బరువును తగ్గించే వెల్లుల్లి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

బరువును తగ్గించే వెల్లుల్లి

వెల్లుల్లి అనేక పోషకాలకు వనరు. ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. ఇంటి చిట్కాలలో భాగమైన వెల్లుల్లి లోబీపీ, జలుబుతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. దీనికి నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే సామర్థ్యం కూడా ఉంది.
- వెల్లుల్లిలో విటమిన్‌ బి6, విటమిన్‌ సి, ఫైబర్‌, మాంగనీస్‌, కాల్షియం ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించడంలో సాయపడతాయి. వెల్లుల్లిలో ఉండే ప్రత్యేకమైన గుణాలు మహిళలు బరువు తగ్గడానికి తోడ్పడుతున్నట్టు ది జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. పరిశోధకులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.
- 8 వారాలపాటు ఎలుకలకు వెల్లుల్లి తినిపించినప్పుడు వాటి శరీర బరువు, కొవ్వు నిల్వ శాతం గణనీయంగా తగ్గిందని కనుగొన్నారు. ఇది కాకుండా వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి, జలుబు, ఫ్లూ వంటి వాటితో పోరాడటానికి సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం ద్వారా శరీర శక్తి స్థాయులు పెరడగంతో పాటు జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది.
- రెండు మూడు వెల్లుల్లి రేకలను చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో వాటిని వేయాలి. ఉదయం ఆ నీటి నుంచి వెల్లుల్లి ముక్కలను తీసి చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే ఏమీ తినకముందే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలను పొట్టుతీసి ముద్దగా చేసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం తేనె తీసుకుని దాంట్లో వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. దీన్ని ఒక అరగంట తరువాత తీసుకోవాలి. రోజుకోసారి దీన్ని తీసుకుంటే మంచిది.
- రెండు మూడు వెల్లుల్లి రేకలను ముద్దగా చేయాలి. దీన్ని ఒక గ్లాసు వేడి నీటిలో వేసి పక్కన పెట్టాలి. కాసేపటి తరువాత దీనికి ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే బరువు తగ్గుతారు.
- వెల్లుల్లిని అధిక మొత్తంలో తీసుకుంటే దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంది. దీని వాడకం అధికమైతే కడుపులో మంట, శరీర దుర్వాసన, వాంతులు, డయేరియా వంటి అనారోగ్యాలు రావచ్చు. అందుకే రోజూ రెండు మూడు రేకలకు మించి వెల్లుల్లిని తీసుకోకపోవడం మంచిది. 

బరువును తగ్గించే వెల్లుల్లి

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

భయం ఇలా పోగొట్టండి

05-03-2021

మార్చి మొదలైందంటేనే పరీక్షల టెన్షన్‌ మొదలైపోతుంది. ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలు మొదలైపోయాయి. ఇక సీనియర్‌ సెకండరీ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గర్లోనే ఉన్నాయి. ఆ వెంటనే పదో

manavi

ఆరోగ్యం

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

02-03-2021

ప్రస్తుతం యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

01-03-2021

కరోనాతో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఒక్క కరోనా

manavi

ఆరోగ్యం

ఈ సంకేతాలు ప్రమాదం

01-03-2021

గర్భం ధరించిన తర్వాత కొందరికి సమయం సులువుగా గడిచిపోతే మరికొందరికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సరిపడినంత విశ్రాంతి, చక్కటి ఆహారంతో పాటు

manavi

ఆరోగ్యం

విష పదార్థాలను తరిమేస్తుంది

01-03-2021

మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. అందుకే ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. రుచితో పాటు సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు.

manavi

ఆరోగ్యం

నిమ్మ ఆకులతో...

28-02-2021

నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.

manavi

ఆరోగ్యం

అదే పనిగా చూస్తుంటే

27-02-2021

ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంటిచూపు మందగిస్తుందని తేలింది. అంతేకాదు ఎక్కువ

manavi

ఆరోగ్యం

టీనేజర్లకు అత్యంత ప్రమాదం

26-02-2021

టీవీ, స్మార్ట్‌ ఫోన్‌ ఒకప్పుడు అవసరం... ప్రస్తుతం నిత్యావసరాలుగా మారాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా టెలివిజన్‌, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు కనిపించరంటే అతిశయోక్తి

manavi

ఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

25-02-2021

వ్యాయామం అంటేనే చాలామంది రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం.. అంటూ వాయిదాలు వేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట.