ఉప్పు ఉపయోగాలు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఉప్పు ఉపయోగాలు

ఇంట్లో ఇల్లాలికి చిన్నచిన్న చిట్కాలు తెలిస్తే పని సులువు అవుతుంది. శ్రమ తగ్గుతుంది. అలాంటి చిట్కాలలో అందుబాటులో ఉండే ఉప్పుతో కొన్ని ......
- మైక్రోఓవెన్‌లో వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పదార్థాలు పొంగుతాయి. ఆసమయంలో ఓవెన్‌ అంతా శుభ్రం చెయ్యాలంటే పెద్దపనే.పైగా పదార్థాలు కాలిన వాసన ఓవెన్‌లో అలానే ఉంటుంది. అందుకు చెయ్యాల్సిందల్లా పదార్థాలు పడిన చోట కొద్దిగా ఉప్పును చల్లి, పొడి వస్త్రంతో తుడిస్తే చాలు. ఓవెన్‌ శుభ్రపడడంతో పాటు, పదార్థాలు కాలినవాసన కూడా పోతుంది.
- టీ, కాఫీ తాగే కప్పులు మనం తోమినా, అడుగున నల్లగా మరకలు పట్టి ఉంటాయి. ఆ కప్పుల్లో చిటికెడు ఉప్పు వేసి, శుభ్రం చేస్తే కొత్త వాటిల్లా మెరుస్తాయి. గాజు, పింగాణి పాత్రలని ఇలా ఉప్పుతో శుభ్రం చేస్తే తెల్లగా మెరుస్తాయి.
- అందానికి ఫ్లవర్‌వాజ్‌లలో పెట్టే ప్లాస్టిక్‌ పూలకి దుమ్ము పడితే, వాటిని నీటితో శుభ్రం చేసేకంటే ఒక ప్లాస్టిక్‌ కవరులో గుప్పెడు ఉప్పు వేసి, ఈ పువ్వులని కవరులో పెట్టి బాగా అటుఇటు కదిపితే, పువ్వులకి ఉండే మురికి వదులుతుంది. పువ్వులు కొత్తవాటిల్లా కనిపిస్తాయి.
- వంటింటి గట్టు, డైనింగు టేబుల్‌ వంటివి ఉప్పు కలిపిన నీటితో శుభ్ర పరిస్తే ఈగల సమస్య ఉండదు.
- ఒక మగ్గు నీటిలో గుప్పెడు ఉప్పు వేసి, ఆ నీటితో కిటికీ అద్దాలను, కారు అద్దాలను, డ్రెస్సింగ్‌ టేబుల్‌ అద్దాలను తుడిస్తే మిలమిలా మెరుస్తాయి.
- ఆపిల్‌ని కట్‌ చేసాక గాలికి వదిలేస్తే ఎర్రగా మారుతుంది. అదే చిటికెడు ఉప్పువేసిన నీటిలో ఆపిల్‌ ముక్కలను వేస్తే రంగు మారకుండా ఉంటాయి. స
- ఇంట్లో ఎక్కడైనా చీమలు వస్తే ఆ చుట్టుపక్కల ఉప్పుతో ఒకగీతను గీయండి, చీమలు ఆ ఉప్పుగీతను దాటి రావు.

ఉప్పు ఉపయోగాలు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి