వ్యాయామం చేయాల్సిందే | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

వ్యాయామం చేయాల్సిందే

వ్యాయామం అంటేనే చాలామంది రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం.. అంటూ వాయిదాలు వేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట. వ్యాయామం వల్ల శరీర అవయవాలన్నీ ఉత్సాహంగా పనిచేస్తాయని ఇప్పటికే తెలిసిన విషయమే. గుండె పనితీరు కూడా మెరుగు పడుతుందని తాజా పరిశోధనలో మరోసారి రుజువైంది. మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. రోజూవారి పని ఒత్తిడి, ఆందోళన, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే గుండె జబ్బులు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకు అనేక అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
సులభమైన పద్ధతుల ద్వారానే గుండె జబ్బులకు చెక్‌ పెట్టవచ్చని ఆక్స్‌ ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంది. వ్యాయామం, శారీరక శ్రమతో గుండె జబ్బులను నివారించవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అరుదుగా కదిలే వ్యక్తుల కంటే తరచుగా వ్యాయామం చేసే, చురుకుగా ఉండే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. అంతేకాక, రోజూ కొద్దిసేపు క్రమం తప్పకుండా వాకింగ్‌, జాగింగ్‌ చేయడం ద్వారా గుండె జబ్బుల నుంచి బయటపడొచ్చని ఈ అధ్యయనం సూచించింది. శారీరక శ్రమ ఏదైనా సరే వ్యాయామం కిందికే వస్తుందని, ఇది గుండెకు ఆరోగ్యం చేకూర్చుతుందని తెలిపింది.
పరిమితికి మించి చేసే వ్యాయామాలు గుండె సమస్యలను రెట్టింపు చేస్తాయని, సుదీర్ఘమైన తీవ్రమైన వ్యాయామాలు గుండె సమస్యలకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయని కొన్ని ఇతర అధ్యయనాలు సూచించాయి. అయితే ఈ అధ్యయనం వాటికి భిన్నమైన ఫలితాలను చూపించడం విశేషం. కాగా, శారీరక శ్రమ, గుండె ఆరోగ్యం మెరుగవ్వడానికి మధ్య గల సంబంధం, వ్యాయామం పురుషులు, మహిళల్లో ఒకే రకమైన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయా? అనే విషయాలపై మాత్రం పరిశోధకులు స్పష్టతనివ్వలేదు.
ఈ ప్రశ్నలపై సమాధానానికి ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎపిడెమాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టెరెన్స్‌ డ్వైర్‌, అతని సహచరులు ఈ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని 5,00,000 మందికి పైగా పురుషులు, మహిళల ఆరోగ్యం, జీవనశైలికి సంబంధించిన వివరాల డేటా బేస్‌ని సేకరించారు.
అధ్యయనంలో భాగంగా పురుషులు, మహిళల రోజూవారి జీవనశైలిపై సుదీర్ఘ ప్రశ్నలు వేశారు. అంతేకాక, అధ్యయనానికి ముందు వారి పూర్తి ఆరోగ్య, వైద్య పరీక్షలను నిర్వహించారు. మొత్తం 1,00,000 మందికి యాక్టివిటీ ట్రాకర్లను అమర్చారు. వారిలో 90 వేల మంది వ్యాయామ డేటాను సేకరించారు. వారం రోజుల పాటు వారి వ్యాయామంపై అధ్యయనం కొనసాగించారు. ఆ వారం రోజుల్లో చురుకుగా వ్యాయామం చేసిన వ్యక్తులు గుండె జబ్బుల నుండి సురక్షితంగా ఉన్నారని తేలింది. వారానికి 1,100 నిమిషాల నుంచి రోజుకు రెండు గంటలకు పైగా వ్యాయామం చేసే వారిలో గుండె సమస్యలకు ఎటువంటి ప్రమాదాన్ని చూపించలేదు. పురుషులు, మహిళలు ఇద్దరూ సమాన ప్రయోజనాలను చూపించారు.
తాజా అధ్యయన ఫలితాలపై డాక్టర్‌ డ్వైర్‌ మాట్లాడుతూ ''ఈ ఫలితాలు మునుపటి అధ్యయనాల్లో లభించిన వాటికంటే బలమైన సాక్ష్యాలను అందించాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి శారీరక శ్రమ ఎంతో ముఖ్యమైనది అని తేల్చి చెప్పాయి'' అని పేర్కొన్నారు. ప

వ్యాయామం చేయాల్సిందే

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

నిర్లక్ష్యం వద్దు

14-04-2021

స్త్రీలు ఇంటి పనుల్లో, ఆఫీసు పనుల్లో అలుపెరగకుండా పనిచేస్తారు. కానీ తమ ఆరోగ్యం పట్ల, వేళకు తాము తీసుకునే ఆహారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు.

manavi

ఆరోగ్యం

పండ్ల రసాలతో...

14-04-2021

వేసవిలో దొరికే పండ్ల రసాలలో విటమిన్‌ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. మలబద్దత సమస్య తొలగిపోతుంది, ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు, కిడ్నీలలో రాళ్లు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండాలంటే..?

13-04-2021

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడం అతి పెద్ద సవాలుగా మారింది. చాలా మందికి పాతికేండ్లు నిండకుండానే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి.

manavi

ఆరోగ్యం

పరగడుపున తాగండి

11-04-2021

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. డీ హైడ్రేషన్‌, తల నొప్పి, వేడి వల్ల చర్మం పగుళ్లు, పొడిబారడం, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్క పనితో చెక్‌ పెట్టే వీలుందని మీకు

manavi

ఆరోగ్యం

వేసవి జాగ్రత్తలు

10-04-2021

వేసవి వల్ల అందరికీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక గర్బిణీలనైతే మకీ బాధిస్తాయి. సరిగ్గా తినలేక ఈ సమస్యకు గురవుతుంటారు. మానసికంగా కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గర్భిణీలు ఇటువంటి

manavi

ఆరోగ్యం

వీటికి దూరంగా...

09-04-2021

వేసవి కాలంలో ఎలాంటి అనారోగ్యం బారిన పడుకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కాస్తంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.