వ్యాయామం చేయాల్సిందే | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

పిల్లలకు జన్మనివ్వడం అనేది ప్రతి మహిళ కల. ప్రెగెన్నీ దశ మహిళల జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తల్లికీ, పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో రోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే డయాబెటిస్‌ వంటి ప్రమాదకర వ్యాధులు ధరిచేరవని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. గర్భాధారణ సమయంలో ప్రతిరోజూ ఉదయం కనీసం 38 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే డయాబెటిస్‌కు చెక్‌ పెట్టవచ్చని వారి అధ్యయనం స్పష్టం చేసింది. ఇలా వారానికి ఐదు రోజుల పాటు ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ప్రెగెన్సీ మహిళలు డయాబెటిస్‌కు దూరంగా ఉండవచ్చని అధ్యయనం పేర్కొంది.
ప్రసవ సమస్యలను తగ్గిస్తుంది: ఈ అధ్యయనానికి అమెరికాలోని టేనస్సీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమంతా ఎర్లిచ్‌ నాయకత్వం వహించారు. ''గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామానికి మించిన సాధనం మరొకటి లేదు. ఇది వారికి దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వ్యాయామం ప్రసవ సమస్యలను తగ్గించడమే కాకుండా భవిష్యత్‌లో తల్లి, బిడ్డకు డయాబెటిస్‌ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది'' అంటున్నారు ఆమె.
అధ్యయనం జరిగింది ఇలా: ఈ అధ్యయన ఫలితాలు డయాబెటిస్‌ కేర్‌ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. శాస్త్రవేత్తలు ప్రెగెన్సీ ఎన్విరాన్మెంట్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌ స్టడీలో భాగంగా 2,246 మంది గర్భిణీ స్త్రీల నుండి సమాచారాన్ని సేకరించారు. ఈ అధ్యయనంలో గర్భిణీ స్త్రీలు రోజూ చేస్తున్న వ్యాయామాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ప్రధానంగా మొదటి త్రైమాసికంలో గర్భిణుల చేసే వ్యాయామ స్థాయిలపై ఈ అధ్యయనం కొనసాగింది.
కనీసం 38 నిమిషాలైన: రోజుకు కనీసం 38 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల గర్భిణులలో డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం ప్రతీ 100 మందిలో ఆరు నుండి 10 మంది మహిళలు గర్భధారణ సమయంలో డయాబెటిస్‌ భారీన పడుతున్నారు. అందువల్ల వ్యాయామంతో ప్రతీ 100 మంది మహిళల్లో కనీసం ఇద్దరికైనా డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయన రచయిత సమంతా ఎర్లిచ్‌ అన్నారు.

వ్యాయామం చేయాల్సిందే

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

భయం ఇలా పోగొట్టండి

05-03-2021

మార్చి మొదలైందంటేనే పరీక్షల టెన్షన్‌ మొదలైపోతుంది. ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలు మొదలైపోయాయి. ఇక సీనియర్‌ సెకండరీ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గర్లోనే ఉన్నాయి. ఆ వెంటనే పదో

manavi

ఆరోగ్యం

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

02-03-2021

ప్రస్తుతం యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

01-03-2021

కరోనాతో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఒక్క కరోనా

manavi

ఆరోగ్యం

ఈ సంకేతాలు ప్రమాదం

01-03-2021

గర్భం ధరించిన తర్వాత కొందరికి సమయం సులువుగా గడిచిపోతే మరికొందరికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సరిపడినంత విశ్రాంతి, చక్కటి ఆహారంతో పాటు

manavi

ఆరోగ్యం

విష పదార్థాలను తరిమేస్తుంది

01-03-2021

మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. అందుకే ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. రుచితో పాటు సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు.

manavi

ఆరోగ్యం

నిమ్మ ఆకులతో...

28-02-2021

నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.

manavi

ఆరోగ్యం

అదే పనిగా చూస్తుంటే

27-02-2021

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ

manavi

ఆరోగ్యం

టీనేజర్లకు అత్యంత ప్రమాదం

26-02-2021

టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఒకప్పుడు అవసరం... ప్రస్తుతం నిత్యావసరాలుగా మారాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా టెలివిజన్‌, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు కనిపించరంటే అతిశయోక్తి

manavi

ఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

25-02-2021

వ్యాయామం అంటేనే చాలామంది రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం.. అంటూ వాయిదాలు వేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట.