క్రమంగా బరువు తగ్గండి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

క్రమంగా బరువు తగ్గండి

- వ్యాయామానికి ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకూడదు. ఎందుకంటే చెమట చిందిస్తేనే మీరనుకున్నది సాధించగలరు. క్రమశిక్షణగా జిమ్‌కు వెళ్తూ కసరత్తులు చేయడం ద్వారా క్రమంగా బరువు తగ్గుతారు. మీ మనసులో ఫిట్‌ నెస్‌ అనేది ముందు వరుసలో ఉండాలి.
- సరైన సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పోషకాలుండే ఆహారమేంటో పక్కాగా వారానికి సరిపడా ఛార్ట్‌ను తయారు చేసుకోవాలి. అందుకు సరిపడా ముడి సరుకులను వారానికి సరిపడా తెచ్చుకుంటే మంచిది.
- తినే సమయంలో కొంచెం కోరికలు కంట్రోల్‌ చేసుకోండి. అన్నిసార్లూ అవే తినే బదులు కొన్నిసార్లు తింటే చాలు అని అనుకొని మిమ్మల్ని మీరు స్థిమితపరచుకోండి.
- ఎంతో మంది నిపుణులు మొదటగా చెప్పేది రాత్రుళ్లు త్వరగా తినమని. అంతేకాకుండా త్వరగా నిద్రించాలని కూడా చెబుతారు. అవును డిన్నర్‌ను త్వరగా పూర్తి చేస్తే జీర్ణం త్వరగా అవుతుంది. అంతేకాకుండా రాత్రుళ్లు మంచి నిద్ర కూడా పడుతుంది.
- ఉదయాన్నే చేయాల్సిన మొదటి పని వేడి నీటిలో నిమ్మరసం కలిపి ఆ ద్రావణాన్ని తాగడం అలరవర్చుకోండి. ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉంటే మంచిది.
- కొవ్వు పదార్థాలను పూర్తిగా దూరంగా ఉంచండి. వాటిని తినాలని కోరిక పుట్టేముందు వాటిని విసిరి పారేయండి.
- ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటే మంచిది. వేగంగా తినడం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మీ కడుపు కోరుకున్న దానికన్నా ఎక్కువ తినడాన్ని ముగించాలి.
- కాఫీ, టీలు తాగే బదులు గ్రీన్‌ టీని తాగడం ఎంతో ఉత్తమం. రోజుకు రెండు కప్పులు కెఫైన్‌ అధికంగా ఉండే కాఫీ కంటే హెర్బల్‌ టీ, గ్రీన్‌ టీ, స్పైసెడ్‌ టీ లేదా దేశీ కధాను తాగడం మంచిది.
- రోజూ క్రమం తప్పుకుండా మితంగా తినడం ప్రారంభించడం వల్ల కొన్ని రోజులకు ప్లేట్‌ భోజనానికే కడుపు నిండిన భావం కలుగుతుంది. కాబట్టి క్రమంగా ఆకలిని నియంత్రించుకోవచ్చు.
- తినేముందు టీవీ చూడటం, స్మార్ట్‌ ఫోన్‌ వాడటం, ల్యాప్‌ ట్యాప్‌ ఆపరేట్‌ చేయడం లాంటి వాటిని అస్సలు చేయకూడదు. ఇలా చేయడం ద్వారా అతిగా తినే ప్రమాదముంది.

క్రమంగా బరువు తగ్గండి

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

భయం ఇలా పోగొట్టండి

05-03-2021

మార్చి మొదలైందంటేనే పరీక్షల టెన్షన్‌ మొదలైపోతుంది. ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలు మొదలైపోయాయి. ఇక సీనియర్‌ సెకండరీ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గర్లోనే ఉన్నాయి. ఆ వెంటనే పదో

manavi

ఆరోగ్యం

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

02-03-2021

ప్రస్తుతం యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

01-03-2021

కరోనాతో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఒక్క కరోనా

manavi

ఆరోగ్యం

ఈ సంకేతాలు ప్రమాదం

01-03-2021

గర్భం ధరించిన తర్వాత కొందరికి సమయం సులువుగా గడిచిపోతే మరికొందరికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సరిపడినంత విశ్రాంతి, చక్కటి ఆహారంతో పాటు

manavi

ఆరోగ్యం

విష పదార్థాలను తరిమేస్తుంది

01-03-2021

మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. అందుకే ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. రుచితో పాటు సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు.

manavi

ఆరోగ్యం

నిమ్మ ఆకులతో...

28-02-2021

నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.

manavi

ఆరోగ్యం

అదే పనిగా చూస్తుంటే

27-02-2021

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ

manavi

ఆరోగ్యం

టీనేజర్లకు అత్యంత ప్రమాదం

26-02-2021

టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఒకప్పుడు అవసరం... ప్రస్తుతం నిత్యావసరాలుగా మారాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా టెలివిజన్‌, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు కనిపించరంటే అతిశయోక్తి

manavi

ఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

25-02-2021

వ్యాయామం అంటేనే చాలామంది రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం.. అంటూ వాయిదాలు వేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట.