మెంతులతో మేలు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

మెంతులతో మేలు

పప్పు, కూర, పచ్చడి, చారు.. ఏ వం టైనా ఘమఘు మలా డాలంటే పోపు (తాలింపు) లో నాలుగు మెంతులు పడాల్సిందే. మెంతులని పోపు గింజ లుగానే కాకుండా.. పొడి రూపంలోనూ, ఆకుకూర రూపంలోనూ ఉపయోగిస్తారు. ఇవి వంటలకు చక్కని రుచిని, వాసనని ఇస్తాయి. అయితే మెంతులు ఆహారంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. మెంతులలో అనేక ఔషధగుణాలు దాగున్నాయి. వీటిలో ఫోలిక్‌ ఆసిడ్‌, సోడియం, జింక్‌, మెగ్నీషియం, కాపర్‌, థయామిన్‌, నియాసిన్‌, కెరోటిన్‌.. మరెన్నో మూలకాలు కలిగి ఉండడంతో మధుమేహ వ్యాధి, కొవ్వు స్థాయిలను నియంత్రిస్తాయి. రోజూ ఉదయాన్నే ఒక చెంచా మెంతి పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- శరీరంలో ఎక్కువగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ నిల్వలను నియంత్రించి అధిక బరువు సమస్యను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. గుండె సమస్యలు దరిచేరవు.
- అనేక రోగాలకు కారణమయ్యే కఫం, వాతం, మలబద్ధకం.. లాంటి సమస్యలకు మెంతులు దివ్యఔషధంగా పనిచేస్తాయి.
- మెంతులు గ్యాస్‌ సమస్యలు, అసిడిటీలను నయంచే యడమేకాక జీర్ణవ్యవస్థను శక్తివంతం చేస్తాయి. తద్వారా ఆకలి పెరగడానికి దోహదం చేస్తాయి.
- విరేచనాలను అరికట్టడంలో మెంతులు, మజ్జిగ బాగా పనిచేస్తాయి.
- మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్‌, కౌమారిన్‌ అనే తత్వాల వల్ల టైప్‌ 1, టైప్‌ 2 మధుమేహాలు రెండింటిలోనూ చక్కని ఔషధం.
- పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు మెంతులను విరివిగా ఆహారంగా తీసుకోవాలి.
- ముఖంపై బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ మాయమవ్వడానికి మెంతి ఆకులను రుబ్బి ఉపయోగించాలి.
- జుట్టు పట్టుకుచ్చులా తయారవడానికి మెంతులను నీళ్లలో నానపెట్టి రుబ్బు కుని హెయిర్‌ ప్యాక్‌లా వేసుకోవాలి.

మెంతులతో మేలు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి