సంక్రాంతి వంటలు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిపండుగ స్పెషల్

సంక్రాంతి వంటలు

రైతుల పండుగ అయిన సంక్రాంతిని మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. కొత్తగా పండిన పంటలతో చేసే వివిధ రుచుల పిండివంటలు సంక్రాంతి స్పెషల్స్‌గా నోరూరిస్తాయి. మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తూ జరుపుకునే సంక్రాంతికి, తమ ప్రాంతంలో పండే పంటలనుబట్టి వంటలు వండుతారు. దక్షిణాది రాష్ట్రాల్లో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో సంక్రాంతిని ఘనంగా ఆహ్వానం పలుకుతారు. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి స్పెషల్‌ డిషెస్‌ను పరిచయం చేసుకుందాం..

పతిషప్తా
బెంగాలీ సంప్రదాయ వంటకమైన పతిషప్తాను సంక్రాంతికి వండి వడ్డిస్తారు. స్టఫ్డ్‌ డెజర్ట్‌గా పేరుగాంచిన ఈ పతిషప్తా చాలా రుచి కరంగా ఉంటుంది. పతిషప్తా రెండు రకాల్లో నోరూరిస్తుంది. క్రిస్పీ క్రేప్‌గా తయారు చేసేందుకు ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌, స్వీట్‌, బెల్లం, కొబ్బెరి లేదా ఖోయాతో నింపి చేస్తారు. దీన్ని మళ్లీ కండెన్స్డ్‌ పాలలో ముంచుతారు. వీటిని మనమూ ఈ సంక్రాంతికి సెలవుల్లో ట్రై చేయచ్చు..

దహి చురా గుర్‌
బిహార్‌లో ఇది అత్యంత పాపులర్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ డిష్‌. పెరుగు, అటుకులు లేదా వేయించిన అటుకులు, బెల్లం వేసి ఎంతో సులభంగా తయారు చేసే ఈ వంటకాన్ని బిహార్‌లో తప్పకుండా సంక్రాంతి రోజు తింటారు. మకర సంక్రాంతి రోజు తప్పకుండా బెల్లం, నువ్వులు తినటం అన్నది బిహార్‌లో ఆచారం కూడా. శీతాకాలం నుంచి వేసవిలోకి అడుగుపెట్టే సమయంలో నువ్వులు, బెల్లం తినటంతో మన శరీరం కొత్త వాతావరణానికి ఈజీగా అలవాటు పడుతుందని ఇందులోని అంతార్థం కనుక సంక్రాంతికి చేసే వంటకాలు తీపి అయినా కారం అయినా వాటన్నింటిలో బెల్లం, నువ్వులు విరివిగా ఉపయోగిస్తారు. .
కిచిడి
హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు కిచిడి వండుకుని దానిపై నెయ్యి దట్టించి వేసుకుని ఆరగిస్తారు. కందిపప్పు, బియ్యం వేసి వండే ఈ కిచిడీలోకి హిమాచలీలు కొందరు కూరగాయలు కూడా వేసుకుని .. వాటిలోకి అప్పడాలు చెట్నీ వేసుకని కడుపారా తింటారు.
తిల్‌ కీ చిక్కీ
సంక్రాంతి పండుగ అంటేనే నువ్వులు వివిధ రూపాల్లో తినే పండుగ కాబట్టి హర్యానాలో నువ్వులతో చిక్కీ చేసి అందరూ పంచుకుని తింటారు. బెల్లం, నువ్వుల్లో ఉన్న ఆరోగ్యకరమైన సుగుణాలన్నీ ఒంట్లోకి పోయేందుకు ఇది సహకరిస్తుంది. బెల్లం పాకంతో నువ్వులు లేదా నువ్వుల పొడి వేసి చేసే లడ్డూలు, చిక్కీలు రుచి కూడా చాలా బాగుంటాయి. మంచి పోషకాలు నిండిన ఈ చిక్కీలను చిన్నా పెద్దా అంతా ఇష్టంగా తింటారు. హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో సంక్రాంతికి విధిగా చిక్కీలు చేసి తింటారు.
ఉంధియా
శీతాకాలంలో గుజరాతీలు ఎక్కువగా చేసుకుని ఇష్టంగా లాగించే వంటకం ఉంధియూ. కందగడ్డ, ఆలూ, పచ్చి అరటికాయ, బీన్స్‌, కసూరీ మేతి వంటివన్నీ వేసి చేసే సింగిల్‌ డిష్‌ను ఉంధియూ అంటారు. సరిగ్గా చెప్పాలంటే ఇది మన కలగూరనే. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తినేంత రుచి ఉన్న ఉంధియాని మట్టిపాత్రలో తలకిందలుగా చేసి వండుతారు. గుజరాతీలో ఉంధు అంటే తలకిందలు అని అర్థం.
పూరన్‌ పోలీ
మనం భక్ష్యాలు లేదా ఓళిగళు లేదా బొబ్బట్లు లేదా పోళెలు అని పిలుచుకునే స్వీట్‌ పరాఠాను మహారాష్ట్రలో పూరన్‌ పోలీ అంటారు. బెల్లంతో శెనగపప్పు వేసిన పుర్ణాన్ని రుబ్బుకుని మైదా లోపల స్టఫ్‌ చేసి చపాతీలా వత్తి చేసే పూరన్‌ పోలీలను మహారాష్ట్రలో సంక్రాంతికి వండుకుంటారు. దీనిపై నెయ్యి వేసుకుని తింటే మరింత రుచికరంగా ఉంటుంది.

సంక్రాంతి వంటలు

MORE STORIES FROM THE SECTION

manavi

పండుగ స్పెషల్

హామీ పత్రం

14-02-2021

ఈ నేను చెప్పబోయే సమాధానం కోసం నువ్వెంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటావని నాకు తెలుసు. సమాధానం చెప్పే ముందు నేను నీతో మాట్లాడాల్సిన విషయాలు ఎన్నో వున్నాయి.

manavi

పండుగ స్పెషల్

ప్రేమ ఓ గొప్ప అనుభూతి

14-02-2021

'ప్రేమంటే పరస్పరం చూసుకోవడం కాదు. ఇద్దరూ ఒకే దృష్టికోణంలో బయటి ప్రపంచాన్ని చూడడం' అన్నాడు ఒక ఫ్రెంచి రచయిత. ఆనందాఁకి ద్వారాలు తీసే ప్రేమను ఎవరైనా ఆహ్వానిస్తారు. అటువంటి ప్రేమ కోసం

manavi

పండుగ స్పెషల్

ముత్యాల ముగ్గులు

11-01-2021

సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లు సప్తవర్ణాల హరివిల్లులవుతాయి. నింగిలోని నక్షత్రాలన్నీ నేలదిగి వాకిళ్లలో ముత్యాల ముగ్గులై మెరిసిపోతాయి. అలా ముంగిట రంగురంగుల ముగ్గులతో నింపే ఆడబిడ్డలకు

manavi

పండుగ స్పెషల్

ముత్యాల ముగ్గులు

08-01-2021

సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లు సప్తవర్ణాల హరివిల్లులవుతాయి. నింగిలోని నక్షత్రాలన్నీ నేలదిగి వాకిళ్లలో ముత్యాల ముగ్గులై మెరిసిపోతాయి. అలా ముంగిట రంగురంగుల ముగ్గులతో

manavi

పండుగ స్పెషల్

సంక్రాంతి ముగ్గు

08-01-2021

సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లు సప్తవర్ణాల హరివిల్లులవుతాయి. నింగిలోని నక్షత్రాలన్నీ నేలదిగి వాకిళ్లలో ముత్యాల ముగ్గులై మెరిసిపోతాయి. అలా ముంగిట రంగురంగుల ముగ్గులతో