ఫోన్‌ అక్కడ కూడా ఉపయోగిస్తున్నారా..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఫోన్‌ అక్కడ కూడా ఉపయోగిస్తున్నారా..?

స్మార్ట్‌ ఫోనును బాత్రూమ్‌లో ఉపయోగిస్తున్నారా? ఐతే మీకు ప్రమాదం పొంచివున్నట్టే. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ లేనిదే నిమిషం కూడా గడవని పరిస్థితి. ఎక్కడపడితే అక్కడ స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది. చివరికి టాయ్లెట్‌లో కూడా స్మార్ట్‌ ఫోన్లను వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా బాత్రూమ్‌ల్లో స్మార్ట్‌ ఫోన్లు వాడే వారికి పైల్స్‌ వ్యాధి తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం వల్ల కలిగే సమస్యల గురించి అధ్యయనం చేస్తే టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు ఫోన్‌ని తీసుకెళ్లడం వల్ల పైల్స్‌కి దారి తీస్తుంది.
- యువతలో కూడా ఇది ఇప్పుడు వస్తోంది. మొబైల్‌ వల్ల పైల్స్‌ ఎందుకు వస్తుంది అనే విషయానికి పరిశీలిస్తే ఫోన్‌ని వాడడం వల్ల సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు. దీని మూలంగానే ఈ సమస్య వస్తుంది. టారులెట్‌లో స్మార్ట్‌ ఫోన్లను వాడటం ద్వారా కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. టాయిలెట్‌లో కూర్చుని పేపర్‌ చదివిన, మొబైల్‌ని ఉపయోగించిన సమస్య ఏమీ తెలీదు.
- ఎక్కువ సేపు టారులెట్‌లో కూర్చుని ఉంటే కండరాల నరాల పై ఒత్తిడి పడుతుంది. ఇది పైల్స్‌ సమస్యకు ఓ కారణం అవుతుంది. అలానే టాయిలెట్‌కు ఫోన్‌ తీసుకెళ్లడం ద్వారా దానికి బ్యాక్టీరియా అంటుకుంటుంది.
- చేతులు శుభ్రం చేసుకున్నా మొబైల్‌ని కడగడం కుదరదు కనుక మొబైల్‌కి అంటుకున్న బ్యాక్టీరియా మిమ్మల్ని ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. కాబట్టి మొబైల్‌ని బాత్రూమ్‌లో ఉపయోగించకుండా ఉంటేనే మేలు. లేదంటే ఎన్నో సమస్యలు బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

ఫోన్‌ అక్కడ కూడా ఉపయోగిస్తున్నారా..?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

భయం ఇలా పోగొట్టండి

05-03-2021

మార్చి మొదలైందంటేనే పరీక్షల టెన్షన్‌ మొదలైపోతుంది. ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలు మొదలైపోయాయి. ఇక సీనియర్‌ సెకండరీ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గర్లోనే ఉన్నాయి. ఆ వెంటనే పదో

manavi

ఆరోగ్యం

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

02-03-2021

ప్రస్తుతం యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

01-03-2021

కరోనాతో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఒక్క కరోనా

manavi

ఆరోగ్యం

ఈ సంకేతాలు ప్రమాదం

01-03-2021

గర్భం ధరించిన తర్వాత కొందరికి సమయం సులువుగా గడిచిపోతే మరికొందరికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సరిపడినంత విశ్రాంతి, చక్కటి ఆహారంతో పాటు

manavi

ఆరోగ్యం

విష పదార్థాలను తరిమేస్తుంది

01-03-2021

మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. అందుకే ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. రుచితో పాటు సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు.

manavi

ఆరోగ్యం

నిమ్మ ఆకులతో...

28-02-2021

నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.

manavi

ఆరోగ్యం

అదే పనిగా చూస్తుంటే

27-02-2021

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ

manavi

ఆరోగ్యం

టీనేజర్లకు అత్యంత ప్రమాదం

26-02-2021

టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఒకప్పుడు అవసరం... ప్రస్తుతం నిత్యావసరాలుగా మారాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా టెలివిజన్‌, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు కనిపించరంటే అతిశయోక్తి

manavi

ఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

25-02-2021

వ్యాయామం అంటేనే చాలామంది రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం.. అంటూ వాయిదాలు వేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట.