పోషకాలుండేలా.... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

పోషకాలుండేలా....

స్కూల్‌కిి వెళ్లే పిల్లలకు టిఫిన్‌ బాక్స్‌.. బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, స్నాక్స్‌.. ఇలా ఏదైనా సరే వారికి సర్దడం కొంచెం కష్టమే. ఏ రోజు ఏ ఆహారం ఇష్టంగా తింటారో.. ఏ రోజు టిఫిన్‌ బాక్స్‌ తిరిగి తీసుకొచ్చేస్తారో తెలియదు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువు మీద దష్టి సారించగలరు కాబట్టి వారి ఆహారం, అలవాట్లపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అందుకని పిల్లల టిఫిన్‌ బాక్స్‌ పైన శ్రద్ధ పెట్టాలి.
- బాక్సులో పిల్లలకు పెట్టే ఆహార పదార్థాలు శారీరకంగా మానసికంగా దఢంగా ఎదగడానికి తోడ్పడేలా మంచి పోషకాలను అందించేవిగా చూసుకోవాలి. ప్రతిరోజూ ఒకేలాంటి ఆహారం కాకుండా రోజుకోరకం అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. సింహభాగం నేచురల్‌ ఫుడ్‌ మాత్రమే ఉండాలి. అంటే ఫ్రూట్స్‌, తాజా కూరగాయాలు అన్నమాట. వీటితో పిల్లలకు వెంటనే శక్తి అందడం, ఎక్కువ సమయం వరకు హుషారుగా ఉండడమే కాక ఏకాగ్రతస్థాయి మెరుగుపడుతుంది.
- పిల్లలు చీటికిమాటికి అనారోగ్యం పాలు కావడానికి కారణం పోషకాహార లోపం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు జంక్‌ ఫుడ్‌ జోలికి వెళ్లకుండా పెద్దలే అరికట్టగలగాలి. ఉదయం వేళల్లో క్యారట్‌, బీట్‌ రూట్‌.. లాంటి పచ్చికూరగాయల రసాన్ని ఒక గ్లాసు ఇస్తే బాగుంటుంది. దానివల్ల కంటిచూపు మెరుగవుతుంది, చర్మసమస్యలు దరిచేరవు. అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, నానబెట్టిన వేరుశెనగ పప్పు, ఖర్జూర, పచ్చికొబ్బరి, డ్రై ఫ్రూట్స్‌.. పెట్టాలి. తేనె, బెల్లం.. లాంటి పదార్థాలు రోజూ తీసుకోవడం తప్పనిసరి.
- స్నాక్స్‌ సమయంలో సీజనల్‌ ఫ్రూట్స్‌ లేదా ఒక గ్లాస్‌ పండ్లరసం మంచిది. దీంతో మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారవుతారు.
- టిఫిన్‌ బాక్సులు తోటి పిల్లల కుండే లాంటివే ఉండాలి. రెండు మూడు గిన్నెలతో పదార్థాలు పెట్టడానికి అనువుగా, సుళువుగా మూతలు తీసుకునేలా బాక్స్‌ ఉండాలి. అవి మారకుండా వాటిపైన పేర్లు రాయాలి.
- పిల్లలు స్కూల్లో టిఫిన్‌ బాక్స్‌, వాటర్‌బాటిల్‌ మూతలు తీయడానికి వీలుగా ఒక్కసారి ఇంటి వద్ద చేయించి చూపించాలి.
- తక్కువ సమయంలోనే తినేవిధంగా పోషక విలువలున్న ఆహారపదార్థాలను మాత్రమే పెట్టాలి. ఎక్కువ మసాలా పదార్థాలు లేకుండా చూసుకోవాలి.
- బాక్సులో పెట్టిన పదార్థాలు ఎక్కువసమయం వరకూ ఉన్నా, పాడవకుండా ఉండే విధంగా ఉండాలి.

పోషకాలుండేలా....

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి