కడుపుబ్బరంతో ఇబ్బందా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

కడుపుబ్బరంతో ఇబ్బందా?

కడుపులో గ్యాస్‌ సమస్య కేవలం తీసుకున్న ఆహారం అరగకపోవడం వల్లే కాదు.. అసలు ఏం తీసుకోకపోయినా తలెత్తుతుంది. ఇది అనేక రుగ్మతలకు దారితీస్తుంది. అందుకని సమయానికి భోజనం, మంచి నీరు ఎక్కువగా తాగడం, సరియైన విశ్రాంతి, వ్యాయామం పట్ల దష్టి సారించాలి.
- ఆహారాన్ని గబగబా తినటం, మాట్లాడుతూ తినటం.. సరికాదు. దీంతో జీర్ణాశయంలోకి గాలి ఎక్కువగా చేరి తేన్పులకు దారితీస్తుంది.
- ఎక్కువ మసాల లేదా కొవ్వు పదార్థాలు తినటం వల్ల కడుపు ఉబ్బరంగా మారుతుంది.
- మానసిక ఒత్తిడి, ఆందోళన, కూల్‌ డ్రింక్‌, పొగ తాగటం.. వగైరా కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి.
- కాఫీ, టీ, ఎనర్జీడ్రింకులు వంటివన్నీ పేగుల్ని డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. పాల పదార్థాలు, పిండి పదార్థాలు.. కడుపులో గ్యాస్‌ నిండేలా చేస్తాయి.
- మంచినీళ్లు మంచి డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. మూత్రపిండాలు, పెద్ద పేగులలో మలినాలు శుభ్రం అవడానికి ఉపకరిస్తాయి. ఒక గ్లాసు మంచినీళ్లలో ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకుని తాగితే కడుపు ఉబ్బరం నయం అవుతుంది.
- పీచు పదార్థాలతో పాటు అరటిపండు, పాలకూర, కీరదోసకాయ, క్యారెట్‌, టమాట, అల్లం, చిరు ధాన్యాలు తీసుకోవడంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.
- అసిడిటీ నుంచి తక్షణమే ఉపశమనం లభించాలంటే కొబ్బరి బోండాం తాగితే సరిపోతుంది.
- జీర్ణప్రక్రియ చురుగ్గా జరగడానికి మజ్జిగ, పుదీన, నిమ్మకాయ, అల్లం, ధనియాలు, పసుపు వంటివి సహకరిస్తాయి.
- ఒక స్పూన్‌ తేనె తాగితే వెంటనే అసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.
- యాలకులను (ఇలాచీలు) పొడిచేసి కాసిని నీళ్లలో మరిగించి, చల్లార్చిన మిశ్రమం తీసుకుంటే గ్యాస్‌ సమస్యలు ఇట్టే తొలిగిపోతాయి. 

కడుపుబ్బరంతో ఇబ్బందా?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి