- మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెరుగు తప్పనిసరిగా తినండి. తద్వారా మీ బాడీలో జీర్ణక్రియ చాలా మెరుగవుతుంది. మలబద్ధకం, పైల్స్ సమస్యలుంటే పెరుగు చాలా మేలు చేస్తుంది. ఇలాంటి ఎన్నో అనారోగ్యాలకు ఒకటే మంత్రం పెరుగు.
- పెరుగులో నిండా బ్యాక్టీరియా ఉంటాయి. అవి పొట్టలోకి వెళ్లాక లోపలున్న విష వ్యర్థాలు, ఇతరత్రా చెత్తా చెదారాన్ని తినేస్తాయి. మొత్తం క్లీన్ చేస్తాయి. ఫలితంగా మనం తినే ఆహారం సంపూర్ణంగా జీర్ణమై ఆహారంలోని అన్ని పోషకాలూ రక్తంలో కలిసి అక్కడి నుంచి బాడీ మొత్తం వ్యాపించి మనం సంపూర్ణమైన వ్యాధి నిరోధక శక్తిని పొందుతాం. పెరుగులో ఉండే బ్యాక్టీరియా మనకు మేలు చేసే రకం. ఇది రకరకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.
- మానసికంగా అలసట, నీరసం వంటివి పెరుగుతో పోతాయి. చాలా అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం మలబద్ధకం, అజీర్ణం వంటివే. తినే ఆహారం సరిగా జీర్ణమైతే మెదడు బాగా పనిచేస్తుంది. దాంతో శరీరంలోని అన్ని అవయవాలూ బాగా పనిచేస్తాయి. బ్రెయిన్ బాగా పనిచేసేలా, ఒత్తిడి, టెన్షన్ వంటివి పోగొట్టడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది.
- అలసట, ఒత్తిడి పెరిగితే బరువు కూడా పెరుగుతారు. అధిక బరువు ఉండేవారు ఏమీ తినకపోయినా పెరుగు మాత్రం మానొద్దు. రోజూ రెండు పూటలో భోజనం చివర్లో పెరుగుతింటే చాలు. ఒంట్లో చెత్త కొవ్వును కరిగించి మొత్తం క్లీన్ చేసే పని పెరుగులో బ్యాక్టీరియా చూసుకుంటాయి. దీనిపై జరిపిన పరిశోధనలో ఏం తేలిందంటే అధిక బరువు ఉన్నవారు రెగ్యులర్గా పెరుగు తింటే 22 శాతం బరువు తగ్గుతున్నారు.
ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక
MORE SECTIONS
Recent From Manavi