గుడ్లను ఫ్రిజ్‌ లో ఉంచవ‌చ్చా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

గుడ్లను ఫ్రిజ్‌ లో ఉంచవ‌చ్చా?

పోషకాహారాలు కొలువై ఉన్న ఆహార పదార్థాల్లో గుడ్డు ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్లను తినడం అవసరం కూడా. రోగ నిరోధక శక్తిని పెంచడంలో వాటికి సాటేది లేదు. కానీ గుడ్లను ఎక్కువరోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం మంచిది కాదంటున్నారు నిపుణులు. గుడ్లను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచుతారా? అలా చేయడం వల్ల ప్రమాదమే ఎక్కువట. అనారోగ్యాలను కొనితెచ్చుకోవడమేనట.
- గుడ్లు ఎక్కువరోజులు నిల్వ ఉంటే అందులో బాక్టీరియా పెరిగి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
- పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత సున్నా కంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని ఉంచడం మంచిదే. కానీ గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వాటిలో ఒక రకమైన హానికరమైన బ్యాక్టీరియా పుడుతుంది.
- గుడ్లను ఉడికించినప్పుడు సాధారణంగా ఫ్రిజ్‌ నుండి గుడ్లను తీసి నేరుగా వాటిని ఉపయోగిస్తాము. కాబట్టి గుడ్డులో పుట్టిన బ్యాక్టీరియా సజీవంగా ఉంటుంది. దానివల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌, వివిధ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
- గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచితే అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. కానీ వాటిని బయటపెడితే కొద్ది రోజుల్లోనే పాడవుతాయని అమెరికా ప్రపంచానికి నేర్పించింది. అప్పటి నుండి ప్రపంచం మొత్తం ఈ నియమానికి అలవాటు పడింది. దాంతో రిఫ్రిజిరేటర్లలోనూ గుడ్లు పెట్టడానికి ప్రత్యేక అల్మారాలు ఏర్పాటుచేశారు.
- గుడ్లను ఎక్కువసేపు బయట ఉంచడం మంచిదికాదు. అదే సమయంలో ఎక్కువరోజులు ఫ్రిజ్‌లో ఉంచడం కూడా సురక్షితం కాదు. మరి దీనికి మార్గమేమిటి అనుకుంటున్నారా..? మీకు కావలసినన్ని గుడ్లను కొన్న తర్వాత వాటిని త్వరగా వండుకోవడమే అని నిపుణులు అంటున్నారు. అనవసరంగా ఎక్కువ గుడ్లు కొని నిల్వ చేయవద్దని సూచిస్తున్నారు.

గుడ్లను ఫ్రిజ్‌ లో  ఉంచవ‌చ్చా?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కమలాలతో ఆరోగ్యం

28-11-2020

మార్కెట్లో ఎక్కడ చూసినా కమలా పండ్లు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో లభించే పండ్లలో కమలా పండు ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సిట్రిక్‌

manavi

ఆరోగ్యం

లక్షణాలు ఇవే

28-11-2020

ప్రతి 28 రోజులకు ఒకసారి క్రమం తప్పక వచ్చే రుతుస్రావం మరుసటి నెలలో తప్పిపోవడం గర్భం వచ్చింద నటానికి స్పష్టమైన సంకేతం. అయినప్పటికీ,

manavi

ఆరోగ్యం

పోషకాల ఫలం

18-11-2020

సీతాఫలంలో పుష్కలంగా పోషకాలుంటాయి. విటమిన్‌ సీ, ఏ, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ మనకు ఎంతో ఆరోగ్యకరం. శీతాకాలంలో ఎక్కువగా