చేతులు శుభ్రం చేస్తున్నారా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

చేతులు శుభ్రం చేస్తున్నారా?

మన చేతులు కనిపించినంత శుభ్రం కాదని కంటికి కనిపించని బ్యాక్టీరియాతో అనారోగ్యం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మఖ్యంగా చేతులు నోట్లో, కళ్ళల్లో, చెవుల్లో పెట్టుకున్నప్పుడు గోర్లతో ఫంగస్‌, బ్యాక్టీరియా వగైరా దాడిచేసి పలు ఎలర్జీలకు కారణం అవుతుంది. అలాగే ఆఫీస్‌ టేబుల్‌కు మోచెయి ఆనించి చేతిమీద ముఖం పెట్టి కూర్చోవడం కూడా ప్రమాదకరమే అంటున్నారు. మొబైల్‌ఫోన్‌ ఇతర గ్యాడ్జెట్స్‌ నుండి ఆఫీస్‌లో కంప్యూటర్‌ కీబోర్డ్‌, ఫోన్‌... వరకు అన్నీ ముట్టుకున్న చేతులను ఎల్లప్పుడు తప్పక శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా ఆహారం తీసుకునే ముందు, బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు హ్యాండ్‌ వాష్‌ సోప్‌ లేదా లిక్విడ్‌తో శుభ్రం చేసుకోవడం విధిగా చేయాలి. చిన్నారులకు దీనిని తప్పక అలవాటు చేయాలి.
- చేతులు కూడా సున్నితమైనవేనని గుర్తించాలి. కనీసం రోజుకు రెండు సార్లయినా మాయిశ్చరైజింగ్‌ క్రీమును చేతులకు తప్ప నిసరిగా రాసుకోవాలి. రాత్రిపడుకునే ముందు చేతులకు కొబ్బరి నూనె కూడా పట్టించవచ్చు. పొడిచర్మం ఉన్నవారు ఉప్పు కలిపిన నీటితో చేతులను కడుక్కుంటే మంచిది. అలాగే గిన్నెలు, గుడ్డలు శుభ్రపరిచే డిటర్జెంట్లతో చేతులకు హాని కలగకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో ఫ్లోర్‌, బాత్రూం వగైరా శుభ్రం చేసే సమయంలో, గార్డెన్‌లో పనిచేస్తున్నప్పుడు తప్పక చేతులకు రబ్బర్‌ గ్లౌజులను వేసుకోవడం మరవకూడదు. అలాగే చర్మసౌందర్యం ఇనుమడింపచేసే తాజాకూరగాయలు, పండ్లు తినాలి. వేళ్ళ గోళ్లు అందంగా కనిపించడానికి కాల్షియం లభించే ఆహారాన్ని తీసుకోవాలి. గోళ్లను ఎప్పటికప్పడు కట్‌ చేసుకోవడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

చేతులు శుభ్రం చేస్తున్నారా?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి