ఈ పండ్లు తినండి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఈ పండ్లు తినండి

చాలా మంది వర్షాకాలం వచ్చిందంటే చాలు గరం గరం సమోస, మిర్చి బజ్జీలు లాగించాలి అనిపిస్తుంది. అయితే వర్షాకాల సీజన్‌లో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కొన్ని ప్రత్యేక పండ్లు తినాలి. ఈ కాలంలో వచ్చే వ్యాధులను దూరంగా ఉంచేందుకు మనకు అందుబాటులో ఉండే ఈ పండ్లు ఎంతో ఉపయోగపడతాయి.
నేరేడు: వర్షాకాలంలో ఎక్కువగా దొరికేవి నేరేడు పండ్లు. నేరేడును పండ్లలో రాజు అని కూడా అంటారు. ఇందులో కేలొరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, ఫోలేట్‌, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి. అజీర్తి సమస్యను ఇవి తగ్గిస్తాయి.
దానిమ్మ: రోగనిరోధక శక్తి పెంచడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ రోజూ ఓ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు.
యాపిల్‌: వర్షాకాలంలో జీవక్రియల రేటు కాస్త నిదానంగా ఉంటుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్‌ ముక్కలు తింటే ఆరోగ్యంగా, చురుగ్గా కూడా ఉంటాం.
అరటి: అరటిలో విటమిన్లూ, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటికి ఉంది. అజీర్తి సమస్య ఉండదు. పిల్లలకు రోజూ ఓ పండు తినిపించాలి. దీంతో శరీరానికి శక్తి అందడమే కాదు, పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది.
బొప్పాయి: విటమిన్‌ 'సి' అధికంగా లభించే బొప్పాయి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వానాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువ. అయితే బొప్పాయిని మితంగా తీసుకుంటేనే మంచిది.

ఈ పండ్లు తినండి

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కమలాలతో ఆరోగ్యం

28-11-2020

మార్కెట్లో ఎక్కడ చూసినా కమలా పండ్లు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో లభించే పండ్లలో కమలా పండు ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సిట్రిక్‌

manavi

ఆరోగ్యం

లక్షణాలు ఇవే

28-11-2020

ప్రతి 28 రోజులకు ఒకసారి క్రమం తప్పక వచ్చే రుతుస్రావం మరుసటి నెలలో తప్పిపోవడం గర్భం వచ్చింద నటానికి స్పష్టమైన సంకేతం. అయినప్పటికీ,

manavi

ఆరోగ్యం

పోషకాల ఫలం

18-11-2020

సీతాఫలంలో పుష్కలంగా పోషకాలుంటాయి. విటమిన్‌ సీ, ఏ, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మనకు ఎంతో ఆరోగ్యకరం. శీతాకాలంలో ఎక్కువగా