ఐరన్‌ లోపించకుండా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఐరన్‌ లోపించకుండా...

మన ఆరోగ్యం సక్రమంగా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ఐరన్‌ ముందుంటుంది. ఐరన్‌ లోపం చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. మహిళలు ఐరన్‌ లోపంతో ఎక్కువగా బాధపడతారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఐరన్‌ సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఐరన్‌ లభించే సీజనల్‌ పండ్లు, కూరగాయలు ఏమిటో చూద్దాం...
బీట్‌రూట్‌: బీట్‌రూట్‌ ఐరన్‌కు ప్రధాన వనరు. దీన్ని తరచూ ఆహారంలో తీసుకోవాలి. ఇది శీతాకాలంలో విరివిగా లభిస్తుంది. ఐరన్‌, కాపర్‌, ప్రోటీన్‌, విటమిన్లు, కాల్షియం, సల్ఫర్‌ వంటి పోషకాలు బీట్‌రూట్‌ ద్వారా అందుతాయి. దీని నుంచి విటమిన్‌ సి కూడా శరీరానికి అందుతుంది. శరీరం ఐరన్‌ను సంగ్రహించే శక్తిని పెంచడానికి విటమిన్‌ సి సహాయపడుతుంది.
పాలకూర: పాలకూరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. దీన్ని ఐరన్‌, వివిధ విటమిన్లు, ఖనిజాలకు నిలయంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ రోగనిరోధక శక్తిని, హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచడానికి, రక్తహీనతను నివారించడానికి సహాయపడతాయి.
బ్రకోలీ: దీంట్లో బి విటమిన్లు, విటమిన్‌ సి, ఐరన్‌, ఫోలేట్‌, జింక్‌, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
క్యాబేజీ: క్యాబేజీ ద్వారా ఐరన్‌, ఇతర ఖనిజాలు శరీరానికి అందుతాయి. ఐరన్‌ లోపాన్ని నివారించడంతో పాటు బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడానికి క్యాబేజీ సహాయపడుతుంది.
దానిమ్మ: రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచడానికి దానిమ్మ తోడ్పడుతుంది. ఐరన్‌, విటమిన్లు, ప్రోటీన్‌, పిండి పదార్థాలు, ఫైబర్‌ వంటి పోషకాలకు దానిమ్మ మంచి వనరు. దీనిలో ఉండే ఆస్కార్బిక్‌ యాసిడ్‌ శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
యాపిల్‌: యాపిల్‌ పండులో అధిక మొత్తంలో ఐరన్‌ ఉంటుంది. ఇవి శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే ఐరన్‌ లోపం సహా ఇతర అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.
నారింజ పండ్లు: నారింజలో విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తుంది. శరీరంలో ఐరన్‌ స్థాయిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు నారింజను క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ పండు దోహదం చేస్తుంది. 

ఐరన్‌ లోపించకుండా...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

02-03-2021

ప్రస్తుతం యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

01-03-2021

కరోనాతో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఒక్క కరోనా

manavi

ఆరోగ్యం

ఈ సంకేతాలు ప్రమాదం

01-03-2021

గర్భం ధరించిన తర్వాత కొందరికి సమయం సులువుగా గడిచిపోతే మరికొందరికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సరిపడినంత విశ్రాంతి, చక్కటి ఆహారంతో పాటు

manavi

ఆరోగ్యం

విష పదార్థాలను తరిమేస్తుంది

01-03-2021

మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. అందుకే ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. రుచితో పాటు సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు.

manavi

ఆరోగ్యం

నిమ్మ ఆకులతో...

28-02-2021

నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.

manavi

ఆరోగ్యం

అదే పనిగా చూస్తుంటే

27-02-2021

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ

manavi

ఆరోగ్యం

టీనేజర్లకు అత్యంత ప్రమాదం

26-02-2021

టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఒకప్పుడు అవసరం... ప్రస్తుతం నిత్యావసరాలుగా మారాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా టెలివిజన్‌, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు కనిపించరంటే అతిశయోక్తి

manavi

ఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

25-02-2021

వ్యాయామం అంటేనే చాలామంది రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం.. అంటూ వాయిదాలు వేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట.

manavi

ఆరోగ్యం

పెరుగు తింటే చాలు

23-02-2021

మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెరుగు తప్పనిసరిగా తినండి. తద్వారా మీ బాడీలో జీర్ణక్రియ చాలా మెరుగవుతుంది. మలబద్ధకం, పైల్స్‌ సమస్యలుంటే పెరుగు చాలా మేలు చేస్తుంది. ఇలాంటి