పరీక్షా సమయంలో.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

పరీక్షా సమయంలో..

కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు. మరికొందరు అడపాదడపా చదివినట్లే కనిపిస్తారు గానీ చక్కని మార్కులు సాధిస్తుంటారు. చదవాల్సిన అంశం పట్ల స్పష్టత, సమగ్ర అవగాహన, చదివే విధానం వంటి అంశాల్లో ఉండే మార్పులే ఇందుకు ప్రధాన కారణాలు. ఈ విషయంలో నిపుణులిచ్చే కొన్ని కీలక అంశాలను అర్థం చేసుకొని, పాటించటం ద్వారా ఎవరైనా పరీక్షల్లో చక్కని ప్రతిభను చూపించవచ్చు.
- పరీక్షలకు తగినంత సమయం కేటాయించటం, సిలబస్‌, అందుకు తగిన నోట్స్‌, చదివేటప్పుడు ఏదైనా అనుమానం వస్తే వివరించే మిత్రులు ఉన్నప్పుడు భయం, ఆందోళన లేకుండా సౌకర్యంగా చదువుకోవచ్చు. దీనివల్ల చదివింది బాగా గుర్తుంటుంది.
- ఏరోజుకారోజు చదువుకోవటం ముగియగానే.. చివరలో ఇప్పటికే చదివి, బాగా పట్టు సాధించిన పాఠాలు, ఒకసారి చదివినవి, అసలు చదవనివేమిటో అంచనా వేసుకోవాలి. అప్పుడే సిలబస్‌ కంగారు తగ్గి ధైర్యంగా చదువుతారు.
- కేవలం చదివి సరిపెట్టకుండా ఒకసారి రాసి చూసుకోవటం, ఆడియో పాఠాలు వినటం, స్నేహితులకు వివరించి వారి అభిప్రాయం కోరటం చేస్తే బాగా గుర్తుండిపోతుంది.
- చదివేటప్పుడు పూర్తి ఏకాగ్రత పెట్టటం ఎంతైనా అవసరం. దీనివల్ల తక్కువ సమయంలో అర్థం చేసుకోవడం వీలవుతుంది. లేకుంటే చదివిందే 10 సార్లు చదవాల్సి వస్తుంది.
- పరీక్షల సమయంలో రాత్రంతా మేలుకోరాదు. కనీసం ఆరు గంటలపాటు నిద్ర తప్పనిసరి. అప్పుడే జ్ఞాపకశక్తి బాగుంటుంది.
- చదువుకునేటప్పుడు మొబైల్‌ 'స్విచ్‌ ఆఫ్‌' చేస్తేనే పూర్తిగా మనసు పెట్టటం సాధ్యపడుతుంది.
-చదివేటప్పుడు 'ఇంటర్‌నెట్‌' నుంచి సమాచారం అవసరమైతే, దాన్ని 'ప్రింట్‌' తీసుకొని చదవడం మంచిది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఏకాగ్రత కూడా దెబ్బతినదు.
- తెల్లవారుజామున ఆహ్లాద వాతావరణంలో కూర్చొని చదువుకొంటే మరచిపోవటమనే సమస్య తక్కువ.
- రోజూ షెడ్యూల్‌ ప్రకారం చదువుకోవాలి. ప్రతి రెండు గంటలకోసారి 10 నిమిషాలు బ్రేక్‌ తీసుకొని వేరే సబ్జెక్టు చదువుకుంటే అన్ని అంశాలూ చదవొచ్చు.
- ప్రిపరేషన్‌ సమయంలో సినిమాలు, ఆటలు, పార్టీల జోలికి పోవద్దు.

పరీక్షా సమయంలో..

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి