నేటి యువత తమ వ్యక్తిత్వాన్ని, అభిరుచులను వ్యక్తీకరించే మాధ్యమంగా టాటూను భావిస్తున్నారు. అయితే..ఫ్యాషన్ పేరుతో వేయించుకొనే టాటూ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యల బారిన పడాల్సిరావచ్చని ఫ్యాషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వారు సూచిస్తున్న అంశాలు..
- అర్హత, నైపుణ్యం ఉన్నవారి చేతే టాటూ వేయించుకోవాలి. ఈ విషయంలో రాజీ పడితే చర్మ సమస్యలు తప్పవు.
- గతంలో టాటూ వేయించుకొని చర్మ సమస్యల బారిన పడినవారు ఈ విషయాన్ని ముందుగానే టాటూ డిజైనర్‌కు చెప్పాలి.
- ఆలోచనలు, అభిరుచులు కాలంతోపాటు మారతాయి కనుక కోరుకున్నప్పుడు చెరిపేసుకొనే టాటూలు వేయించుకోవటం మంచిది.
- అనారోగ్యంతో ఉన్న సమయంలో టాటూ వేయించుకోవద్దు. టాటూ వేయించుకొనే ముందు మద్యపానం, మత్తు పదార్థాలను సేవనం పనికిరాదు.
- టాటూ కోసం వాడే రసాయనాలు, వాటి మూలంగా వచ్చే తలెత్తే ప్రతికూల ప్రభావాల గురించి ముందే తెలుసుకోవటం మంచిది.
- సున్నితమైన ప్రదేశాల్లో టాటూలు వేసేప్పుడు లోకల్ అనస్థీషియా తీసుకోవటమే మంచిది.
- ఎండలో బయటకు వెళ్ళినప్పుడు టాటూ మీద నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. లేకుంటే.. టాటూ వేసిన భాగంలో చర్మం సున్నితంగా మారి చర్మ సమస్యలు రావచ్చు.
- ఎండలో బయట వెళ్ళడానికి ముందు టాటూ మీద సన్ స్క్రీన్ లోషన్ రాసుకొంటే మంచిది.
- టటూ వేయించుకున్న తొలిరోజుల్లో మాయిశ్చరైజ్ రాయటం వల్ల ఇన్ఫెక్షన్స్, వాపు, వంటివి త్వరగా తగ్గుతాయి.
- టాటూ మీద స్క్రబ్బింగ్ పేరుతో ఎడాపెడా రుద్దితే టాటూ చెరిగిపోతుందని గుర్తుంచుకోవాలి. టాటూ వేయించుకొన్న వారు స్నానానికి నాణ్యమైన సోపును వాడాలి.
్డ మహిళలు వాక్సింగ్ చేయించుకోవాలనుకుంటే టాటూ వేయించుకోవడానికి ముందే చేయించు కోవటం మంచిది. టాటూ వేసినచోట చర్మం పొడిగా, వాపుగా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి
ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక
MORE SECTIONS
Recent From Manavi