వీటికి దూరంగా వుండండి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

వీటికి దూరంగా వుండండి

బేకరీ పదార్థాలకు: బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను అమాంతం పెంచేలా చేసే బేకరీ పదార్థాలకు దూరంగా ఉంటే మనలోని మానసిక ఆందోళనను అదుపు చేయవచ్చు. కేకులు, కుకీలు వంటివాటిలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువ కాబట్టి ఇవి తిన్నవెంటనే బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ పెరిగి మన మానసిక సమస్యలపై అది మరింత దుష్ప్రభావం చూపేలా చేస్తుంది. అందుకే మనకు ఇష్టమైన పేస్ట్రీలు, కేకులకు బదులు తాజా పళ్లను ఎంచుకోవడం అత్యుత్తమం. పళ్లలోనూ గ్లూకోజ్‌ ఉంటుంది కానీ అది సహజమైన చక్కెర కనుక ప్రమాదకరం కాదు.
జ్యూసులకు: పళ్లను మనం పూర్తిగా తింటాం. కానీ పండ్ల రసం అంటే అందులోని గుజ్జుతో కూడిన పీచు తీసేసి, రుచి పెరిగేందుకు చక్కెర, చాక్లెట్‌ సిరప్‌, ఎసెన్స్‌ ఇలా అన్నీ రంగరించి తాగే పండ్ల రసాలతో మంచి కంటే హాని ఎక్కువ జరుగుతుంది. చక్కెర ఎక్కువగా వేసిన పళ్ల రసాలతో గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువై అది ప్రత్యక్షంగా మన మానసిక అరోగ్యంపై ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. కాబట్టి బ్లడ్‌ షుగర్‌ పెంచే ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ పండ్లను తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైబర్‌ ఉన్న పండ్లను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు.
స్మూతీస్‌: ఇటీవలి కాలంలో జ్యూసులకంటే స్మూతీలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. చాలామంది స్మూతీ తాగడం స్టైల్‌గా భావిస్తున్నారు. అయితే ప్రొటీన్లు, పండ్లు, ఫైబర్‌ ఇవన్నీ లేని స్మూతీతో ఆరోగ్యం దెబ్బతింటుంది. స్మూతీలతో మనకు ఎక్కువ శక్తి వస్తుందన్నది నిజమే కానీ చక్కెర ఎక్కువ వేసిన స్మూతీలతో మానసిక సమస్య అధికమవుతుంది.
టీ-కాఫీలు తగ్గించండి: కెఫీన్‌ ఉన్న కాఫీ, టీలు ఎక్కువగా తాగేవారిలో ఒత్తిడి సమస్యలు అత్యధికం. సెంట్రల్‌ నర్వ్‌ సిస్టంను ప్రభావితం చేసే కాఫీ, టీలతో యాంక్జైటీ తారాస్థాయికి చేరే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచూ కాఫీ, టీల జోలికి వెళ్లకుండా నియంత్రించడం అత్యవసరం.
అధికంగా తినొద్దు: ఒత్తిడి ఉన్నవారు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినడంతో కడుపునొప్పి, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కేలరీలు అత్యధికంగా ఉన్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌ నోరూరించినా ఇందులో పీచు పదార్థం చాలా తక్కువ కనుక పేగుల్లో సమస్యలు సృష్టిస్తుంది. సాధారణంగా ఒత్తిడితో బాధపడుతున్న వారు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ అంటే ఎక్కువ ఇష్టపడతారు. అయితే అనారోగ్యం బారిన పడకూడదంటే ఆహారంపై నియంత్రణ ఉండేలా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. 

వీటికి దూరంగా వుండండి

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

భయం ఇలా పోగొట్టండి

05-03-2021

మార్చి మొదలైందంటేనే పరీక్షల టెన్షన్‌ మొదలైపోతుంది. ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలు మొదలైపోయాయి. ఇక సీనియర్‌ సెకండరీ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గర్లోనే ఉన్నాయి. ఆ వెంటనే పదో

manavi

ఆరోగ్యం

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

02-03-2021

ప్రస్తుతం యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

01-03-2021

కరోనాతో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఒక్క కరోనా

manavi

ఆరోగ్యం

ఈ సంకేతాలు ప్రమాదం

01-03-2021

గర్భం ధరించిన తర్వాత కొందరికి సమయం సులువుగా గడిచిపోతే మరికొందరికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సరిపడినంత విశ్రాంతి, చక్కటి ఆహారంతో పాటు

manavi

ఆరోగ్యం

విష పదార్థాలను తరిమేస్తుంది

01-03-2021

మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. అందుకే ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. రుచితో పాటు సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు.

manavi

ఆరోగ్యం

నిమ్మ ఆకులతో...

28-02-2021

నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.

manavi

ఆరోగ్యం

అదే పనిగా చూస్తుంటే

27-02-2021

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ

manavi

ఆరోగ్యం

టీనేజర్లకు అత్యంత ప్రమాదం

26-02-2021

టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఒకప్పుడు అవసరం... ప్రస్తుతం నిత్యావసరాలుగా మారాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా టెలివిజన్‌, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు కనిపించరంటే అతిశయోక్తి

manavi

ఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

25-02-2021

వ్యాయామం అంటేనే చాలామంది రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం.. అంటూ వాయిదాలు వేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట.