వయసు పెరిగే కొద్దీ... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

వయసు పెరిగే కొద్దీ...

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ శరీరంలో ఆయా అవయవాల పనితీరు కూడా కాస్త నెమ్మదిస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ. ఈ వయసులో మరీ జీర్ణంకానటువంటి పదార్థాలను తీసుకుంటే సమస్య మరీ జఠిలమవుతుంది. అలాగే వయసు పెరిగి వృద్ధాప్యంలో పడుతున్న సమయంలో శరీరానికి శక్తి కూడా కావాలి. కాబట్టి తగిన పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి
- వృద్ధుల్లో విటమిన్‌ డి, క్యాల్షియం, విటమిన్‌ బీ12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం చాలా ఎక్కువ. తక్కువ కొవ్వు పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌ డి, క్యాల్షియం లభిస్తుంది. ఇవి ఎముక పుష్టికి దోహదం చేస్తాయి.
- చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాసం నుంచి విటమిన్‌ బీ 12 అందుతుంది. సాధారణంగా వృద్ధాప్యంలో తప్పనిసరిగా వేధించే సమస్య మలబద్ధకం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం అధికంగా తీసుకుంటే ఈ బాధ నుంచి తేలికగా బయటపడొచ్చు. వీటన్నింటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది.
- పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాల్లో వృద్ధులకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది. అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించటం శ్రేయస్కరం. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దుతిరుగుడు నూనె వంటివి, అదీ మితంగా తీసుకుంటే మంచిది.

వయసు పెరిగే కొద్దీ...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కమలాలతో ఆరోగ్యం

28-11-2020

మార్కెట్లో ఎక్కడ చూసినా కమలా పండ్లు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో లభించే పండ్లలో కమలా పండు ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సిట్రిక్‌

manavi

ఆరోగ్యం

లక్షణాలు ఇవే

28-11-2020

ప్రతి 28 రోజులకు ఒకసారి క్రమం తప్పక వచ్చే రుతుస్రావం మరుసటి నెలలో తప్పిపోవడం గర్భం వచ్చింద నటానికి స్పష్టమైన సంకేతం. అయినప్పటికీ,

manavi

ఆరోగ్యం

పోషకాల ఫలం

18-11-2020

సీతాఫలంలో పుష్కలంగా పోషకాలుంటాయి. విటమిన్‌ సీ, ఏ, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మనకు ఎంతో ఆరోగ్యకరం. శీతాకాలంలో ఎక్కువగా