ఆరోగ్యకరమైన కురులకు ఆలివ్‌ ఆయిల్‌ | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఆరోగ్యకరమైన కురులకు ఆలివ్‌ ఆయిల్‌

దుమ్ము, దూళి, పోషకాహార లోపాలు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు రాలడం, చుండ్రు ఏర్పడటం, వెంట్రుకలు నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటికి పరిష్కారంగా..
ఎ తలలో చుండ్రు సమస్య ఉంటే విరుగుడుగా ఆలివ్‌ ఆయిల్‌ ప్యాక్‌ వేసుకోవాలి. ఇందుకు టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, నాలుగైదు చుక్కల నిమ్మరసం, టీ స్పూన్‌ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. 20 నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2-3 సార్లు ఈవిధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
- వెంట్రుకలకు సరైన మాయిశ్చరైజర్‌ అందకపోతేనే పొడిబారడం, జీవం లేనట్టుగా ఉండటం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వేళ్లకు కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ను అద్దుకుంటూ వెంట్రుకలకు నూనె పట్టించాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈవిధంగా వారంలో 2రోజులు చేస్తూ ఉంటే వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోవు. చిట్లడం వంటి సమస్యలు తలెత్తవు.
- వెంట్రుకలు రాలడం వంటి సమస్యలను నివారించడమేకాదు, వాటి పెరుగుదలకూ దోహదం చేస్తుంది ఆలివ్‌ ఆయిల్‌. వెంట్రుక కుదురు బలంగా అవాలంటే దానికి తగిన పోషకాలు అందాలి. ఈ సుగుణాలు ఆలివ్‌ ఆయిల్‌లో ఉండటం వల్ల వారానికి ఒక్కసారైనా ఆలివ్‌ ఆయిల్‌ను ఉపయోగించాలి. దీనివల్ల వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది. రాలడం సమస్య దరిచేరదు.
- ఆలివ్‌ ఆయిల్‌- కొబ్బరినూనె సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ జాగ్రత్తల వల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. రాలడం వంటి సమస్య ఉత్పన్నం కాదు.
- ఆలివ్‌ ఆయిల్‌ను పెట్టిన తర్వాత వేడి నీళ్లలో ముంచి, పిండిన టవల్‌ను (టర్కీ టవల్‌) తలకు చుట్టాలి. దీని ద్వారా వెంట్రుక కుదుళ్లలో ఉన్న మురికి మృతకణాలు తొలగిపోయి, రక్తప్రసరణ మెరుగై వెంట్రుకలు రాలడం అనే సమస్య దరిచేరదు.

ఆరోగ్యకరమైన కురులకు ఆలివ్‌ ఆయిల్‌

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

శుభ్రం చేస్తున్నారా?

17-07-2019

పండ్లు, కూరగాయలు ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ లాంటి పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి. అయితే మార్కెట్‌ నుంచి తెచ్చిన పళ్లను శుభ్రం చేయకుండా ఆబగా తింటే

manavi

ఆరోగ్యం

అపోహలు వద్దు!

17-07-2019

తల్లి కావడం ఓ వరం. అయితే అప్పటి వరకు తన ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఆ తల్లి పాప పుట్టగానే మారిపోతుంది. తన దష్టంతా పుట్టిన పాపపైనే

manavi

ఆరోగ్యం

చూపు పదిలం

17-07-2019

మనకు ప్రపంచాన్ని చూపుతున్న కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మీ దష్టి బాగుండాలంటే ఈ టిప్స్‌ పాటించండి.

manavi

ఆరోగ్యం

వెంట వెంటనే తినొద్దు!

16-07-2019

తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసిందే. అలాగని క్రమ పద్ధతి లేకుండా పండ్లను ఆరగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు పోషకాహార నిపుణులు. హెల్దీడైట్‌ అంటే పండ్లు

manavi

ఆరోగ్యం

వాయన్యాసనం

15-07-2019

ముందుగా నిటారుగా నిలబడాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు శ్వాసని తీసుకుంటూ పైకి లేపాలి, ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ శరీరాన్ని సమతుల్యం చేసుకుంటూ కుడి కాలిని 90 కోణం వరకు లేపాలి. ఏదైనా వస్తువు

manavi

ఆరోగ్యం

చక్కెరతో చేటు

15-07-2019

చక్కెర అంటే చాలా మందికి ఎనలేని తీపి. రోజువారి జీవితంలో చక్కెర ని ఏదోరూపంలో తీసుకునే వాళ్లు అత్యధికం. అయితే చక్కెర మూలాన చాలా సమస్యలు వస్తాయనేది చేదు నిజం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ చక్కెర

manavi

ఆరోగ్యం

సర్వరోగ నివారిణి

15-07-2019

సులువుగా, విరివిగా దొరికే చెట్లలో వేపచెట్టు అగ్రస్థానం. ఈ చెట్టులో అన్నీ ఉపయోగకారకాలే. అందుకే వేపచెట్టును సర్వరోగ నివాణి అని కూడా పిలుస్తారు. ఈచెట్టు ఉపయోగాలేంటంటే...

manavi

ఆరోగ్యం

దోమల బాధా?

14-07-2019

చాలా గహాల్లో దోమల బాధ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ దోమలు మరీ ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.