ప్రత్యేకంగా కనిపించాలంటే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

ప్రత్యేకంగా కనిపించాలంటే...

నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే దుస్తులతో పాటు యాక్సెసరీస్‌ మీద కూడా శ్రద్ధ పెట్టాల్సిందే. అతి మామూలుగా డ్రెస్‌ వేసుకున్నా నప్పే యాక్సెసరీస్‌ ఉపయోగిస్తే ఎంతో అందగా కనిపిస్తారు. మరి ఆ యాక్సెసరీస్‌ని ఎంచుకునే సమయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటో చూద్దాం.
- హ్యాండ్‌బ్యాగులని మన శరీరాకృని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోవాలి. కాస్త ఎత్తు తక్కువ ఉండేవారు పెద్ద బ్యాగుల జోలికి వెళ్లద్దు. అలాగే సన్నగా ఉన్నవారికి వెడల్పాటి బ్యాగుల కన్నా గుడ్రంగా ఉండే బ్యాగులే బాగా నప్పుతాయి.
- మెడలో ధరించే నగల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎత్తు తక్కువ ఉన్నప్పుడు, లేదా లావుగా ఉన్నప్పుడు మెడకు దగ్గరగా ఉండే నెక్లెస్‌లు, చోకర్లు అంతగా నప్పవు. సన్నగా, పొడవుగా ఉండే చైన్స్‌ అయితే బాగుంటాయి. అదే మెడ సన్నగా, పొడుగ్గా ఉన్నవారు మెడకి దగ్గరగా ఉండే గొలుసులు వేసుకుంటే బాగుంటుంది.
- చెప్పులు ఎప్పుడూ మనం వేసుకున్న డ్రెస్‌ని డామినేట్‌ చేయకూడదు. వీలయితే మ్యాచింగ్‌ వేసుకోవచ్చు. లేదంటే బ్రౌన్‌, బ్లాక్‌ వంటి సాధారణ రంగుల్లో ఉంటే బాగుంటుంది.
- ఆకర్షణీయమైన డ్రెస్‌ వేసుకున్నప్పుడు చెవులకు కొంచెం పెద్ద హేంగింగ్స్‌ పెట్టుకొని, మెడలో మాత్రం సింపుల్‌ చైన్‌ వేసుకుంటే బాగుంటుంది. అదే డ్రెస్‌ సింపుల్‌గా ఉన్నప్పుడు గొలుసు కొంచెం గ్రాండ్‌గా ఉంటే బావుంటుంది.
- చేతికి బంగారు గాజులు, మెడలో ముత్యాలు, ఇలా వైవిధ్యంగా కాకుండా అన్నీ ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి.
- యాక్సెసరీస్‌లో మీదైన ఓ శైలిని ఏర్పరచుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు.

ప్రత్యేకంగా కనిపించాలంటే...

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

నేర్చుకుందాం...

10-04-2020

కరోనా కారణంగా సెలవులు కాని సెలవులు వచ్చాయి. మామూలుగా వేసవి సెలవులు అయితే బంధువుల ఇళ్ళకో వెళ్ళవచ్చు. లేదంటే ఏ పార్కులకో, టూర్లకో వెళ్ళి కాలక్షేపం చేసి రావొచ్చు. కానీ ఈ సెలవులు అలాంటివి కావు.

manavi

ఫ్యాషన్‌

స్కర్ట్స్‌తో సౌకర్యంగా...

17-03-2020

బుజ్జాయిలకు ఏ వెరైటీ బట్టలు వేసిన చూడముచ్చటగా వుంటారు. అందులోనూ అమ్మాయిలకైతే ఇక మాటల్లో చెప్పలేం. పొట్టి పొట్టి స్కర్ట్స్‌లో తెగ ముద్దొచ్చేస్తారు. అందుకే తల్లులు తమ బుట్టబొమ్మలకు రకరకాల దుస్తులు వేసి

manavi

ఫ్యాషన్‌

క‌నువిందు చేసే కుర్తీలు

03-03-2020

కుర్తీలు... నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎన్ని కొత్త వెరైటీలు వచ్చినా వీటి ప్రాధాన్యతే వేరు. అందుకే మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు అందరికీ నప్పేట్టు అధునాత మోడల్స్‌ వచ్చేస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల డెనిమ్‌ కుర్తీలు

manavi

ఫ్యాషన్‌

బటన్స్‌తో బహుచక్కగా...

01-03-2020

కళాత్మక దృష్టి ఉండాలి కానీ ఏ వస్తువుతోనైనా అందమైన కళాకృతులు సృష్టించవచ్చు. అలా తయారైనవే ఇవి. మనం వాడిపారేసిన దుస్తులకుండే గుండీలను గోడలపై ఇలా అందంగా అలంకరింవచ్చు. మనకిష్టమైన ఆకృతుల్లో పేర్చుకోవచ్చు. మరి మీరూ ట్రై చేయండి.

manavi

ఫ్యాషన్‌

అందంగా ఉండేలా...

29-02-2020

తాజా పూలతో ఫ్లవర్‌వాజ్‌ను అలంకరించి హాలులోని టేబుల్‌పై పెడితే ఇంటికి అందంగా ఉండడమే కాకుండా, మనసుకు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి అటువంటి అలంకరణలో ఎలాంటి పువ్వులు వాడాలి, వాటిని ఎలా అలంకరించాలో తెలుసుకుందామా!

manavi

ఫ్యాషన్‌

పట్టు ఆక‌ట్టు‌కునేట్టు‌

25-02-2020

ఎన్ని ఫ్యాషన్‌లు వచ్చినా పట్టుపరికిణీలు, పట్టు పావడాలకుండే ప్రత్యేకతే వేరు. సంప్రదాయ వేడుకల్లో మొదటి స్థానం వీటిదే. ఇక పిల్లలు ధరిస్తే ఆ అందం చెప్పక్కర్లేదు. అద్భుతమే.. రకరకాల డిజైన్లు, మిరుమిట్లు గొలిపే వస్త్రాల

manavi

ఫ్యాషన్‌

సృజనాత్మక ప్రక్రియ

12-02-2020

కొంతమంది ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడు తుంటే ఎప్పుడూ ముగిస్తారా అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఏదో ఒకటి మాట్లాడామా అన్నట్లుగా కాకుండా... అందరినీ అలెర్ట్‌ చేయాలంటే కొన్ని టిప్స్‌ పాటించడం ముఖ్యం.... అవే ఇవి...

manavi

ఫ్యాషన్‌

ఎన్నో వ‌ర్ణాల ఇల్కాల్‌

11-02-2020

మగ్గాలపై తయారయ్యే నేత చీరలకు డిమాండ్‌ ఎప్పుడూ తగ్గదు. బళ్ళారికి దగ్గరలో ఉన్న ఇల్కాల్‌ అనే చిన్నపట్టణం ఈ చీరలకు ఎంతగానో ప్రసిద్ధి. నూలు, పట్టు మిశ్రమంతో చీరను ఎన్నో డిజైన్‌లలో నేస్తారు. ఈ చీరకున్న మరో