నేర్చుకుందాం... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

నేర్చుకుందాం...

       కరోనా కారణంగా సెలవులు కాని సెలవులు వచ్చాయి. మామూలుగా వేసవి సెలవులు అయితే బంధువుల ఇళ్ళకో వెళ్ళవచ్చు. లేదంటే ఏ పార్కులకో, టూర్లకో వెళ్ళి కాలక్షేపం చేసి రావొచ్చు. కానీ ఈ సెలవులు అలాంటివి కావు. బయటకు వెళ్ళకూడదు. ఎవరినీ కలవకూడదు. ఇంట్లోనే ఉండాలి. కాలక్షేపం చెయ్యాలి. పెద్దవాళ్ళకే విసుగుపుట్టే కాలమిది. మరి పిల్లల పరిస్థితో. మమహ్మారి కరోనాను తరిమి కొట్టాలంటే చక్కగా ఇంట్లోనే ఉండి కాలక్షేపం చెయ్యాలి. అందుకు గాను మనం ఈ రోజు కొన్ని సరదా బొమ్మల తయారీ గురించి తెలుసుకుందాం. వీటికి కావాల్సిన వస్తువులు కూడా కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే కొంత కొత్తదనాన్ని అద్దుదాం...
పప్పు ధాన్యాలతో...
ప్రతి ఇంట్లో కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు వంటి పప్పు ధాన్యాలుంటాయి కదా! వీటితో రకరకాల ఆకారాలు చేసుకోవచ్చు. ఎప్పుడూ పేపర్‌పైనే వేసే డ్రాయింగ్‌ కాకుండా ఇలా పప్పు ధాన్యాలతో సరి కొత్తగా ప్రయత్నించవచ్చు. కార్డ్‌బోర్డు మీద అతికించుకోవచ్చు. లేదంటే ఏదైనా పేపర్‌ మీదగానీ, ధర్మోకాల్‌ షీట్‌ మీద గానీ అలంకరించుకొని రెండు రోజులుంచుకొని తీసివేయవచ్చు. గుర్రం, జింక, సింహం, తాబేలు, కుందేలు వంటి జంతువుల ఆకారాతో పాటు గుర్తించే అమ్మాయి, ఇంట్లో పని చేసే అమ్మ, ఇలా ఏదైనా బొమ్మ రూపంలో మలుచుకోవచ్చు. దీనితో పిల్లల్లో పరిశీలనా శక్తి పెరుగుతుంది. జంతువుల బొమ్మలు తయారు చేసేటపుడు వాటి ఆకారమేమిటి, వాటి తోక పొట్టిగా ఉందా పొడుగ్గా ఉందా, వాటికి కొమ్ములు ఉన్నాయా లేదా ఇంకా ఎన్నో విషయాలు వారి పరిశీలనలోకి వస్తాయి. వాటిని తయారు చేయడంలో క్రియేటివిటీ మాత్రమే కాకుండా ఎంతో విజ్ఞానం లభిస్తుంది. ఇక్కడ నేను లోబియా గింజలతో కొన్ని చిత్రాలు చేశాను చూడండి. ఇవి అలచందల కుటుంబంలోని మరో రకపు గింజలు. సాధారణంగా అలచందలు తెల్లగా ఉంటాయి. కానీ ఇవి కాఫీ రంగులో ఉండి బాగా మెరుస్తూ ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. నేను వీటితో వర్లి ఆర్ట్‌లో ఉండే చిత్రాలు తయారు చేశాను. వర్లి అనేది భారతదేశంలోని సహద్రి పర్యతాల గిరిజనుల చిత్రకళ. ఈ ఆర్ట్‌ ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నది. ఇలా నేను వర్లి అనే గిరిజన చిత్రకళనూ, అధిక ప్రోటీన్లు దొరికే లోబియా గింజల్నీ కలిపి చిత్రాలు తయారు చేశాను. ఇలా ఇంట్లో ఉన్న అన్ని గింజలతో తయారు చేయవచ్చు.
ఆకులు, పువ్వులతో...
ఇల్లన్నాక ఏదో ఒక చెట్టు ఉంటుంది. పోనీ ఇంట్లో చెట్లు లేకపోయినా పర్లేదు. వీధిలోనూ, డివైడర్ల మీద చాలా రకాల చెట్లుంటాయి. వీటి కోసం మరీ దూరంగా అయితే వెళ్ళవద్దు. నాలుగు ఆకులూ, పది పూలూ ఉంటే చాలు. ఏదో ఒక ఆకారం చేసెయ్యవచ్చు. ఆకుల్ని, పువ్వుల్ని అందంగా అమర్చడమే మన ప్రధాన ఉద్దేశ్యం. నేను ఆకుల్నీ, పువ్వుల్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి అందమైన రంగవల్లికల్లా తయారు చేశాను. ఇంకా కొన్ని పూలకుండీల్లా, పిల్లల పేర్లలా, జంతువుల్లా, మనుషుల్లా ఎన్నో రకాలుగా అమర్చాను. మీరూ ప్రయత్నించండి. చాలా కొత్తగా అనిపిస్తుంది. మొదటగా మీ పేరు రాసుకోండి.
ఎండిన కాయలతో...
వేప, రాగి, కానుగ, మర్రి లాంటి పెద్ద పెద్ద చెట్లకింద ఎన్నో పుల్లలు, కాయలు రాలిపడి ఉంటాయి. ఇవి గ్రామాల్లో వుండే వాళ్ళకయితే అందుబాటులో వుంటాయి. అలాంటి పుల్లలు, కాయలు, విత్తనాలు వంటివి సేకరించి కూడా ఎన్నో బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఎండిన కాయల్లో విత్తనాలు రాలిపోయాక అవి బాగా వంకర తిరిగి వుంటాయి. స్పైరల్‌గా ఉండి బాగుంటాయి. నేను వీటితో చాలా బొమ్మలు చేశాను. మీరూ పక్షుల్లా పుల్లా, పుడకా ఏరుకొచ్చి వాటిని ఒక క్రమ పద్ధతిలో అలంకరిస్తే ఎన్నో బొమ్మలు రూపుదిద్దుకుంటాయి. వీటి వలన కేవలం సరదా మాత్రమే కాక ఏ చెట్టు కాయలు ఎలా ఉంటాయి, వాటి విత్తనాలు వ్యాప్తి ఎలా జరుగుతుంది వంటి సైన్స్‌ విషయాలూ తెలుసుకునే అవకాశం తల్లిదండ్రులు కల్పించాలి.
మరెన్నింటితోనే...
ఇక ఇంట్లో ఉండే పాత చొక్కాలు, నిక్కర్లు, పాంట్లకు ఉండే గుండీలను సేకరించాలి. వాటినన్నింటినీ దగ్గర పెట్టుకున్నాక వాటితో రకరకాల బొమ్మలు చేయవచ్చు. చెట్లు, కొండలు, పడవలు వంటి ప్రకృతిలో ఉండే వాటిని తయారు చేయవచ్చు. పిల్లలకు ప్రకృతిని పరిచయం చేస్తూ తల్లిదండ్రులు వారికి సలహానిస్తూ మధ్యలో వాటి విశేషాలను చెప్తుంటే ఇంకా చాలా బావుంటుంది. ఇంకా ఇంట్లో ఎండు కొబ్బరి చిప్పలుంటాయి కదా! వాటినీ వదలొద్దు. వాటిని తెచ్చేసుకోండి. అమ్మనడిగి కుందన్లు తీసుకోండి. రంగురంగుల కుందన్లను ఒక క్రమంలో అతికిస్తే ఎంతో అందంగా అమరుతాయి. పూర్తిగా తయారు చేసి అద్దాల అలమరలో భద్రపరచుకోండి. అందరికీ మీ క్రియేటివిటీని చూపించవచ్చు. మళ్ళీ కొన్ని కొత్త ఐడియాలతో మరోసారి కలుద్దాం!
- డా|| కందేపి రాణీప్రసాద్‌, 9866160378

నేర్చుకుందాం...

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

స్కర్ట్స్‌తో సౌకర్యంగా...

17-03-2020

బుజ్జాయిలకు ఏ వెరైటీ బట్టలు వేసిన చూడముచ్చటగా వుంటారు. అందులోనూ అమ్మాయిలకైతే ఇక మాటల్లో చెప్పలేం. పొట్టి పొట్టి స్కర్ట్స్‌లో తెగ ముద్దొచ్చేస్తారు. అందుకే తల్లులు తమ బుట్టబొమ్మలకు రకరకాల దుస్తులు వేసి

manavi

ఫ్యాషన్‌

క‌నువిందు చేసే కుర్తీలు

03-03-2020

కుర్తీలు... నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎన్ని కొత్త వెరైటీలు వచ్చినా వీటి ప్రాధాన్యతే వేరు. అందుకే మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు అందరికీ నప్పేట్టు అధునాత మోడల్స్‌ వచ్చేస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల డెనిమ్‌ కుర్తీలు

manavi

ఫ్యాషన్‌

బటన్స్‌తో బహుచక్కగా...

01-03-2020

కళాత్మక దృష్టి ఉండాలి కానీ ఏ వస్తువుతోనైనా అందమైన కళాకృతులు సృష్టించవచ్చు. అలా తయారైనవే ఇవి. మనం వాడిపారేసిన దుస్తులకుండే గుండీలను గోడలపై ఇలా అందంగా అలంకరింవచ్చు. మనకిష్టమైన ఆకృతుల్లో పేర్చుకోవచ్చు. మరి మీరూ ట్రై చేయండి.

manavi

ఫ్యాషన్‌

అందంగా ఉండేలా...

29-02-2020

తాజా పూలతో ఫ్లవర్‌వాజ్‌ను అలంకరించి హాలులోని టేబుల్‌పై పెడితే ఇంటికి అందంగా ఉండడమే కాకుండా, మనసుకు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి అటువంటి అలంకరణలో ఎలాంటి పువ్వులు వాడాలి, వాటిని ఎలా అలంకరించాలో తెలుసుకుందామా!

manavi

ఫ్యాషన్‌

పట్టు ఆక‌ట్టు‌కునేట్టు‌

25-02-2020

ఎన్ని ఫ్యాషన్‌లు వచ్చినా పట్టుపరికిణీలు, పట్టు పావడాలకుండే ప్రత్యేకతే వేరు. సంప్రదాయ వేడుకల్లో మొదటి స్థానం వీటిదే. ఇక పిల్లలు ధరిస్తే ఆ అందం చెప్పక్కర్లేదు. అద్భుతమే.. రకరకాల డిజైన్లు, మిరుమిట్లు గొలిపే వస్త్రాల

manavi

ఫ్యాషన్‌

సృజనాత్మక ప్రక్రియ

12-02-2020

కొంతమంది ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడు తుంటే ఎప్పుడూ ముగిస్తారా అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఏదో ఒకటి మాట్లాడామా అన్నట్లుగా కాకుండా... అందరినీ అలెర్ట్‌ చేయాలంటే కొన్ని టిప్స్‌ పాటించడం ముఖ్యం.... అవే ఇవి...

manavi

ఫ్యాషన్‌

ఎన్నో వ‌ర్ణాల ఇల్కాల్‌

11-02-2020

మగ్గాలపై తయారయ్యే నేత చీరలకు డిమాండ్‌ ఎప్పుడూ తగ్గదు. బళ్ళారికి దగ్గరలో ఉన్న ఇల్కాల్‌ అనే చిన్నపట్టణం ఈ చీరలకు ఎంతగానో ప్రసిద్ధి. నూలు, పట్టు మిశ్రమంతో చీరను ఎన్నో డిజైన్‌లలో నేస్తారు. ఈ చీరకున్న మరో