తల్లి ఒత్తిడికి గురైతే..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

తల్లి ఒత్తిడికి గురైతే..?

మీ పాపకి నిద్ర సరిగ్గా పట్టడం లేదా... కడుపునిండా పాలు తాపినా పడుకోడానికి కష్టపడుతున్నారా... అయితే ఆ తప్పు వారిది కాదు, మీదే! అవును... బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి డిప్రెషన్‌కి గురైతే ఆ ప్రభావం పుట్టిన పిల్లలపై పడుతుందని అంటున్నారు నిపుణులు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది.
గర్భవతి అయిన తర్వాత మూడు నుంచి ఏడు మాసాల కాలం చాలా విలువైనది. ఈ సమయంలో తల్లి మానసిక స్థితి, ఆనందం, ఆమె ఆలోచనలూ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో తల్లి ఎంత ఆనందంగా ఉందనే విషయం బిడ్డ నిద్రపోయే సమయాన్ని నిర్ణయిస్తుందట. ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఆనందంగా తల్లి కాబోతున్న విషయాన్ని ఎంజారు చేసే తల్లులకు పుట్టిన పిల్లలు... మిగిలిన వారితో పోలిస్తే సుఖంగా నిద్రపోతున్నారట. అలాకాకుండా అనేక ఆలోచనలతో సతమతమవుతూ మానసికంగా కుంగిపోయి డిప్రెషన్లో కూరుకుపోయే వారి పిల్లలు నిద్రలేమితో బాధపడుతున్నారు.
అయితే తల్లి కాబోతున్నప్పుడు మహిళల్లో అనేక రకాల ఆలోచనలూ, భయాలు మొదల వుతాయి. వీటి నుంచి బయటపడి మాతృత్వాన్ని ఎంజారు చేసేలా చేయాల్సిన బాధ్యత వారి భర్తలు, కుటుంబ సభ్యులపైనే ఉంటుంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఆత్మస్థైర్యం పెంచుతూ, ఒత్తిడిని దూరం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా గర్భవతి అని చూడకుండా ఆమెని తిట్టినా, అవమానించినా, చులకన చేసి మాట్లాడినా ఆ ప్రభావం బిడ్డ మానసిక పరిస్థితిపై పడు తుందని ఈ అధ్యయనంలో నిరూపితమైంది.
అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ చూపించాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. లేకపోతే పుట్టబోయే పిల్లలపై ఆ ప్రభావం చాలా రోజులపాటు ఉంటుంది. అమెరికాలో 833మంది పిల్లలపై చేసిన సర్వేలో ఈ విషయాలు తేలాయి. వీరంతా ఆరేండ్లలోపు పిల్లలే. పిల్లలు నిద్రపోయే సమయం, వీరి తల్లులు గర్భవతిగా ఉన్నప్పుడు మానసిక స్థితి ఆధారంగా ఓ డేటా తయారు చేశారు. ఇందులో తల్లి మానసిక స్థితి, బిడ్డ ఆరోగ్యంపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టంగా నిర్ధారణ అయ్యింది. ఈ సర్వే రిపోర్టును 'స్లీప్‌ 2018' సమావేశంలో వెల్లడించారు.

తల్లి ఒత్తిడికి గురైతే..?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కమలాలతో ఆరోగ్యం

28-11-2020

మార్కెట్లో ఎక్కడ చూసినా కమలా పండ్లు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో లభించే పండ్లలో కమలా పండు ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సిట్రిక్‌

manavi

ఆరోగ్యం

లక్షణాలు ఇవే

28-11-2020

ప్రతి 28 రోజులకు ఒకసారి క్రమం తప్పక వచ్చే రుతుస్రావం మరుసటి నెలలో తప్పిపోవడం గర్భం వచ్చింద నటానికి స్పష్టమైన సంకేతం. అయినప్పటికీ,

manavi

ఆరోగ్యం

పోషకాల ఫలం

18-11-2020

సీతాఫలంలో పుష్కలంగా పోషకాలుంటాయి. విటమిన్‌ సీ, ఏ, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మనకు ఎంతో ఆరోగ్యకరం. శీతాకాలంలో ఎక్కువగా