'ప్రేమంటే పరస్పరం చూసుకోవడం కాదు. ఇద్దరూ ఒకే దృష్టికోణంలో బయటి ప్రపంచాన్ని చూడడం' అన్నాడు ఒక ఫ్రెంచి రచయిత. ఆనందాఁకి ద్వారాలు తీసే ప్రేమను ఎవరైనా ఆహ్వానిస్తారు. అటువంటి ప్రేమ కోసం వేచిచూస్తారు. కానీ నేటి ప్రేమల్లో వేచిచూడటం శుద్ద దండగనుకుంటున్నారు. ప్రస్తుత బిజీ జీవితంలో ప్రేమ కూడా వేగంగా పరుగులు తీస్తుంది. అప్పటికప్పుడే మారిపోతుంది. ఆ వేగం, మార్పు ఎంతగా అంటే ప్రేమిస్తున్నా వారికి కూడా అందనంతగా. దాంతో ప్రేమకంటూ ఒక రోజును సృష్టించేశారు. అందుకే ఈ రోజు ప్రేమికులకు ఓ ప్రత్యేకమైపోయింది. విలువైన బహుమతులు, పార్కులు, సినిమాలు, షికార్లు ఇవే ప్రేమంటే అని చెబుతుంది ఈ రోజు...
ప్రేమ ఒక నిరంతర ప్రవాహం. ప్రేమను వర్ణించడం సులువే, కానీ నిర్వచించడమే కష్టం. ప్రేమించటం, ప్రేమించబడటం ఒక గొప్ప అనుభూతి. అది నిజమైన ప్రేమైతే ఇక జీవితమంతా సుఖప్రదమే. నిజమైన ప్రేమలో అనుమానానికి తావుండదు. నమ్మకమే అక్కడ రాజ్యమేలుతుంది. ప్రేమించిన వారు పొరపాటు చేసినా ఆ ప్రేమ ముందు పొరపాటు దూదిపింజలాంటిదే. కష్టాలను, బాధలను నిజమైన ప్రేమ మైమరపింపచేస్తుంది. నీకు నేనున్నాననే నమ్మకాన్ని కలిగిస్తుంది. చిన్న చిన్న గిల్లికజ్జాలు వచ్చినా వారి మధ్య వున్నటువంటి స్వచ్ఛమైన ప్రేమ ముందు అవి ఏపాటివి. అందుకే కాలం పరుగులు తీస్తున్నా ప్రేమ మాత్రం చిరకాలం ఉంటుంది. శతాబ్దాలు గడుస్తున్నా ప్రేమకున్న గొప్పదనం పెరుగుతూనే ఉంది.
అయితే నేటి ఆధునిక ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ కలుషితమవుతుంది. ప్రేమంటే కేవలం కొంత కాలం సరదాగా గడపడం. ప్రేమించుకున్న వారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటే అదే నిజమైన ప్రేమ. ఈ భావాన్ని ప్రపంచీకరణ యుగం మరికాస్త పెంచిపోషిస్తోంది. తాము ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకాల కోసం ప్రేమను, ప్రేమికులను సృష్టిస్తోంది. అలా సృష్టించిన ప్రేమ ఎంతకాలం మనగలుగుతుంది. సరిగ్గా ప్రేమించడం కొందరికే తెలుసు. ఆ ప్రేమను కులుపుకోవడం చాలా కొద్ది మందికే తెలుసు. అందుకే నేటి ప్రేమలు ఎక్కువకాలం నిలవలేక మధ్యలోనే కనుమరుగవుతున్నాయి. ఫలితంగా నిజమైన ప్రేమకు సైతం ఈ ప్రపంచీకరణ యుగంలో విలువ లేకుండా పోతుంది. ఈ మాయ నుండి ఇప్పటికైనా బయట పడదాం. ఈర్ష్యా, ద్వేషం, స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమను కాపాడుకుందాం...
ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక
MORE STORIES FROM THE SECTION

పండుగ స్పెషల్

పండుగ స్పెషల్

పండుగ స్పెషల్

పండుగ స్పెషల్

పండుగ స్పెషల్

పండుగ స్పెషల్

పండుగ స్పెషల్

పండుగ స్పెషల్

పండుగ స్పెషల్

పండుగ స్పెషల్
MORE SECTIONS
Recent From Manavi