మురిపించే మువ్వల పట్టీలు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

మురిపించే మువ్వల పట్టీలు

గొలుసులు, గాజులతోపాటు రోజూ ధరించే ఆభరణంగా స్థిరపడిపోయాయి కాలి పట్టీలు. కాస్త అడుగులేసే వయసు రాగానే కూతురుకు ముందుగా మువ్వల పట్టీలు చేయించి పెడతారు అమ్మా నాన్నలు. వారి బుజ్జి బుజ్జి అడుగులకు ఆ మువ్వల గలగలలు తోడై ఇల్లంతా తిరుగుతుంటే మురిసిపోతారు. అయితే కాలి పట్టీలు కూడా కాలానుగుణంగా రూపురేఖలు మార్చుకుని ఆధునికతను సంతరించుకున్నాయి. పట్టు లంగా, వోణీ, జీన్స్‌, టీషర్ట్‌.. ఏది వేసుకున్నా వస్త్రాధరణకు తగినట్టుగా ఎన్నో పట్టీలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అంతేకాదు, మన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకుని, మాచింగ్‌గా కూడా చేసుకోవచ్చు. సాధారణంగా కాలి పట్టీలు వెండి లేదా బంగారంతో తయారుచేస్తారు. కానీ ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల కాలి పట్టీలు అందుబాటులో ఉన్నాయి. చెక్క పూసలు, బ్లాక్‌మెటల్‌, రంగు రంగుల పూసలు, రాళ్లు, ముత్యాలు, మువ్వలు, గొలుసులు.. చివరకు ప్లాస్టిక్‌ గొట్టాలు, లెదర్‌తో చేసిన పట్టీలు కూడా దొరుకుతున్నాయి. అందుకే కాలేజీ అమ్మాయిలు ఇటువంటి అధునాతనమైన పట్టీలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని పనితనంతో రంగు రంగుల రాళ్లు, ముత్యాలు, పూసలు, క్రిస్టల్స్‌ పెట్టి తయారుచేసిన కాలి పట్టీలు కూడా దొరుకుతున్నాయి. ప్రస్తుతం పండగ, పెండ్లి, పార్టీ, పుట్టిన రోజు వచ్చినా డ్రెస్సుతోపాటు కొనుక్కునే మాచింగ్‌ గాజులు, నగలలో కాలిపట్టీలు కూడా చేరిపోయాయి. మరి అలాంటి మువ్వల పట్టీల డిజైన్లు కొన్ని మనమూ చూద్దాం...

మురిపించే మువ్వల పట్టీలు

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

ముద్దులొలికే చిన్నారులకు

17-11-2020

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రకరకాల డిజైన్ల బట్టలు వేసి మురిసిపోతాం. వాళ్ళు కాస్త ఎదిగే కొద్దీ ఎలాంటి డ్రెస్సులు కొనాలా అని ఎంతో ఆలోచిస్తాం. అమ్మాయిల

manavi

ఫ్యాషన్‌

చిట్టి తల్లులు మెరిసిపోయేలా

03-11-2020

పిల్లలకు ఎన్ని బట్టలు ఉన్నా తల్లిదండ్రులకు తృప్తి ఉండదు. తమ చిన్నారులను ఎప్పటికప్పుడు కొత్తగా చూసి మురిసిపోవాలని కోరుకుంటారు. రకరకాల

manavi

ఫ్యాషన్‌

వ్యర్థాలతో కనువిందుగా

17-10-2020

కరోనా వైరస్‌ అగ్ర రాజ్యాధినేతనూ చుట్టు ముట్టి దాని ఆధిక్యతను నిరూపిం చుకున్నది. అత్యున్నత, అత్యాధునిక వైద్య సదుపా యాలున్నాయని పేరున్న అమెరికా దేశ

manavi

ఫ్యాషన్‌

బతుకమ్మల్లో బతుకమ్మలా...

13-10-2020

కుందన్స్‌, స్టోన్స్‌, వీటన్నింటినీ డామినేట్‌ చేసే పల్లూ, స్వచ్ఛమైన జరీతో మెరిసిపోయే చీరలు ప్రస్తుతం అమి తంగా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో

manavi

ఫ్యాషన్‌

పాలుగారే పసిపాపాయిలకు

29-09-2020

పిల్లలకు ఏ డ్రెస్సు వేసినా ముద్దుగానే ఉంటారు. రంగురంగుల సీతాకోక చిలుకల్లా మెరిసిపోతారు. ఫ్యాషన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో మార్కెట్లోకి రకరకాల డ్రెస్సులు వచ్చేస్తున్నాయి. పిల్లల కోసమే అంటూ కొన్ని రకాల

manavi

ఫ్యాషన్‌

ఆల్‌ టైం ఫేవరెట్‌

22-09-2020

రోజు రోజుకి ఫ్యాషన్‌ పెరిగిపోతున్నా మనకు ఆల్‌ టైం ఫేవరెట్‌ డ్రెస్సింగ్‌ మాత్రం చుడీదార్స్‌. క్యాజువల్‌గా అయినా పార్టీకైనా ఇట్టే అమరిపోయే ప్రత్యేకం చుడీదార్‌ సొంతం. వేసుకోవడానికి అనువుగా వుండటమే