ధైర్యం చేస్తేనే మార్పు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

ధైర్యం చేస్తేనే మార్పు

తండ్రి బాధ్యతాయుతంగా లేకపోతే ఆ కుటుంబంలోని పిల్లల భవిష్యత్‌ అగమ్యగోచరం అనడానికి ఎన్నో ఉదాహారణలు ఉన్నాయి. అండగా ఉండాల్సిన తండ్రి అన్యాయం జరిగినపుడు మౌనంగా ఉండటం, తాగుడు మత్తులో పడి ఆడపిల్లల జీవితాలను పట్టించుకోకపోవడం అనేక వేదనలకు కారణమైంది రేవతి జీవితంలో. అభంశుభం ఎరుగని ఆమె అందమైన బాల్యాన్ని కన్నీటిమయం చేసింది. బాధలను భరించలేక.. తనకు న్యాయం చేయాలంటూ 'ఐద్వా అదాలత్‌'కు వచ్చిన ఓ అమ్మాయి దీనగాథ..
రేవతికి అక్క, తమ్ముడూ ఉన్నారు. తల్లితండ్రి రోజు వారి కూలీ పనులకు వెళ్తారు. చాలీచాలని సంపాదనతో ముగ్గురు పిల్లలను బడికి పంపిస్తుంది రేవతి తల్లి రంగమ్మ. చదువులు ఎందుకు కూలీకి పంపమంటాడు తండ్రి రంగయ్య. చదువుకుంటే పిల్లల బతుకుల్లోనైనా మార్పు వస్తుందన్న ఆశతో రంగమ్మ బాగా చదువుకోమని పిల్లలకు చెప్పేది. ఇది నచ్చని రంగయ్య రోజూ ఇంట్లో గొడవ చేసేవారు. రంగమ్మకు తమ్ముడి వరసైన సూరయ్య రేవతి వాళ్లింటికి దగ్గరలోనే ఉండేవారు. అతనికి నా అన్నవారు ఎవరూ లేకపోవడంతో వీరితోనే ఉంటున్నాడు.
వేధింపులతో..
సూరయ్య క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ.. తరచుగా రేవతి వాళ్లింటికి వచ్చేవాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు రేవతి అక్క జీవితను లైంగికంగా వేధించేవాడు. అతని ప్రవర్తన గురించి తల్లికి చెబితే ఎక్కడ గొడవలు అవుతాయన్న భయంతో చాలాసార్లు సూరయ్య చేష్టలను జీవిత భరించింది. ఆమె అశక్తత అతనికి అవకాశంగా మారింది. ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో జీవితపై అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు సూరయ్య చేసిన తప్పుకు అతనిపై చర్య తీసుకోలేదు. పైగా జీవితను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. తాను పెద్దచదువులు చదువుకుంటానని, ఉద్యోగం చేస్తానని ఎంతో ఏడ్చింది. అయినా ఇంట్లోవాళ్లు ఎవరూ ఒప్పుకోలేదు. బలవంతంగా జీవితను సూరయ్యకు ఇచ్చి పెండ్లి చేశారు. దాంతో అల్లుడిగా ఇంట్లోనే తిష్టవేశాడు.
ఇంట్లో నుంచి ..
సూరయ్యకు, జీవితకు ఇద్దరు పిల్లలు. ఉద్యోగం సరిగ్గా చేయకుండా తరచు ఇంట్లోనే ఉండేవాడు. ఆ తర్వాత సూరయ్య రేవతిని వేధించడం ప్రారంభించాడు. ఆమె తల్లికి చెప్పడంతో సూరయ్యను బాగా చీవాట్లు పెట్టి వేరుకాపురం పెట్టండని బిడ్డను, అల్లుడిని ఇంట్లో నుంచి బయటకు పంపించింది. అయితే రంగయ్య, సూరయ్య రోజూ కలిసి తాగేవాళ్లు. సూరయ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతే తనకు కంపెనీ లేదని భావించిన రంగయ్య, సూరయ్యను, బిడ్డను తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. రంగమ్మ, రేవతి వద్దని ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతుంది రేవతి. ఆమెను కూడా పెండ్లి చేసుకోవాలన్న దురుద్దేశంతో ఉన్న సూరయ్య రంగయ్యను తాగుడు మత్తులోకి దించాడు. విచక్షణ మరిచి రేవతితో అసభ్యంగా వ్యవహరించేవాడు. రేవతి తల్లికి చెప్పి వాళ్లు ఇంట్లో ఉంటే తాను బయటకు వెళ్లిపోతాను అని చెప్పడంతో వాళ్లను బయటే ఉండమని పంపించారు.
ఎవడు చేసుకుంటాడో ..
సూరయ్య సరిగ్గా ఉద్యోగం చేయకపోవడం, వచ్చిన కాస్త డబ్బులతో తాగి రావడం చేసేవాడు. జీవిత రోజూ కూలీకి వెళ్ళుతూ ఇంటి అద్దె, పిల్లల ఫీజులు కట్టేది. ఇంటి బాధ్యత పట్టించుకోకుండా తరచు జీవితను కొట్టేవాడు. 'నీ చెల్లిని ఎవడు చేసుకుంటాడో చూస్తాను. దానికి నేనే దిక్కు' అంటూ చావబాదేవాడు. ఈ పరిస్థితుల్లో ఆమె పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. సూరయ్యతో ఇక కాపురం చేయలేనని చెప్పింది. అక్కను తీసుకుని రేవతి ఐద్వాకు వచ్చింది.
ఇద్దరి జీవితాలు..
'మా అక్కకు అతనితో పెళ్లే ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి అక్కనూ మామయ్య లైంగికంగా వేధించేవాడు. మా అక్క వద్దన్నా వినకుండా చదువు మాన్పించి మరీ పెండ్లి చేశారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. మా ఇంట్లోనే ఉంటూ నన్ను వేధిం చడం మొదలు పెట్టాడు. ఇంట్లో నుంచి బయటకు పం పిస్తే ..ఇప్పుడు అక్కను విపరీతంగా హింసిస్తూ.. నన్ను పెండ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. మీరే ఎలాగైనా మా ఇద్దరి జీవితాలు కాపాడాలి' అంటూ చేతులు జోడించింది రేవతి.
మేమే అక్కడికి వస్తాం..
రేవతి అమ్మనాన్నకు, సూరయ్యకు ఫోను చేశారు. 'మీరు ఎవరో పిలిస్తే నేను ఎందుకు వస్తాను?' అంటూ ఫోన్‌లో చాలా కోపంగా మాట్లాడాడు సూరయ్య. 'సరే నీవు ఇక్కడికి రాకపోతే మేమే అక్కడికి వస్తాం. ఇంటి చుట్టూ పక్కల ఉన్నవారందరినీ పిలిచి పంచాయితీ పెడతాం. వారందరి ముందు మాట్లాడమంటావా? మర్యాద వచ్చి సమస్యను నాలుగుగోడల మధ్య పరిష్కరించుకొంటావో నీ ఇష్టం' అన్నారు బాధ్యులు. దాంతో సూరయ్య దిగి వచ్చాడు. రెండు వారాల తర్వాత ఐద్వా ఆఫీస్‌కు వచ్చాడు. అదే వారం రేపతి అమ్మనాన్న, అక్క జీవిత కూడా వచ్చారు.
ఇద్దరు బిడ్డలతో..
'నా భార్యకు నేను వద్దు. ఆమె ఎప్పుడు వాళ్ళ అమ్మవాళ్లింట్లోనే ఉంటుంది. ఆమెకు అనారోగ్యం. అందుకే ఆమె చెల్లెల్ని పెండ్లి చేసుకుందామనుకున్నాను. ఇందులో తప్పేముంది' అన్నాడు సూరయ్య.
'మా పెద్దమ్మాయికి ఎలాంటి అనారోగ్యం లేదు. భర్త బాధలు భరించలేక ఆత్మహత్యప్రయత్నం చేసింది. అయినా మార్పు రాలేదు. ఇద్దరు పిల్లల తల్లిని వదిలేసి ఇప్పుడు చిన్నమ్మాయిని చేసుకుంటాను అంటున్నాడు. మీరే బుద్ధి చెప్పండి. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళితే ఇద్దరు బిడ్డలతో స్టేషన్‌ చుట్టూ తిరగాల్సి వస్తుంది.' అంది రంగమ్మ.
తగిన బుద్ధి చెబితే...
' దూరపు చుట్టరికంతో ఇంటికి వచ్చి మీ పిల్లలను లైంగికంగా వేధిస్తుంటే తగిన బుద్ధి చెప్పకుండా పిల్లను ఇచ్చి పెండ్లి చేశారు. ఆ పిల్ల జీవితం అన్యాయం చేశారు. ఇప్పుడు చిన్నబిడ్డను వేధిస్తున్నా ఏమీ అనకుండా ఉంటున్న మీ తీరు సరైంది కాదు. అతడి ప్రవర్తన గురించి మీ పెద్దమ్మాయి చెప్పినప్పుడే మీరు తగిన బుద్ధి చెప్పిఉంటే ఈ రోజు చిన్నమ్మాయికి ఈ సమస్య వచ్చేది కాదు. మీ తొందరపాటు వల్ల ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. ముందుగా మీ అల్లుడికి కౌన్సెలింగ్‌ ఇప్పించండి. అప్పుడు కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోతే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టి తగిన శిక్ష పడేలా చేయండి' అన్నారు బాధ్యులు. దాంతో సూరయ్య భయపడిపోయాడు. జీవిత కాళ్లపై, అత్తమామ కాళ్లపై పడి 'ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను. మీరు చెప్పినట్లే వింటాను. మంచిగా చూసుకుంటాను' అన్నాడు.
ఆడపిల్లలంటే బానిసలు కాదు..
'మేడమ్‌! నన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటానంటున్నాడుగా..! ఏమైనా ఇబ్బంది వస్తే మీ దగ్గరకే వస్తాను' అంది జీవిత. 'సరే మీరంతా కలిసి సమస్యలు లేకుండా ఉంటే మంచిదే. మళ్లీ మీకు ఎలాంటి సమస్య వచ్చినా రండి. రేవతి, నీవు బాగు చదువుకో. ఇంట్లోనే కాదు ఎక్కడ వేధింపులు జరిగినా ఎదిరించు. ఆడపిల్లలంటే బానిసలు కాదు అన్న విషయం గుర్తుంచుకో! ధైర్యంగా ఉండు.' అన్నారు బాధ్యులు.

ధైర్యం చేస్తేనే మార్పు

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

కుచ్చులుతో ముచ్చ‌ట‌గా

09-07-2019

చీరలు ఎన్ని రకాలుగా కట్టినా క్రేజ్‌ పోనే పోదు. రకరకాల రవికెలొచ్చాయి. ధోతీ, లంగాఓణీ వంటి రకరకాల చీరలొచ్చాయి. ఇప్పుడు కుచ్చిళ్ల వంతు. కుచ్చులు.. ప్రిల్స్‌... ఒకప్పుడు పిల్లల గౌన్లకు

manavi

ఫ్యాషన్‌

పట్టు జాగ్రత్త!

08-07-2019

సాధారణంగా పట్టు బట్టలమీద మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు . అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బుపోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి

manavi

ఫ్యాషన్‌

అభిరుచికి తగినట్టుగా..

05-07-2019

టీనేజ్‌లోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందువల్ల వీలైనంతవరకు వారికి ఒక ప్రత్యేక గదిని కేటాయించితే మంచిది. తమ గది అనే ఆలోచన కలగగానే

manavi

ఫ్యాషన్‌

అదిర‌ ఆర్గంజా

02-07-2019

కాలాన్ని బట్టి మహిళల వార్డ్‌రోబ్‌ మారిపోతూ ఉంటుంది. వానాకాలం వచ్చేసింది. ఈజీగా క్యారీ చేయడమే కాదు... ఉతకడం, ఆరడం కూడా సులభమయ్యే ఫ్యాబ్రిక్‌ ఆర్గంజా. ఇంకెందకాలస్యం...

manavi

ఫ్యాషన్‌

ట్రెండ్‌ యాంటిక్‌దే..

25-06-2019

కొత్తొక వింత అన్న నోటితోనే.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని కూడా అన్నారు. అదే యాంటిక్‌ అయ్యింది. జువెలరీలో కూడా యాంటిక్‌ జువెలరీకీ ఎప్పటికీ డిమాండ్‌ ఉంటూనే ఉంటుంది. ఈ తరం కూడా

manavi

ఫ్యాషన్‌

చీరకట్టే పెట్టుబడిగా..

23-06-2019

ప్రతిపెండ్లిలో పెండ్లి కూతురును తయారు చేయడానికి ఒకరుంటారు. ప్రత్యేకించి... చీరలు కట్టడానికి ఒకరు కావాల్సిందే. పట్టణాలు, నగరాల్లో కొద్దోగొప్పో

manavi

ఫ్యాషన్‌

పసుపు మెరుపులు

18-06-2019

రంగుల్లో ఏముంటుంది? రంగుల్లో చాలా ఉంటుంది. రంగులు భావోద్వేగాలకు ప్రతీకలు. అందుకే వేడుకల్లో రంగులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వేడుకేదైనా పసుపు ఉండాల్సిందే. అవును పసుపు

manavi

ఫ్యాషన్‌

ఇలా..హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌

15-06-2019

వంకీల జుట్టు సరిచేయటం కోసం బ్యూటీ పార్లర్‌కే వెళ్లాల్సిన పని లేదు. వెంట్రుకలను పొడిబార్చి నిర్జీవంగా తయారుచేసే హెయిర్‌ స్ట్రెయి టెనర్స్‌ బదులుగా సహజ పద్ధతులతోనే వంకీల జుట్టును

manavi

ఫ్యాషన్‌

నాట్యానికే అంకితం

09-06-2019

నాట్యబోధన వృత్తిగా.. నాట్యసాధన ప్రవృత్తిగా తీసుకున్న ఆమె తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేశారు. జీవిత భాగస్వామికూడా నాట్యాచార్యుడు కావడంతో రెండున్నర దశాబ్దాలుగా ఆమె ప్రపంచం నాట్యమే అయ్యింది. ఇటీవల ఆఫ్రికాలోని

manavi

ఫ్యాషన్‌

జాకెట్లపై నగల నిగనిగలు

28-05-2019

ఆభరణాలంటే.. మేనిపైనే ఒకప్పుడు. ఇప్పుడు బట్టలపైకి వచ్చి చేరాయి. వివిధ డిజైన్లలో చీరలు, రవికెల మీద అలరిస్తున్నాయి. ప్రత్యేకించి రకరకాల మగ్గం వర్క్స్‌ చేసిన బ్లౌజులకు ఇప్పుడు చాలా