శరీరమే తన డైరీ..! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

శరీరమే తన డైరీ..!

ఆమె ఆలోచన కాస్త భిన్నంగానే ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తన శరీరాన్ని మలుచుకుంది. సాధారణంగా పుస్తకాలు చదువుతున్నప్పుడు నచ్చిన వాక్యాలను డైరీల్లో రాసుకుంటాం. కానీ తాను మాత్రం శరీరంపై టాటూగా వేయించుకుంటుంది. పైగా శరీరమే నా డైరీ అంటుంది. ఆమె 24 ఏండ్ల జెనా దేవప్రీత.
అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం. ఆకర్షణీయంగా, సౌందర్యవంతంగా.. ఆహార్యం బాగా కనిపించేందుకు యువతులు సహా మహిళలూ ఎంతగానో తపిస్తుంటారు. అందాలకు మెరుగులు అద్దేందుకు సరికొత్త ఉపకరణాలను ఆశ్రయిస్తుంటారు. మారుతున్న కాలానికనుగుణంగా బ్రాండెడ్‌ మెకప్‌ వైపు అడుగులు వేస్తుంటారు. ఇదిగో అటువంటి ఆలోచనే చేసింది దేవప్రీత. చేయడమే కాదు ఆచరించు చూపుతుంది. తనకు నచ్చిన కవితలను శరీరంపై టాటూగా వేయించుకుంటుంది. సహజంగా పుస్తకాలు చదువుతున్నప్పుడు నచ్చిన వాక్యాలు, సందేశాలు, కవితాత్మక పంక్తులు కనిపిస్తే వాటిని వెంటనే డైరీలో రాసుకోవడం చాలామందికి అలవాటు. అయితే దేవప్రీత జెనా మాత్రం వాటిని తన శరీరంపై టాటూలుగా వేయించుకుంటుంది.
24 ఏండ్ల జెనా సోషియాలజీ స్కాలర్‌. ఆమె మెడ దగ్గర 'దేర్‌ ఈజ్‌ నో లవ్‌ ఆఫ్‌ లైఫ్‌ వితౌట్‌ డిస్పెయిర్‌ ఆఫ్‌ లైఫ్‌' అనే వాక్యం పచ్చబొట్టుగా కనిపిస్తుంది. ''అది ఫ్రెంచ్‌ రైటర్‌ ఆల్బర్ట్‌ కామూస్‌ రచనల్లోనిది'' అంటోంది జెనా. ఢిల్లీలో సోషియాలజీలో మాస్టర్స్‌ చేసిన ఆమెకు ప్రపంచ సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. ఫ్రెంచ్‌ రచయిత కామూస్‌ రచనలను ఇష్టపడుతుంది. అందుకే ఆయన రచనల్లోని 'చలిలో మునిగిన తర్వాతే చివరికి నాకు తెలిసింది.. నాలో కనిపించని వేసవి ఉందని' అనే అర్థం వచ్చే మరో వాక్యాన్ని కూడా ఒంటిపై టాటూగా వేయించుకుంది.
ఇవేగాక తన మనోభావాలను కూడా ఆమె టాటూ రూపంలో వెల్లడిస్తుంది. జెనా భుజంపై కనిపించే 'హెల్‌ ఓవర్‌ ఒబ్లివీయన్‌', మణికట్టుపై కనిపించే 'లైవ్‌. రివోల్ట్‌' అనే వాక్యాలు ఆమె ఆలోచనాక్షరాలే. ''ఇవి జీవితం పట్ల నాకున్న నిర్దిష్ట అభిప్రాయాలను ప్రతిదినం రిమైండర్‌లా నాకు గుర్తుచేస్తాయి'' అంటూ వాటిని ప్రేమగా తడుముకుంటారామె. వీటితోపాటు వేళ్లకొనలపై కూడా కవితాత్మకంగా ఉండే కొన్ని టాటూలు వేసుకున్నారు. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ నుంచి కామస్‌ దాకా... ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక మంది తాత్వికులు, సామాజికవేత్తల పుస్తకాలు చదివిన జెనా ఒంటిపై కనిపించే టాటూలు ఆమెలోని ప్రత్యేకతను చాటుతాయి. 'జీవిత ప్రయాణంలో ఎదురైన అనేక అనుభవాల నేపథ్యంలోనే నచ్చిన కవితాత్మక పంక్తులు, జీవితసత్యాలను టాటూలుగా వేసుకుంటున్నా' నని చెబుతున్న ఈ సోషియాలజీ స్కాలర్‌ ప్రయత్నం కాస్త విభిన్నంగానే ఉంది కదూ! నచ్చిన పని చేయడంలో కలిగే తృప్తి వేరు. దాంతో పొందే ఆనందం అంత ఇంత కాదు కదా..!

శరీరమే తన డైరీ..!

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

సృజనాత్మక ప్రక్రియ

12-02-2020

కొంతమంది ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడు తుంటే ఎప్పుడూ ముగిస్తారా అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఏదో ఒకటి మాట్లాడామా అన్నట్లుగా కాకుండా... అందరినీ అలెర్ట్‌ చేయాలంటే కొన్ని టిప్స్‌ పాటించడం ముఖ్యం.... అవే ఇవి...

manavi

ఫ్యాషన్‌

ఎన్నో వ‌ర్ణాల ఇల్కాల్‌

11-02-2020

మగ్గాలపై తయారయ్యే నేత చీరలకు డిమాండ్‌ ఎప్పుడూ తగ్గదు. బళ్ళారికి దగ్గరలో ఉన్న ఇల్కాల్‌ అనే చిన్నపట్టణం ఈ చీరలకు ఎంతగానో ప్రసిద్ధి. నూలు, పట్టు మిశ్రమంతో చీరను ఎన్నో డిజైన్‌లలో నేస్తారు. ఈ చీరకున్న మరో

manavi

ఫ్యాషన్‌

ప్రయాణాల్లో ఇవి కూడా...

09-02-2020

ఎక్కడికైనా సరదాగా ఓ నాలుగురోజులు గడిపి రావ డానికి బయటకు వెళ్తుంటా రు. బ్యాగు నిండా బట్టలు వగైరా సర్దుకుంటారు. వాటితో పాటు కొన్ని వస్తువులు కూడా వెంట తీసుకెళ్లడం తప్పనిసరి.

manavi

ఫ్యాషన్‌

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

06-02-2020

పెళ్లి.. ప్రతిఒక్కరి జీవితం లోనూ ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. అందుకే నవవధువు పెళ్లికి నెల రోజుల ముందు నుంచే చర్మ సౌందర్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే పెళ్లి వేడుక మొదలైన

manavi

ఫ్యాషన్‌

సైడ్‌ స్లిట్‌తో న్యూ‌లుక్‌

04-02-2020

అమ్మాయిలకు ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌లో కొత్త మార్పులు కావాలి. ఎప్పుడూ ఒకేలా ఉంటే నచ్చదు. కాలేజ్‌, ఆఫీస్‌ ఎటువెళ్లాలన్నా రోజుకో తీరుగా ఉండాలని కోరుకుంటారు. అలా వచ్చినవే ఈ సైడ్‌ స్లిట్‌ కుర్తీస్‌. ఇవి అందంగా..

manavi

ఫ్యాషన్‌

ఎవర్‌ గ్రీన్‌....

04-02-2020

తెల్లని ముత్యాలు ఎప్పుడూ ఫ్యాషన్‌ స్టేట్‌ మెంట్సే. వెండి, బంగారు, వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఇలా ఏ నగలలో పొదిగినా ఆ నగకు ప్రత్యేకమైన అందం తెస్తాయి. బన్ని ముత్యాలను నాలుగైదు వరుసల్లో అల్లితే నెక్లెస్‌లు, హారాల్లాగాను, అదేవిధంగా

manavi

ఫ్యాషన్‌

బ్లాక్‌ ప్రత్యేకతే వేరు...

02-02-2020

ఎరుపు, తెలుపు, పసుపు.. ఇలా రంగులెన్నున్నా నలుపు రంగు దుస్తులు ధరించినప్పుడు వచ్చే అందమే వేరు. మరో విధంగా చెప్పాలంటే మన ఫ్యాషన్‌ అవసరాలను బ్లాక్‌ కలర్‌ తీర్చినట్లుగా ఇంకో రంగు తీర్చలేదు. సన్నగా కనబడాలన్నా.. పొడవుగా అనిపించాలన్నా.. మరింత

manavi

ఫ్యాషన్‌

ముఖానికి నప్పేలా..

01-02-2020

దిద్దులు పెట్టిన చెవులు ముద్దుగా ఉంటాయనేవారు ఒకప్పడు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది.చెవులను అంటిపెట్టుకుని చెంపలను తాకుతా అన్నట్టుగా ఉండే లోలాకులు ఇప్పుడు ఫ్యాషన్‌. అయితే ఫ్యాషన్‌ అన్నాం కదా అని ఏది

manavi

ఫ్యాషన్‌

షాపింగ్‌ చేస్తున్నారా?

30-01-2020

మన ఇంట్లో పెద్దలు ఎప్పుడూ డబ్బు ఆదా చేయమనే చెబుతారు. అయినప్పటికీ మనం షాపింగ్‌ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంటాం. అమ్మాయిలకు, షాపింగ్‌కు.. ఒక రకంగా చెప్పాలంటే ఏదో అవినాభావ