మానసిక ఆరోగ్యానికి... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

మానసిక ఆరోగ్యానికి...

హడావిడి, ఉరుకుల పరుగుల జీవితాలు ఒక్క సారి పెద్ద కుదుపుతో ఆగినట్లైంది కరోనా వల్ల. చాలా మంది మానసికంగా కుంగిపోయారు. మన దగ్గర మానసిక అనారోగ్యం గురించి సరైన అవగాహన, గుర్తింపు లేవు. శారీరక అనారోగ్యాల లాగానే, మానసిక అనారోగ్యానికి కూడా చికిత్స ఉంది. కానీ కోలుకోవడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. సరైన సమయంలో సమస్యని గుర్తించకపోతే కోలుకునే సమయం ఇంకా ఎక్కువ అవుతుంది. మానసిక ఆరోగ్యానికి అవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టి వాటిని గమనించుకుంటూ ఉంటే మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అవేమిటంటే,
చక్కని నిద్ర: డిజిటల్‌ లైఫ్‌ స్టైల్‌ వల్ల మొదటి ప్రభావం పడేది మన నిద్ర మీదే. శారీరక మానసిక ఆరోగ్యానికి అత్యవసరమైన ఒక ప్రక్రియ నిద్ర. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకి ఎనిమిది గంటలు నిద్ర పోవడానికి ప్రయత్నించాలి. అలాగే నిద్రకి ముందు కంప్యూటర్స్‌ మీద పని చేయడం, మొబైల్స్‌లో ఛాటింగ్‌, టాబ్లెట్స్‌ యూజ్‌ చేయడం, టీవీ చూడడం మానుకోవాలి. అలాగే నిద్రకి ముందు కెఫీన్‌ తీసుకోవడం వల్ల కూడా నిద్ర క్వాలిటీ దెబ్బ తింటుంది. అందుకే వీటిని కూడా దూరం పెట్టాలి.
ఆరోగ్యంగా, క్షేమంగా: సాధారణంగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని విడివిడిగా చూస్తారు. కానీ హెల్త్‌ విషయం వచ్చేప్పటికి రెండూ కలిసిపోతాయి. ఫిజికల్‌ హెల్త్‌ బాగుంటే అలర్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండి ఉత్సాహంగా పని చేయగలుగుతారు. రోజూ ఎక్సర్సైజ్‌ చేస్తూ, మంచి ఆహారం తీసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. సమతులాహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్స్‌, మినరల్స్‌ అన్నీ అంది బాడి ఫిట్‌గా, ఎనర్జెటిక్‌గా ఉంటుంది. ఇమ్యూనిటీ బాగుండడం వల్ల ఎలాంటి వ్యాధులూ దరి చేరవు. ఒత్తిడిగా ఉన్నప్పుడు తినడం, ఎక్కువ తినేయడం, జంక్‌ ఫుడ్‌ రెగ్యులర్‌గా తీసుకోవడం వంటివి పూర్తిగా ఎవాయిడ్‌ చేయాలి.
సెల్ఫ్‌ కేర్‌: ఎవరి గురించి వారు శ్రద్ధ తీసుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి తొలి మెట్టుగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఉన్న పెద్ద వాళ్ళూ, పిల్లల ఆరోగ్య అవసరాలు పట్టించుకునే క్రమంలో ఎవరి ఆరోగ్యాన్ని వారు పక్కన పెట్టేస్తే కష్టం. ముఖ్యంగా మహిళలు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనే విషయం మర్చిపోకూడదు. సంపూర్ణ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలంటే సెల్ఫ్‌ కేర్‌ తప్పనిసరి. మీతో మీరు సమయం గడపండి. పుస్తకాలు చదువుకోవడం, రాయడం, ఇష్టమైన పాటలు వినడం, పాడడం.. ఏదైనా సరే మీకు నచ్చిన పని చేయడానికి సమయం కేటాయించండి. ఇలా చేయడం వల్ల మీరు సంతోషంగా, అలసట లేకుండా ఉంటారు. మీ షెడ్యూల్‌ని బట్టి వారానికి ఒకసారో రెండు సార్లో ఇలా మీ కోసం మీరు సమయం గడపండి. ఇక్కడ మీకు నచ్చిన పని చేయడం ఎంత ముఖ్యమో దాన్ని రెగ్యులర్‌గా చేయడం కూడా అంతే ముఖ్యం. అలాగే ఆశించిన ప్రతీదీ సాధించడం కూడా ఎవ్వరికీ జరగదు. అందుకని ఎప్పుడైనా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా బాధపడకండి. 

మానసిక ఆరోగ్యానికి...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

02-03-2021

ప్రస్తుతం యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

01-03-2021

కరోనాతో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఒక్క కరోనా

manavi

ఆరోగ్యం

ఈ సంకేతాలు ప్రమాదం

01-03-2021

గర్భం ధరించిన తర్వాత కొందరికి సమయం సులువుగా గడిచిపోతే మరికొందరికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సరిపడినంత విశ్రాంతి, చక్కటి ఆహారంతో పాటు

manavi

ఆరోగ్యం

విష పదార్థాలను తరిమేస్తుంది

01-03-2021

మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. అందుకే ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. రుచితో పాటు సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు.

manavi

ఆరోగ్యం

నిమ్మ ఆకులతో...

28-02-2021

నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.

manavi

ఆరోగ్యం

అదే పనిగా చూస్తుంటే

27-02-2021

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ

manavi

ఆరోగ్యం

టీనేజర్లకు అత్యంత ప్రమాదం

26-02-2021

టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఒకప్పుడు అవసరం... ప్రస్తుతం నిత్యావసరాలుగా మారాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా టెలివిజన్‌, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు కనిపించరంటే అతిశయోక్తి

manavi

ఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

25-02-2021

వ్యాయామం అంటేనే చాలామంది రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం.. అంటూ వాయిదాలు వేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట.

manavi

ఆరోగ్యం

పెరుగు తింటే చాలు

23-02-2021

మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెరుగు తప్పనిసరిగా తినండి. తద్వారా మీ బాడీలో జీర్ణక్రియ చాలా మెరుగవుతుంది. మలబద్ధకం, పైల్స్‌ సమస్యలుంటే పెరుగు చాలా మేలు చేస్తుంది. ఇలాంటి