అందంగా ఉండేలా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

అందంగా ఉండేలా...

తాజా పూలతో ఫ్లవర్‌వాజ్‌ను అలంకరించి హాలులోని టేబుల్‌పై పెడితే ఇంటికి అందంగా ఉండడమే కాకుండా, మనసుకు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి అటువంటి అలంకరణలో ఎలాంటి పువ్వులు వాడాలి, వాటిని ఎలా అలంకరించాలో తెలుసుకుందామా!
- ఫ్లవర్‌వాజ్‌లో పువ్వులు అలంకరించేటప్పుడు, పువ్వులతో పాటు మధ్యమధ్యలో ఆకులు కూడా పెట్టాలి. ఆకులు నీళ్లలో మునగకూడదు. అదే పూల ఆకులు కాకుండా వేరు ఆకులతో అలంకరిస్తే ఫ్లవర్‌వాజ్‌ అందంగా ఉంటుంది.
- బాగా వికసించిన ముదురురంగు పువ్వులు మధ్యలో ఉంచి, అరవిరిసిన పువ్వులు చుట్టూరా పెట్టాలి. ఇలా చేస్తే అవి కూడా విచ్చుకుంటాయి.
- ఎరుపు, నేరేడు రంగు, ముదురు రంగు పువ్వులు ఒకేచోట కాకుండా మ్యాచింగ్‌ ఉండేలా చూడాలి. పువ్వుల రంగులు ఆ గది రంగుకి మ్యాచ్‌ అయ్యేవిధంగా పెట్టాలి. అలాగని మనకు నచ్చని రంగుల పువ్వులను పెట్టడం కాదు. అలా పెట్టే పువ్వులు ముందుగా మనకు ఆహ్లాదాన్ని కలిగించాలి.
- ఫ్లవర్‌వాజ్‌ లోపల, బయట శుభ్రంగా కడిగి అందులో నీరు నింపాలి. నీళ్లల్లో కాస్తంత ఉప్పు కలిపితే పువ్వులు ఎక్కువ కాలం ఉంటాయి.
- ఫ్లవర్‌వాజ్‌ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నచోట పెట్టకుండా తాజా గాలి వచ్చే చోట పెట్టాలి. దీనివల్ల తాజాగా ఉంటాయి.
- ఇంట్లో ఇండోర్‌ ప్లాంట్స్‌, మనీప్లాంట్స్‌ కొన్ని రకాల క్రోటాన్‌ మొక్కలు కుండీలో వేసి గదుల్లో, డ్రాయింగ్‌రూంలో అలంకరించుకోవచ్చు.
- ఫ్లవర్‌వాజ్‌ అనేది కేవలం పువ్వులు మాత్రమే బాగుంటే సరిపోదు. ఆ పువ్వులు పెట్టే ఫ్లవర్‌వాజ్‌ కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. 

అందంగా ఉండేలా...

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

నేర్చుకుందాం...

10-04-2020

కరోనా కారణంగా సెలవులు కాని సెలవులు వచ్చాయి. మామూలుగా వేసవి సెలవులు అయితే బంధువుల ఇళ్ళకో వెళ్ళవచ్చు. లేదంటే ఏ పార్కులకో, టూర్లకో వెళ్ళి కాలక్షేపం చేసి రావొచ్చు. కానీ ఈ సెలవులు అలాంటివి కావు.

manavi

ఫ్యాషన్‌

స్కర్ట్స్‌తో సౌకర్యంగా...

17-03-2020

బుజ్జాయిలకు ఏ వెరైటీ బట్టలు వేసిన చూడముచ్చటగా వుంటారు. అందులోనూ అమ్మాయిలకైతే ఇక మాటల్లో చెప్పలేం. పొట్టి పొట్టి స్కర్ట్స్‌లో తెగ ముద్దొచ్చేస్తారు. అందుకే తల్లులు తమ బుట్టబొమ్మలకు రకరకాల దుస్తులు వేసి

manavi

ఫ్యాషన్‌

క‌నువిందు చేసే కుర్తీలు

03-03-2020

కుర్తీలు... నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎన్ని కొత్త వెరైటీలు వచ్చినా వీటి ప్రాధాన్యతే వేరు. అందుకే మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు అందరికీ నప్పేట్టు అధునాత మోడల్స్‌ వచ్చేస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల డెనిమ్‌ కుర్తీలు

manavi

ఫ్యాషన్‌

బటన్స్‌తో బహుచక్కగా...

01-03-2020

కళాత్మక దృష్టి ఉండాలి కానీ ఏ వస్తువుతోనైనా అందమైన కళాకృతులు సృష్టించవచ్చు. అలా తయారైనవే ఇవి. మనం వాడిపారేసిన దుస్తులకుండే గుండీలను గోడలపై ఇలా అందంగా అలంకరింవచ్చు. మనకిష్టమైన ఆకృతుల్లో పేర్చుకోవచ్చు. మరి మీరూ ట్రై చేయండి.

manavi

ఫ్యాషన్‌

పట్టు ఆక‌ట్టు‌కునేట్టు‌

25-02-2020

ఎన్ని ఫ్యాషన్‌లు వచ్చినా పట్టుపరికిణీలు, పట్టు పావడాలకుండే ప్రత్యేకతే వేరు. సంప్రదాయ వేడుకల్లో మొదటి స్థానం వీటిదే. ఇక పిల్లలు ధరిస్తే ఆ అందం చెప్పక్కర్లేదు. అద్భుతమే.. రకరకాల డిజైన్లు, మిరుమిట్లు గొలిపే వస్త్రాల

manavi

ఫ్యాషన్‌

సృజనాత్మక ప్రక్రియ

12-02-2020

కొంతమంది ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడు తుంటే ఎప్పుడూ ముగిస్తారా అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఏదో ఒకటి మాట్లాడామా అన్నట్లుగా కాకుండా... అందరినీ అలెర్ట్‌ చేయాలంటే కొన్ని టిప్స్‌ పాటించడం ముఖ్యం.... అవే ఇవి...

manavi

ఫ్యాషన్‌

ఎన్నో వ‌ర్ణాల ఇల్కాల్‌

11-02-2020

మగ్గాలపై తయారయ్యే నేత చీరలకు డిమాండ్‌ ఎప్పుడూ తగ్గదు. బళ్ళారికి దగ్గరలో ఉన్న ఇల్కాల్‌ అనే చిన్నపట్టణం ఈ చీరలకు ఎంతగానో ప్రసిద్ధి. నూలు, పట్టు మిశ్రమంతో చీరను ఎన్నో డిజైన్‌లలో నేస్తారు. ఈ చీరకున్న మరో