలోని తిల్వానీ గ్రామంలో జీవిస్తుంది. కుటుంబ పోషణ కోసం ఆమె ఎన్నో ఏండ్లుగా టైర్ల పంక్చర్‌ షాపు నడుపుతున్నారు. స్కూటీలు మొదలు కుని టాటా సుమో, బుల్లెట్‌తో సహా ఏ

manavi

కెరీర్

పుస్తకాలు చదివితే...

17-03-2020

జీవితం అందంగా, సరదాగా కనిపించాలన్నా.. మన జీవితమంటే మనకు బోల్డంత ఇష్టం రావాలన్నా.. ఏదైనా సమస్య ఎదురవగానే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నా.. న్యాయంగా ఆలోచించాలన్నా.. నిర్ణయం

manavi

కెరీర్

కృషి చేస్తే విజయం మనదే

12-03-2020

ఓలా క్యాబ్‌ డ్రైవర్స్‌లో కస్టమర్ల నుండి అద్భుతమైన రేటింగ్‌ సంపాదించిన అతి కొద్దిమంది డ్రైవర్లలో బెంగుళూరుకు చెందిన మహాలక్ష్మి ఒకరు. 14 ఏండ్ల వయసు లోనే కుటుంబం కోసం ఓ ఇంట్లో పనికి కుదిరిన ఆమె మహిళా డ్రైవర్‌గా మారిపోయింది.

manavi

కెరీర్

భయాలు అధిగమించేలా...

10-03-2020

మరి కొద్ది రోజుల్లో పిల్లలకు పరీక్షలు మొదలు కానున్నాయి. పిల్లలకు పరీక్షలంటే ఇటీవల తల్లిదండ్రులకే పరీక్షల్లా మారి పోయింది. ఈ కాలంలో ఫియర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ ఫెయిల్యూర్‌ అనే మాట బాగా వినబడుతుంది.

manavi

కెరీర్

స్నేహం పదిలం...

29-02-2020

పంచుకోవటం ద్వారా అంకురించే భావన స్నేహం. నీది, నాది అనే భావన స్థానంలో మనదనే భావన ఇది. ఊహ తెలిసినప్పటి నుంచి జీవితపు చివరి క్షణం వరకూ మనిషికి అన్ని విధాలా ఆలంబనగా నిలిచేది స్నేహమే. ప్రతి స్నేహితుడినీ ప్రత్యేకంగా భావించి అందరితో మంచి సంబంధాలు

manavi

కెరీర్

మిస్సి గరిమ...

27-02-2020

నెలసరి సమయంలో అపరిశుభ్రపద్ధతుల్లో వాడే బట్ట కన్నా .. నేడు వాడుతున్న శానిటరీ నాప్కిన్స్‌ మహిళలకు ఎంతో ఊరటనిచ్చాయి. ఎన్నో వ్యాధుల నుండి బయటపడేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాడి పారేసే ఈ నాప్కిన్స్‌ వల్ల చెత్త పెరిగిపోతుంది. అదొక పర్యావరణ

manavi

కెరీర్

'భగీరథ' బామ్మ

23-02-2020

ఈ రోజుల్లో చాలామంది 30 ఏండ్లు రాగానే...ఇంకేం చదువుతామని చదివే చదువును కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగాన్ని చూసేసుకుని సెటిలైపోతున్నారు. కానీ ఓ బామ్మకు మాత్రం వందేళ్లు దాటినా చదువుపై ఆసక్తి తగ్గలేదు. అందుకే 105 ఏండ్ల వయసులోనూ

manavi

కెరీర్

రీఛార్జ్‌ చేసుకుంటేనే...

20-02-2020

కొంతమంది అదేపనిగా ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఫలితం.. తెలియని నిర్లిప్తత, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తెలియని అనారోగ్యంతో సతమతమవటం. ఆ ఇబ్బందులు ఏవీ వద్దు అనుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ చేసుకుంటుండాలి. అందుకు