అందమైన మనసు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవికెరీర్

అందమైన మనసు

స్త్రీలు జుట్టుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అవి తమ సౌందర్యాన్ని రెట్టింపుచేస్తాయి. అందుకే ఒక్క వెంట్రుక రాలినా భరించలేరు. జుట్టు పొడువుగా, అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఓ కాలేజిలోని 231 మంది అమ్మాయిలు మాత్రం తమ అందమైన జుట్టును క్యాన్సర్‌ రోగుల కోసం దానం చేశారు.
కోయంబత్తూరులోని పీఎస్‌జీ కాలేజ్‌కి చెందిన విద్యార్థులు తమ అందమైన మనసును చాటుకున్నారు. వీరంతా లైన్‌లో కూర్చుని తమ జుట్టుని క్యాన్సర్‌ రోగుల కోసం ఇచ్చారు. విద్యార్థులే మాత్రమే కాదు ఆ కాలేజీ మహిళా ఉపాధ్యాయులు కూడా కురులను దానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. 'న్యాచురల్‌ సెలూన్‌ అండ్‌ స్పా' వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వీరంతా సుమారుగా 8 ఇంచుల జుట్టును ఇచ్చారు. కీమోథెరపీ, ఒత్తిడి వల్ల జుట్టు కోల్పోయిన ఎంతోమంది క్యాన్సర్‌ రోగులకు దీన్ని ఉపయోగిస్తారు. సేకరించిన జుట్టును చెన్నైలోని 'రాజ్‌ ఇంపెక్స్‌'కు చేరుస్తారు. వారు విగ్గులను తయారు చేసి క్యాన్సర్‌ వల్ల జుట్టును కోల్పోయిన వారికి ఉచితంగా ఇస్తారు. ఇలాంటి కార్యక్రమాన్ని కోయంబత్తూరులో నిర్వహించడం ఇదే మొదటిసారి.

అందమైన మనసు

MORE STORIES FROM THE SECTION

manavi

కెరీర్

కుటుంబ పోషణ కోసం...

19-03-2020

బాబీతాయి అవాలే... మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌ జిల్లాలోని తిల్వానీ గ్రామంలో జీవిస్తుంది. కుటుంబ పోషణ కోసం ఆమె ఎన్నో ఏండ్లుగా టైర్ల పంక్చర్‌ షాపు నడుపుతున్నారు. స్కూటీలు మొదలు కుని టాటా సుమో, బుల్లెట్‌తో సహా ఏ

manavi

కెరీర్

మీ ఇష్టాలను గుర్తించండి

17-03-2020

ఉన్న ఓ పెద్ద సమస్య ఏంటంటే.. కుటుంబ సభ్యుల్లోన్ని అన్ని కళలనీ గుర్తిస్తారు.. వారికి అన్నీ అమరుస్తూ పైకి వచ్చేలా చూస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి తరువాత చూద్దాంలే అనుకుం టారు. ఓ సంగీతమో,

manavi

కెరీర్

పుస్తకాలు చదివితే...

17-03-2020

జీవితం అందంగా, సరదాగా కనిపించాలన్నా.. మన జీవితమంటే మనకు బోల్డంత ఇష్టం రావాలన్నా.. ఏదైనా సమస్య ఎదురవగానే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నా.. న్యాయంగా ఆలోచించాలన్నా.. నిర్ణయం

manavi

కెరీర్

కృషి చేస్తే విజయం మనదే

12-03-2020

ఓలా క్యాబ్‌ డ్రైవర్స్‌లో కస్టమర్ల నుండి అద్భుతమైన రేటింగ్‌ సంపాదించిన అతి కొద్దిమంది డ్రైవర్లలో బెంగుళూరుకు చెందిన మహాలక్ష్మి ఒకరు. 14 ఏండ్ల వయసు లోనే కుటుంబం కోసం ఓ ఇంట్లో పనికి కుదిరిన ఆమె మహిళా డ్రైవర్‌గా మారిపోయింది.

manavi

కెరీర్

భయాలు అధిగమించేలా...

10-03-2020

మరి కొద్ది రోజుల్లో పిల్లలకు పరీక్షలు మొదలు కానున్నాయి. పిల్లలకు పరీక్షలంటే ఇటీవల తల్లిదండ్రులకే పరీక్షల్లా మారి పోయింది. ఈ కాలంలో ఫియర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ ఫెయిల్యూర్‌ అనే మాట బాగా వినబడుతుంది.

manavi

కెరీర్

స్నేహం పదిలం...

29-02-2020

పంచుకోవటం ద్వారా అంకురించే భావన స్నేహం. నీది, నాది అనే భావన స్థానంలో మనదనే భావన ఇది. ఊహ తెలిసినప్పటి నుంచి జీవితపు చివరి క్షణం వరకూ మనిషికి అన్ని విధాలా ఆలంబనగా నిలిచేది స్నేహమే. ప్రతి స్నేహితుడినీ ప్రత్యేకంగా భావించి అందరితో మంచి సంబంధాలు

manavi

కెరీర్

మిస్సి గరిమ...

27-02-2020

నెలసరి సమయంలో అపరిశుభ్రపద్ధతుల్లో వాడే బట్ట కన్నా .. నేడు వాడుతున్న శానిటరీ నాప్కిన్స్‌ మహిళలకు ఎంతో ఊరటనిచ్చాయి. ఎన్నో వ్యాధుల నుండి బయటపడేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాడి పారేసే ఈ నాప్కిన్స్‌ వల్ల చెత్త పెరిగిపోతుంది. అదొక పర్యావరణ

manavi

కెరీర్

'భగీరథ' బామ్మ

23-02-2020

ఈ రోజుల్లో చాలామంది 30 ఏండ్లు రాగానే...ఇంకేం చదువుతామని చదివే చదువును కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగాన్ని చూసేసుకుని సెటిలైపోతున్నారు. కానీ ఓ బామ్మకు మాత్రం వందేళ్లు దాటినా చదువుపై ఆసక్తి తగ్గలేదు. అందుకే 105 ఏండ్ల వయసులోనూ

manavi

కెరీర్

రీఛార్జ్‌ చేసుకుంటేనే...

20-02-2020

కొంతమంది అదేపనిగా ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఫలితం.. తెలియని నిర్లిప్తత, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తెలియని అనారోగ్యంతో సతమతమవటం. ఆ ఇబ్బందులు ఏవీ వద్దు అనుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ చేసుకుంటుండాలి. అందుకు