ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

ప్రస్తుతం యువత ఫ్యాషన్‌కి ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ముఖానికి మాత్రమే పరిమితమైన అందం అనే అంశం నేడు కొత్త పుంతులు తొక్కుతోంది. మారుతున్న అభిరుచులు, అలవాట్లతో ప్రపంచం రంగులు పులుముకుంటోంది. జుట్టుకు వేసుకునే రంగు దగ్గర్నుంచి కాళ్ల గోళ్లకు వేసుకునే రంగుల దాకా అన్నీ ఫ్యాషన్‌కు తగ్గట్టుగా ఉండాలని యువత భావిస్తోంది. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ తక్కువేమీ కాదు. అయితే ఫ్యాషన్‌పై యువత పెంచుకున్న మోజు వారిని కొత్త సమస్యల్లోకి నెట్టేస్తోంది. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. అలాంటి అలవాట్లలో కొన్ని ఇవే...
హైహీల్స్‌: హుందాను చాటుకునేందుకు ఈ హైహీల్స్‌ను వేసుకుంటున్నారు. కాలివెనుక భాగంలో ఈ హైహీల్స్‌ను డిజైన్‌ చేస్తారు. దీనివల్ల ముందర భాగంపై అధిక బరువు పడుతోంది. దీనివల్ల కాలి మడమలు దెబ్బతినే ప్రమాదముంది. మోడ్రన్‌ కల్చర్‌ పేరుతో చాలామంది అమ్మాయిలు వీటిని ధరిస్తున్నారు. ఇబ్బందిగా అనిపిస్తున్నప్పటికీ ఎక్కడ చిన్నబోతామేమోనని భరిస్తున్నారు. సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.
కాంటాక్ట్‌ లెన్స్‌లు: కండ్లలో కనుగుడ్డు మెరుపులు మెరిసేలా కొంతమంది కాంటాక్ట్‌ లెన్స్‌లు పెట్టుకుంటుంటారు. దృష్టిలోపాన్ని ప్రపంచానికి తెలియకుండా వీటిని ధరిస్తుంటారు. డాక్టర్లను సంప్రదించకుండా ఈ కాంటాక్ట్‌ లెన్స్‌లను పెట్టుకోవడం వల్ల, వీటిని అమర్చుకునే ప్రయత్నంలో కంటిచూపు శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉందని ఐ స్పెషలిస్టులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలోనే వీటిని ధరించాలని సూచిస్తున్నారు.
ఫ్లిప్‌ ఫ్లాప్స్‌: కాలేజీ యువత ఎక్కువగా ధరించే చెప్పులు ఫ్లిప్‌ఫ్లాప్‌ స్లిప్పర్స్‌. ఇవి ఎంతో తేలికగాను, సౌకర్యవంతంగానూ ఉండటం వల్ల ఎక్కువ మంది వీటినే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే వీటిని ధరించడం వల్ల కాళ్లకు ప్రమాదం. అంతేకాదు, ఏదైనా కాలికి దెబ్బ తగిలినా ఇవి ఏ మాత్రం రక్షణ కల్పించలేవు.
హెవీ ఇయర్‌ రింగ్స్‌: యూత్‌ అందరికీ ఆభరణాలంటే విపరీతమైన ఇష్టం. వాటిని ఎంత ఖర్చుపెట్టి కొనడానికైనా వెనుకాడరు. చెవులకు ఇంపుగా ఉంటాయని కెంపులు ధరిస్తారు. అయితే చెవులకు ధరించే ఆభరణాల వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయట. బరువైన ఇయర్‌ రింగ్స్‌ను పెట్టుకోవడం వల్ల ఆ ప్రదేశం సాగిపోయి తీవ్రంగా నొప్పి కలిగిస్తుంది. పట్టించుకోకుండా అలాగే ధరిస్తే ఆ గాయం పుండుగా మారి బాధిస్తుంది. వీలైనంత తేలికైన ఆభరణాలు పెట్టుకుంటేనే మంచింది.
నెక్‌టైస్‌, టైట్‌ షర్ట్‌ కాలర్స్‌: ఆఫీసుకెళ్లే ప్రతీ ఒక్కరూ హుందాగా కనిపించడం కోసం మెడకు టై కట్టుకుంటుంటారు. అమ్మాయిలుగా కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. ఇలా టై కట్టుకుని రాకపోతే అడుగుపెట్టనివ్వని ఆఫీసులు కూడా ఉన్నాయి. అయితే మెడకు బిగుతుగా టై కట్టుకోవడం వల్ల అనేక నష్టాలున్నాయట. మెదడుకు, కళ్లకు రక్తప్రసరణ నెమ్మదిస్తుందట. దానివల్ల రాబోయే రోజుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తేలింది. అంతేకాకుండా గ్లకోమాకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
టైట్‌ జీన్స్‌: జీన్స్‌ ధరించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా టైట్‌ జీన్స్‌ ధరించడం ఫ్యాషనైపోయింది. వీటిని ధరించడం వల్ల కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుందట. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

నిర్లక్ష్యం వద్దు

14-04-2021

స్త్రీలు ఇంటి పనుల్లో, ఆఫీసు పనుల్లో అలుపెరగకుండా పనిచేస్తారు. కానీ తమ ఆరోగ్యం పట్ల, వేళకు తాము తీసుకునే ఆహారాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు.

manavi

ఆరోగ్యం

పండ్ల రసాలతో...

14-04-2021

వేసవిలో దొరికే పండ్ల రసాలలో విటమిన్‌ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. మలబద్దత సమస్య తొలగిపోతుంది, ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు, కిడ్నీలలో రాళ్లు

manavi

ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండాలంటే..?

13-04-2021

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంగా జీవించడం అతి పెద్ద సవాలుగా మారింది. చాలా మందికి పాతికేండ్లు నిండకుండానే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి.

manavi

ఆరోగ్యం

పరగడుపున తాగండి

11-04-2021

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. డీ హైడ్రేషన్‌, తల నొప్పి, వేడి వల్ల చర్మం పగుళ్లు, పొడిబారడం, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్క పనితో చెక్‌ పెట్టే వీలుందని మీకు

manavi

ఆరోగ్యం

వేసవి జాగ్రత్తలు

10-04-2021

వేసవి వల్ల అందరికీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక గర్బిణీలనైతే మకీ బాధిస్తాయి. సరిగ్గా తినలేక ఈ సమస్యకు గురవుతుంటారు. మానసికంగా కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గర్భిణీలు ఇటువంటి

manavi

ఆరోగ్యం

వీటికి దూరంగా...

09-04-2021

వేసవి కాలంలో ఎలాంటి అనారోగ్యం బారిన పడుకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కాస్తంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.