వ్యర్థాలతో కనువిందుగా | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

వ్యర్థాలతో కనువిందుగా

   కరోనా వైరస్‌ అగ్ర రాజ్యాధినేతనూ చుట్టు ముట్టి దాని ఆధిక్యతను నిరూపిం చుకున్నది. అత్యున్నత, అత్యాధునిక వైద్య సదుపా యాలున్నాయని పేరున్న అమెరికా దేశ అధ్యక్షుడినీ ఆయన భార్యనీ లొంగదీసుకొని పెత్తనం చెలాయిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పది లక్షలను దాటింది. మన దేశంలో కూడా కరోనా లక్ష మందిని బలి తీసుకుంది. మన తెలుగువారి ఆరాధ్య గాయకుడు, గానగంధర్వుణ్నీ బలి తీసుకున్నది.
మాస్కులు, శానిటైజర్లను సక్రమంగా వాడితే కరోనా వైరస్‌ను నిరోధించవచ్చు. కరోనా మహమ్మారిని నివారించాలంటే పది మంది పోగయ్యే జాతర్లకు, గుళ్ళకూ, వివాహాది శుభకార్యాలకూ దూరంగా ఉండడమే మంచిది. అంతేకాకుండా బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టిన నిన్నటి మొన్నటి ఆహార పదార్థాలు కాకుండా తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడమే మేలు. అలాగే తొక్క తీసి తినే పండ్లను ఎంచుకోవడం మంచిది. తొక్కలేని ద్రాక్ష వంటి పండ్లను, చెర్రీ వంటి వాటిని తినకపోవడమే మంచిది. ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కరోనాను దరిచేరనివ్వకుండా చూడవచ్చు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్స్‌ర్‌సైజులు చెయ్యడం మంచిది. బోర్‌ కొట్టకుండా ఇంట్లోని వస్తువులను కళాత్మకంగా మారుద్దాం...
పాత పెళ్ళి శుభలేఖలతో
ఈ మధ్య శుభలేఖలు చాలా ఖరీదుగా ఉంటున్నాయి. ధనవంతులు శుభలేఖలను తమ స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు. ఆడియో, వీడియో రికార్డింగులతో చాలా అందంగా ఒకరిని మించి మరొకరు తయారు చేయిస్తున్నారు. మరి పెళ్ళిళ్ళ సీజన్‌లో మనకి చాలా శుభలేఖలు వస్తాయి. పెళ్ళి అయిపోగానే వాటినేం చేస్తాం. పారేయడమేగా! ఎంతో అందంగా డబ్బు, సమయం ఖర్చుపెట్టి ఇచ్చిన శుభలేఖల్ని పారేయకుండా ఏదైనా చెయ్యాలనిపించింది. నేను ఆ శుభలేఖల్ని అందంగా అలంకరించి ఫ్రేమ్‌ చేయించి ఆ పెళ్ళి వాళ్ళకే బహుమతిగా ఇవ్వడం మొదలుపెట్టాను. వీటిని మరోసారి చెస్తాను. ఇప్పుడు రాధాకృష్ణులు బొమ్మలతో వచ్చే శుభలేఖల ఉపయోగాన్ని వివరిస్తాను. కార్డ్‌బోర్డు బైండింగ్‌ లాంటి అట్టతో మధ్యకు ముడుచుకునే విధంగా ఉండే వాటిని ఎలా వాడుకోవాలో చూద్దాం. లావుపాటి అట్ట ఉండడం వల్ల దీనిని నిలబెడితే చక్కగా నిలబడుతుంది. బజార్లో దొరికే డబుల్‌ ఫ్రేమ్స్‌ లాగా ఇది కూడా ఉపయోగ పడుతుంది. ఈ శుభలేఖ లోపలి వైపు రెండు ఫొటోలు మనవి అతికించుకుంటే ఫ్రేమ్‌ లాగా టీపారు మీద పెట్టవచ్చు. రెండు వైపులా ఉంటాయి. కాబట్టి పిల్లలిద్దరివి కానీ, భార్యాభర్తలిరువురెవి కాని పెట్టుకోవచ్చు. పెళ్ళి శుభలేఖను ఫొటోఫ్రేంగా మార్చేస్తున్నాయన్నమాట.
వెంటిలేటర్ల వ్యర్థాలతో
కరోనా వైరస్‌తో వెంటిలేటర్లు అనే మెడికల్‌ మిషన్ల గురించి సామాన్య ప్రజానికానికీ తెలిసి పోయింది. మాది హాస్పిటల్‌ కాబట్టి ఇక్కడ అనేక రకాల వ్యర్థాలుం టాయి. ఇక్కడ వెంటి లేటర్లలలో వాడే పైపుల్లో మూతలుగా తెల్లని ప్లాస్టిక్‌వి ఉంటాయి. వాటిని సేకరించాను. ఈ నెలలో గాంధీ జయంతి వచ్చింది కాబట్టి గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని చిత్రించాలనుకున్నాను. అందుకోసం స్వతంత్ర భారతదేశాన్ని, దాన్నీ సాధించిన గాంధీజీని చిత్రించాను. మంచి నీళ్ళ సీసాల మూతలు అన్నీ సేకరించి పెట్టాను. ఈ మూతలతో భారతదేశ చిత్ర పటాన్ని ఆవిష్కరించాను. ఆ పక్కనే గాంధీని చిత్రించాలి. అందుకు వెంటిలేటర్ల వ్యర్థాలలోని తెల్లని మూతల్ని వాడాను. తెలుపు రంగు మూతల్ని గాంధీజీ పటానికి వాడటం ద్వారా ఆయన స్వచ్ఛమైన మనసును తెలియజేయాలనుకున్నాను. అంతే కాకుండా మనిషి ప్రాణం కాపాడడంలో ''వెంటిలేటర్లు'' ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి. భారతదేశానికి ప్రాణప్రదమైన గాంధీజీ బమ్మకు వాటిని వాడితే సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం. అలా గాంధీ సహిత భారతాన్ని సృష్టించాను.
మరమగ్గాల వ్యర్థాలతో
మా సిరిసిల్ల నేత బట్టల తయారీకి ప్రసిద్ధి చెందిందని అందరికీ తెలుసుకదా! మరి ఊరి నిండా మరమగ్గాలు 'టక్‌టక్‌' అంటూ చప్పుడు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మా ఇంటికి రెండు వైపులా ఉన్న ఇళ్ళలో చాలా మరమగ్గాలుంటాయి. వాటిలో దారం చుట్టడానికి ప్లాస్టిక్‌ గొట్టాల వంటివి ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్‌ గొట్టాలు ఆకుపచ్చ, నారింజ రంగుల్లో చాలా అందంగా కనువిందు చేస్తాయి. వీటిని వంటి నిండా రంధ్రాలుంటాయి. నేను వీటిని తీసుకొచ్చి ఫ్లవర్‌వేజ్‌లుగా మార్చాను. ఈ మధ్య వచ్చిన ప్లాస్టిక్‌ గొట్టానికి మాస్కులు తగిలించాను. మాస్కుల తోకలు కత్తిరించి మిగిలిన బట్టను ఒక 'బౌ' లాగా కుట్టాను. దీని మధ్యలో వూలు రాఖీని అమర్చాను. చక్కని 'బౌ' తయారయింది. మామూలుగా ఈ 'బౌ'ను పిల్లల గౌన్లకు అందంగా కుడతారు. ఇలా కొన్ని తయారుచేసి వాటిని ప్లాస్టిక్‌ గొట్టానికి కట్టాను. ఇప్పుడు ఫ్లవర్‌వేజ్‌ కూడా మాస్కులు కట్టుకున్నది. దాంట్లో కొన్ని పువ్వులు పెట్టాను. మాస్కుల తోకలు కత్తిరించానన్నాను కదా! వాటితో వేరే బమ్మ చేశాను. వచ్చే వారు చెప్తాను. ఈ ప్లాస్టిక్‌ గొట్టం రెండు వైపులా తెరిచే ఉంటుంది. ఈ గొట్టాన్ని ఒక పుల్లకు గుచ్చి వాళ్ళు దారాన్ని చుడుతుంటారు కాబట్టి. మరి మనం ఫ్లవర్‌వేజ్‌గా మార్చాం కాబట్టి పువ్వులు పట్టాలంటే ఒకవైపు మూసేయాలి. మామూలుగా ఇలాంటి సమస్యను అట్టముక్కతో తీర్చేస్తాం. కొద్దిగా రిచ్‌గా కనిపించాలని సిడిని అతికించాను. నీడలు తేలే అద్దాల మెరుపుతో, పైనున్న పువ్వులు, ఫ్లవర్‌ వేజ్‌ అందాలను తనలో ప్రతిఫలింపజేస్తూ అందంగా తయారయింది.
సొరకాయతో
ఆకులు, తాగలు, కాయలు, విత్తనాలు, కొమ్మలు, మొగ్గలు ఏవైతేనేం బమ్మల్లా అలకరించడానికి. ఒక గుండ్రటి సొరకాయను మా పేషెంట్‌ తెచ్చిచ్చారు వండుకోమని. కానీ ఏదో ఆటంకాలతో వండుకోవటం కుదరలేదు. ఇది పొడుగు సొరకాయకాదు. దీన్ని పెట్టె సొరకాయ అంటారు. ఇంత పెద్ద సొరకాయను ఫ్రిజ్‌లో పెట్టలేక బయటే ఉంచడంతో ఎండిపోయింది. సరే ఎండిపోయింది కదా బయట పారేయమన్నారు ఇంట్లో వాళ్ళు. పారేయటమెందుకు పెయింట్‌ చేస్తానన్నాను. సరే రంగులు బ్రష్‌లు పెట్టుకొని ఆ సొరకాయపై పువ్వులు, ఆకులు చిత్రించాను. పువ్వు దశ దాటాకే కాయగా మారుతుంది. ఇప్పుడు కాయనే పూలు, ఆకులు, కొమ్మలుగా మార్చాం. బావుందా!
వ్యాక్సిన్‌ ప్యాకింగులతో
పిల్లలకు వేసే వ్యాక్సిన్లు భద్రంగా డబ్బాలలో ప్యాక్‌ చేసి వస్తాయి. పోలియో, డిడిటి, హెపటైటిస్‌ బి, న్యూమోకోకల్‌, మీజిల్స్‌, రోటా వైరల్‌ వంటి వ్యాక్సిన్లను స్వచ్ఛమైన తెలుపుతో ధర్మోకాల్‌ డబ్బాలలో ప్యాక్‌ చేస్తారు. హాస్పిటల్‌ కాబట్ట చాలానే జమ అవుతాయి. మొదట్లో ఈ డబ్బాలలో బమ్మల మెటీరియల్‌ను దాచుకునేదాన్ని. కానీ ఎన్నని పెడతాం చాలా మిగులు తున్నాయని పూల కుండీలుగా మార్చాను. వాటిలో మట్టిపోసి చెట్టుపెట్టడం ప్రారంభించాను. ఇది ఒక రకంగా వ్యర్థాల ఉపయోగమే కానీ దీనికి అందం తోడవ్వాలి కదా! అందుకే తెల్లని తెలుపుతో ఉండే ధర్మోకాల్‌ డబ్బా మీద బమ్మలు వేశాను. ధవళ వర్ణపు ధర్మోకాల్‌ డబ్బా నాకు కాన్వాసులా కనిపించింది. పక్షులు, సీతాకోక చిలుకలు, పిల్లలు, చేపలు ఒకటేమిటి ఏది వెయ్యాలనిపిస్తే అది వేశాను. ఇప్పుడు మా ఇంట్లో ఇలాంటి కుండీలు దాదాపు వంద దాటిపోయాయి.

- డా|| కందేపి రాణీప్రసాద్‌

వ్యర్థాలతో కనువిందుగా

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

ముద్దులొలికే చిన్నారులకు

17-11-2020

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రకరకాల డిజైన్ల బట్టలు వేసి మురిసిపోతాం. వాళ్ళు కాస్త ఎదిగే కొద్దీ ఎలాంటి డ్రెస్సులు కొనాలా అని ఎంతో ఆలోచిస్తాం. అమ్మాయిల

manavi

ఫ్యాషన్‌

చిట్టి తల్లులు మెరిసిపోయేలా

03-11-2020

పిల్లలకు ఎన్ని బట్టలు ఉన్నా తల్లిదండ్రులకు తృప్తి ఉండదు. తమ చిన్నారులను ఎప్పటికప్పుడు కొత్తగా చూసి మురిసిపోవాలని కోరుకుంటారు. రకరకాల

manavi

ఫ్యాషన్‌

బతుకమ్మల్లో బతుకమ్మలా...

13-10-2020

కుందన్స్‌, స్టోన్స్‌, వీటన్నింటినీ డామినేట్‌ చేసే పల్లూ, స్వచ్ఛమైన జరీతో మెరిసిపోయే చీరలు ప్రస్తుతం అమి తంగా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో

manavi

ఫ్యాషన్‌

పాలుగారే పసిపాపాయిలకు

29-09-2020

పిల్లలకు ఏ డ్రెస్సు వేసినా ముద్దుగానే ఉంటారు. రంగురంగుల సీతాకోక చిలుకల్లా మెరిసిపోతారు. ఫ్యాషన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో మార్కెట్లోకి రకరకాల డ్రెస్సులు వచ్చేస్తున్నాయి. పిల్లల కోసమే అంటూ కొన్ని రకాల

manavi

ఫ్యాషన్‌

ఆల్‌ టైం ఫేవరెట్‌

22-09-2020

రోజు రోజుకి ఫ్యాషన్‌ పెరిగిపోతున్నా మనకు ఆల్‌ టైం ఫేవరెట్‌ డ్రెస్సింగ్‌ మాత్రం చుడీదార్స్‌. క్యాజువల్‌గా అయినా పార్టీకైనా ఇట్టే అమరిపోయే ప్రత్యేకం చుడీదార్‌ సొంతం. వేసుకోవడానికి అనువుగా వుండటమే