ఆరోగ్యానికి జామపండ్లు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఆరోగ్యానికి జామపండ్లు

జామ పండు తింటే జలుబు చేస్తుందని, దగ్గు వస్తుందని కొందరు ఈ పండుని పక్కన పెడుతుంటారు. అయితే పోషకాహార నిపుణులు మాత్రం జామ ఫలాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో తోడ్పడుతా యని చెబుతున్నారు.
- జామ పళ్లలో కావాల్సినంత విటమిన్‌-సి ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ విటమిన్‌-సి యాంటాక్సిడెంట్స్‌గా కూడా పని చేస్తుంది. జామపళ్లు జలుబు, ఫ్లూ రాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
- జామ పండులో పొటాషియం లెవల్స్‌ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది ఎలక్టోల్రైట్‌గా శరీరానికి కావాల్సిన సత్తువను అందిస్తుంది. జీర్ణక్రియ కూడా సాఫీగా జరిగేలా చేస్తుంది.
- కండరాల పనితీరులో పొటాషియం క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. యవ్వనాన్ని కాపడటంలో కూడా జామ మంచి గుణం కనబరుస్తుంది.
- కంటి ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. డైలీ డైట్‌లో జామపండు చేరిస్తే చర్మసౌందర్యం కూడా పెరుగుతుంది. కమలా పండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిన్‌ ' సి' ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయ లో ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే '' కొల్లాజన్‌ '' ఉత్పత్తికి ఇది కీలకముం.
- కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే '' పెక్టిన్‌'' జామలో లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్‌ ను తగ్గించి , పేగుల్లో ప్రోటీన్‌ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది .
- జామలో కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిపండు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి, సి విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్‌ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు.
- జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్‌, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది షుగర్‌ వ్యాధికి చక్కటి ఔషధం .
- గులాబి రంగులో ఉండే జామపండు చర్మాన్ని శుభ్రంగా, కాంతివంతంగా చేస్తుంది. అంతేకాకుండా, ఇది ముఖచాయని మెరుగుపరుస్తుంది. జామపండుని మెత్తగా చేసి దానికి గుడ్డు సొనని కలిపి మొహానికి పూసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా వారంలో రెండుసార్లు చేయటం వలన చర్మానికి మంచి మెరుపు వస్తుంది.

ఆరోగ్యానికి జామపండ్లు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

శుభ్రం చేస్తున్నారా?

17-07-2019

పండ్లు, కూరగాయలు ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ లాంటి పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి. అయితే మార్కెట్‌ నుంచి తెచ్చిన పళ్లను శుభ్రం చేయకుండా ఆబగా తింటే

manavi

ఆరోగ్యం

అపోహలు వద్దు!

17-07-2019

తల్లి కావడం ఓ వరం. అయితే అప్పటి వరకు తన ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఆ తల్లి పాప పుట్టగానే మారిపోతుంది. తన దష్టంతా పుట్టిన పాపపైనే

manavi

ఆరోగ్యం

చూపు పదిలం

17-07-2019

మనకు ప్రపంచాన్ని చూపుతున్న కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మీ దష్టి బాగుండాలంటే ఈ టిప్స్‌ పాటించండి.

manavi

ఆరోగ్యం

వెంట వెంటనే తినొద్దు!

16-07-2019

తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసిందే. అలాగని క్రమ పద్ధతి లేకుండా పండ్లను ఆరగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు పోషకాహార నిపుణులు. హెల్దీడైట్‌ అంటే పండ్లు

manavi

ఆరోగ్యం

వాయన్యాసనం

15-07-2019

ముందుగా నిటారుగా నిలబడాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు శ్వాసని తీసుకుంటూ పైకి లేపాలి, ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ శరీరాన్ని సమతుల్యం చేసుకుంటూ కుడి కాలిని 90 కోణం వరకు లేపాలి. ఏదైనా వస్తువు

manavi

ఆరోగ్యం

చక్కెరతో చేటు

15-07-2019

చక్కెర అంటే చాలా మందికి ఎనలేని తీపి. రోజువారి జీవితంలో చక్కెర ని ఏదోరూపంలో తీసుకునే వాళ్లు అత్యధికం. అయితే చక్కెర మూలాన చాలా సమస్యలు వస్తాయనేది చేదు నిజం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ చక్కెర

manavi

ఆరోగ్యం

సర్వరోగ నివారిణి

15-07-2019

సులువుగా, విరివిగా దొరికే చెట్లలో వేపచెట్టు అగ్రస్థానం. ఈ చెట్టులో అన్నీ ఉపయోగకారకాలే. అందుకే వేపచెట్టును సర్వరోగ నివాణి అని కూడా పిలుస్తారు. ఈచెట్టు ఉపయోగాలేంటంటే...

manavi

ఆరోగ్యం

దోమల బాధా?

14-07-2019

చాలా గహాల్లో దోమల బాధ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ దోమలు మరీ ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.