స్వీట్లు తింటున్నారా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

స్వీట్లు తింటున్నారా?

వరఖ్‌.. ఇది చాలామందికి తెలిసిందే. స్వీట్ల మీద, పాన్‌ల మీద మిలమిల మెరుస్తూ వుండే సిల్వర్‌ ఫాయిల్‌నే 'వరఖ్‌' అంటారు. వెండి రేకుని ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా చాలా పల్చగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత పల్చటి పొరలా తయారు చేస్తారు. వీటిని స్వీట్స్‌ మీద అద్దుతారు. వరఖ్‌ అద్దిన స్వీట్లని, పాన్లని మనం చాలా ఇష్టంగా తింటూ వుంటాం. వాటి మీద వరఖ్‌ వుంది కదా అని ఎక్కువ రేటు చెల్లించి మరీ మనం కొంటూ వుంటాం. నిజానికి వరఖ్‌ వున్న స్వీట్లు, పాన్లు తినడం వల్ల మనకేమైనా మేలు జరుగుతుందా? మేలు సంగతి అటుంచండి.. కీడు జరిగే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. చూడటానికి చాలా అందంగా కనిపించే ఈ పల్చటి వెండి రేకులు వలన చాలా ప్రమాదాలు ఉన్నాయట. వరఖ్‌ వాడటం వల్ల స్వీట్లు, పాన్లు చూడగానే ఎట్రాక్టివ్‌గా వుంటాయి. అయితే ఈ అతి పల్చటి వెండి రేకుల్లో హానికారక పదార్థాలు ఉంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో క్యాన్సర్‌ కారక లోహాలు కొన్ని ఉంటున్నాయట. వరఖ్‌లో వెండితోపాటు సీసం, కాడ్మియం వంటివి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. వరఖ్‌ తయారీ కోసం శుద్ధమైన వెండిని ఉపరయోగించాలి. అయితే వరఖ్‌ తయారు చేస్తున్నవారు సరిగా శుద్ధి చేయని వెండిని ఉపయోగించడం వల్లనే సమస్యలు వస్తున్నాయంటున్నారు పరిశోధకులు. ఆహార పదార్థాలు, కల్తీ నివారణ చట్టం ప్రకారం 99.9 శాతం స్వచ్ఛమైన వెండిని మాత్రమే వరఖ్‌ తయారీలో ఉపయోగించాలి. కానీ వాస్తవంలో అలా జరగటంలేదట. ఆహార పదార్థాలలో వాడే వరఖ్‌ నాణ్యతపై కచ్చితమైన నియంత్రణలు ఉండాలని సూచిస్తున్నారు వారు. అంచేత ఈసారి వరఖ్‌ అద్దిన స్వీట్లు, పాన్‌ తినేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకోండేం!

స్వీట్లు తింటున్నారా?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

పంటినొప్పిని తగ్గించే ఇంగువ

19-07-2019

సీజన్‌ మారింది.. ఈ సీజన్‌ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది. అదీ మైగ్రేన్‌ అంటే భరించ లేనిది. మైగ్రేన్‌ తలనొప్పికి చెక్‌ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే

manavi

ఆరోగ్యం

న్యూస్‌పేపర్‌తో హాని..

18-07-2019

పూరీలు, వడలు పీల్చుకున్న అదనపు నూనెను వదిలించటం కోసం వాటిని న్యూస్‌పేపర్‌ మీద వేస్తుంటాం. అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదే అయినా అందుకోసం పేపర్‌ వాడటం మాత్రం హానికరమే! ఎందుకంటే..

manavi

ఆరోగ్యం

పాతబాటిళ్లతో కంటెయినర్లు

18-07-2019

పాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను వంటింట్లో పప్పు దినుసులు నిల్వచేసుకునే కంటెయినర్లుగా ఉపయోగించొచ్చు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను కంటెయినర్లుగా మార్చేందుకు రెండు పాత ప్లాస్టిక్‌

manavi

ఆరోగ్యం

శుభ్రం చేస్తున్నారా?

17-07-2019

పండ్లు, కూరగాయలు ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ లాంటి పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి. అయితే మార్కెట్‌ నుంచి తెచ్చిన పళ్లను శుభ్రం చేయకుండా ఆబగా తింటే

manavi

ఆరోగ్యం

అపోహలు వద్దు!

17-07-2019

తల్లి కావడం ఓ వరం. అయితే అప్పటి వరకు తన ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఆ తల్లి పాప పుట్టగానే మారిపోతుంది. తన దష్టంతా పుట్టిన పాపపైనే

manavi

ఆరోగ్యం

చూపు పదిలం

17-07-2019

మనకు ప్రపంచాన్ని చూపుతున్న కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మీ దష్టి బాగుండాలంటే ఈ టిప్స్‌ పాటించండి.

manavi

ఆరోగ్యం

వెంట వెంటనే తినొద్దు!

16-07-2019

తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసిందే. అలాగని క్రమ పద్ధతి లేకుండా పండ్లను ఆరగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు పోషకాహార నిపుణులు. హెల్దీడైట్‌ అంటే పండ్లు

manavi

ఆరోగ్యం

వాయన్యాసనం

15-07-2019

ముందుగా నిటారుగా నిలబడాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు శ్వాసని తీసుకుంటూ పైకి లేపాలి, ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ శరీరాన్ని సమతుల్యం చేసుకుంటూ కుడి కాలిని 90 కోణం వరకు లేపాలి. ఏదైనా వస్తువు