ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

కరోనాతో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఒక్క కరోనా మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి జబ్బులు మన దరి చేరకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సిందే. అలాంటి మంచి ఆరోగ్యం మనం పొందడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం...
ఆరోగ్యకరమైన జీవితం గడపితే వచ్చే ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది. మంచి ఆహారం తీసుకుంటూ, నిత్యం వ్యాయామాలు చేసేవారు ఎక్కువ మంది ఈ కారణం చేతే చేస్తారు. ఇలాంటి వారికి అనారోగ్యాలు చాలా తక్కువగా వస్తాయి. దాంతో జీవిత కాలం పెరుగుతుంది.
హాయిగా ఉంటుంది
వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా ఉండడం మనకు ఎంతో సహాయం చేస్తుంది. ఆరోగ్యం అనేది మన మీద మనకు నమ్మకం, గౌరవం పెంచుతుంది. అదే మనల్ని ధైర్యంగా ఉంచుతుంది. వ్యాయామం చేయడం వల్ల ఆనందంగా ఉంచే హార్మోన్స్‌ రిలీజ్‌ అవుతాయి. దాంతో రోజంతా హాయిగా గడిపోయవచ్చు.
ఒత్తిడి తగ్గుతుంది
మనం గడుపుతున్న ఈ హడావిడి జీవితంలో ఒత్తిడి తప్పని సరి అయిపోయింది. ఆరోగ్యంగా జీవించడం వల్ల ఒత్తిడికి వీలున్నంత దూరంగా ఉండగలం. ఒక వేళ ఒత్తిడి కలిగినా చక్కగా మ్యానేజ్‌ చేయగలం. అప్పటికే ఉన్న ఒత్తిడికి తోడు అనారోగ్యం తాలూకు స్ట్రెస్‌ యాడ్‌ అవకుండా చూసుకోగలం.
వ్యసనాలు ఉండవు
అతి ఎప్పటికైనా ప్రమాదమే అని మన పెద్దవాళ్ళు తరచూ అంటూ ఉంటారు. అయితే ఆరోగ్యకరమైన జీవితంలో ఎలాంటి వ్యసనాలకూ తావు ఉండదు. స్మోకింగ్‌, ఆల్కహాల్‌ మాత్రమే కాదండీ అదుపు తప్పినది ఏదైనా వ్యసనమే. పొద్దున్న లేచినప్పటి నుండీ రాత్రి పడుకునే వరకూ వర్క్‌ చేస్తే అది కూడా వ్యసనమే. అందుకే అలాంటి వాళ్ళని పని రాక్షసులు అంటారు.
కనుచూపు బాగుంటుంది
మంచి కంటి చూపు కూడా చాలా అవసరం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దవాళ్ళు. ఆరోగ్యకరమైన జీవన శైలి వల్ల వచ్చే లాభాల్లో ఒకటి కనుచూపు బాగుండడం.
ఆస్పత్రి ఖర్చు తక్కుతుంది
ఆరోగ్యానికీ ఆర్ధిక సమస్యలకూ కూడా సంబంధం ఉంటుంది . ఆరోగ్యంగా ఉన్నామంటే అర్ధం మెడిసిన్స్‌ మీద పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గించుకోగలమని కూడా. కాబట్టి మనం ఆర్ధికంగా బలంగా ఉండాలంటే ఆరోగ్యం తప్పనిసరి.
ఆత్మ విశ్వాసం పెరుగుతుంది
మీరు రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే చూడడానికి చక్కగా కనపడతారు. చక్కగా ఫీల్‌ అవుతారు కూడా. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, జీవితం సంతృప్తి కరంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాల్సిందే.
మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు
చక్కని జీవన శైలి పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటే ఆ ప్రభావం మీ చుట్టు పక్కల వారి మీద కూడా పడుతుంది. మిమ్మల్ని చూసి వారు కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిని ఫాలో అవ్వడం మొదలు పెడతారు.
ఆరోగ్యంగా ఉండాలంటే..?
హెల్దీ డైట్‌: సన్నగా కనిపించడం కోసమో, ఇష్టపడి కొనుక్కున్న జీన్స్‌లో పట్టడం కోసమో హెల్దీ డైట్‌ తీసుకోవడం కాకుండా మీ సిస్టమ్‌ స్మూత్‌గా ఉండడం కోసం తీసుకోండి. మీ ఎనర్జీ లెవెల్స్‌ బూస్ట్‌ అప్‌ అవ్వడం కోసం తీసుకోండి. హెల్దీ డైట్‌ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు, పోషకాహారం తీసుకోనప్పుడు ఒత్తిడితో పోరాడడం ఇంకా కష్టంగా ఉంటుంది.
నిద్ర పోండి: రాత్రి హాయిగా నిద్ర పోవాలని మీకు మీరే ఒక ప్రామిస్‌ చేసుకోండి. ఆ ప్రామిస్‌ నిలబెట్టుకోండి. ఇది చేయడానికి మీకు ఉపకరించే కొన్ని అలవాట్లు:
1. మద్యాహ్నం రెండు తరువాత కెఫీన్‌ తీసుకోకండి
2. నిద్రని ఇబ్బంది పెట్టే ఆహారం రాత్రిపూట తీసుకోకండి
3. ప్రతి రాత్రీ ఒకే సమయానికి నిద్రపోండి
4. ప్రతి ఉదయం ఒకే సమయానికి నిద్ర లేవండి
5. మీ బెడ్‌రూం ప్రశాంతంగా నిద్రపోవడానికి అనువుగా ఉంచుకోండి
ఫిట్‌నెస్‌: మీకు కుదిరే ఫిట్‌నెస్‌ హ్యాబిట్‌ చేసుకోండి. ప్రస్తుతం అందరివీ బిజీ షెడ్యూల్సే. ఈ షెడ్యూల్లో వర్కౌట్‌ కూడా ఫిట్‌ అవ్వాలంటే ఒకటే మార్గం. మీ ఇతర అలవాట్లతో ఈ వర్కౌట్‌ హ్యాబిట్‌ని కలిపేయండి. లేదా మీరు ప్రతి రోజూ చేసే పనులతో పాటూ ఇది కూడా చేసేయండి. ఉదాహరణకి మీరు ప్రతి రోజూ మీ ఫ్రెండ్స్‌తోనే, తల్లిదండ్రులతోనే ఫోన్‌ చేసి మాట్లాడతారనుకోండి. ఆ సమయాన్ని వాకింగ్‌కి వినియోగించుకోండి. వీటితో పాటు మీరు చేయవలసిన ఇంకో ముఖ్యమైన పని రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్‌ చేయించుకోవడం. 

ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

నిర్లక్ష్యం వద్దు

14-04-2021

స్త్రీలు ఇంటి పనుల్లో, ఆఫీసు పనుల్లో అలుపెరగకుండా పనిచేస్తారు. కానీ తమ ఆరోగ్యం పట్ల, వేళకు తాము తీసుకునే ఆహారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు.

manavi

ఆరోగ్యం

పండ్ల రసాలతో...

14-04-2021

వేసవిలో దొరికే పండ్ల రసాలలో విటమిన్‌ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. మలబద్దత సమస్య తొలగిపోతుంది, ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు, కిడ్నీలలో రాళ్లు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండాలంటే..?

13-04-2021

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడం అతి పెద్ద సవాలుగా మారింది. చాలా మందికి పాతికేండ్లు నిండకుండానే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి.

manavi

ఆరోగ్యం

పరగడుపున తాగండి

11-04-2021

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. డీ హైడ్రేషన్‌, తల నొప్పి, వేడి వల్ల చర్మం పగుళ్లు, పొడిబారడం, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్క పనితో చెక్‌ పెట్టే వీలుందని మీకు

manavi

ఆరోగ్యం

వేసవి జాగ్రత్తలు

10-04-2021

వేసవి వల్ల అందరికీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక గర్బిణీలనైతే మకీ బాధిస్తాయి. సరిగ్గా తినలేక ఈ సమస్యకు గురవుతుంటారు. మానసికంగా కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గర్భిణీలు ఇటువంటి

manavi

ఆరోగ్యం

వీటికి దూరంగా...

09-04-2021

వేసవి కాలంలో ఎలాంటి అనారోగ్యం బారిన పడుకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కాస్తంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.