విష పదార్థాలను తరిమేస్తుంది | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

విష పదార్థాలను తరిమేస్తుంది

మంచినీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగేది టీనే. అందుకే ఈ టీలలో కొత్త కొత్త రకాలను తయారుచేస్తున్నారు. రుచితో పాటు సువాసన కూడా వేర్వేరుగా ఉండేలా చేస్తున్నారు. కొందరికి తియ్యటి పాలతో చేసిన టీ నచ్చితే, మరికొందరికి స్పైసీ టీలు, ఇంకొందరికి పుల్లటి టీలు టేస్టీగా ఉంటాయి. చిక్కగా, కమ్మగా, స్ట్రాంగ్‌గా ఎవరికి నచ్చినట్టు వారు టీ చేసుకోవచ్చు. కొంత మంది మేం టీ తాగం అంటారు. కానీ టీ తాగితే ఎంతో మేలు. ఎందుకంటే తేయాకులో యాంటీఆక్సిడెంట్స్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరంలో విష వ్యర్థాలను తరిమేస్తాయి. గ్రీన్‌ టీ లాంటివి అధిక బరువును తగ్గిస్తాయి. అల్లం టీ జబులు, గొంతులో గరగరను పోగోడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది లెమన్‌ గ్రాస్‌ టీ గురించి. ఈ లెమన్‌ గ్రాస్‌ (గడ్డి మొక్క)ను ఇళ్లలో పెంచుకోవచ్చు. ఆహారంలో వేసుకోవచ్చు. టీలాగా తాగొచ్చు. మరి దీనితో ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్స్‌: మిగతా టీల్లాగే ఇందులోనూ శరీరంలోని విషవ్యర్థాల్ని తరిమేసే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. కణాలు పాడవకుండా కాపాడతాయి. అందువల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గుండెకు ఈ టీ ఎంతో మేలు చేస్తుంది.
దంతాలకు మేలు: ఈ టీలో సూక్ష్మక్రిముల అంతు చూసే లక్షణం ఉంటుంది. అది మన నోటి దంతాలను కాపాడుతుంది. దుర్వాసన పోగొడుతుంది. చిగుళ్లు దెబ్బ తినకుండా కాపాడుతుంది.
కాన్సర్‌ రాకుండా: రకరకాల వ్యాధుల్లో ఒకటైన కాన్సర్‌ రాకుండా లెమన్‌ గ్రాస్‌ టీ కాపాడుతోందని పరిశోధనల్లో తేలింది. కీమోథెరపీ చేసే సమయంలో ఈ టీ ఇస్తున్నారు.
జీర్ణశక్తికి: కొంతమందికి ఏం తిన్నా సరిగా జీర్ణం కాదు. అలాంటి వారు తిన్న తర్వాత ఈ టీ తాగితే దెబ్బకు అరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు కూడా.
చర్మానికి మేలు: చర్మంపై మొటిమలు, మచ్చలు, ఆనికాయలు, కురుపులు ఇలాంటివి ఏవి ఉన్నా ఈ టీ తాగుతూ ఉంటే క్రమంగా అవి తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ టీలోని గుణాలు చెడు కణాల్ని తొలగించి మంచి కణాల్ని పెంచుతాయి. 

విష పదార్థాలను తరిమేస్తుంది

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

నిర్లక్ష్యం వద్దు

14-04-2021

స్త్రీలు ఇంటి పనుల్లో, ఆఫీసు పనుల్లో అలుపెరగకుండా పనిచేస్తారు. కానీ తమ ఆరోగ్యం పట్ల, వేళకు తాము తీసుకునే ఆహారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు.

manavi

ఆరోగ్యం

పండ్ల రసాలతో...

14-04-2021

వేసవిలో దొరికే పండ్ల రసాలలో విటమిన్‌ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. మలబద్దత సమస్య తొలగిపోతుంది, ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు, కిడ్నీలలో రాళ్లు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండాలంటే..?

13-04-2021

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడం అతి పెద్ద సవాలుగా మారింది. చాలా మందికి పాతికేండ్లు నిండకుండానే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి.

manavi

ఆరోగ్యం

పరగడుపున తాగండి

11-04-2021

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. డీ హైడ్రేషన్‌, తల నొప్పి, వేడి వల్ల చర్మం పగుళ్లు, పొడిబారడం, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్క పనితో చెక్‌ పెట్టే వీలుందని మీకు

manavi

ఆరోగ్యం

వేసవి జాగ్రత్తలు

10-04-2021

వేసవి వల్ల అందరికీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక గర్బిణీలనైతే మకీ బాధిస్తాయి. సరిగ్గా తినలేక ఈ సమస్యకు గురవుతుంటారు. మానసికంగా కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గర్భిణీలు ఇటువంటి

manavi

ఆరోగ్యం

వీటికి దూరంగా...

09-04-2021

వేసవి కాలంలో ఎలాంటి అనారోగ్యం బారిన పడుకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కాస్తంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.