మార్పులు కనిపిస్తే..! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

మార్పులు కనిపిస్తే..!

గోళ్లను నొక్కిచూసి రక్తహీనత ఉందేమో పరిశీలించడం సాధారణంగా అందరూ చేసేదే. అయితే గోళ్ల రంగు, రూపులలో మార్పులను గమనించడం ద్వారా కూడా మరికొన్ని అనారోగ్య సంకేతాలను గుర్తించవచ్చు. ఎటువంటి మచ్చలూ లేకుండా, నునుపుగా, గులాబీరంగులో క్రమపద్ధతిలో పెరిగే గోళ్లు చక్కటి శారీరక ఆరోగ్యానికి సూచికలు. అలా కాకుండా గోర్ల రంగు, ఉపరితలం, ఆకారాల్లో మార్పులు వస్తే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్టు లెక్క .
- పాలిపోయిన గోళ్లు సాధారణంగా రక్తహీనతను సూచిస్తాయి. కానీ ఒక్కోసారి ఇవి కాలేయ సంబంధిత వ్యాధులను, గుండెజబ్బులను, పోషకాహార లేమిని కూడా సూచిస్తుంటాయి. కొసల్లో నల్లని అంచులా గోళ్లు కాలేయ సంబంధిత వ్యాధులైన కామెర్లను, హెపటైటిస్‌ వంటి వాటిని సూచిస్తాయి.
- సాధారణంగా ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి థైరాయిడ్‌, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, సోరియాసిస్‌ వంటి తీవ్రమైన వ్యాధులను సూచిస్తాయి. శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ అందకపోతే గోళ్లు నీలం రంగులోకి మారతాయి.
- గోళ్లు చిన్న చిన్న గుంటలు పడితే సొరియాసిస్‌, ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌ త్వరలో రావచ్చనే సంకేతాలను ఇవి ఇస్తుంటాయి. ఒక్కోసారి గోర్ల అడుగున ఉన్న కండ బాగా ముదురు ఎరుపురంగులో కూడా కనిపిస్తుంది.
- గోర్లు నిర్జీవంగా చిట్లిపోతూ, పగిలిపోతూ ఉంటే థైరాయిడ్‌ వ్యాధిని సూచిస్తాయి. ఈ లక్షణాలతోపాటు, పసుపు రంగులో కనిపిస్తుంటే అది ఫంగ ల్‌ ఇన్‌ఫెక్షన్‌. గోరు చుట్టూ ఉన్న ప్రాంతం ఎర్రగా ఉబ్బితే కణజాలానికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌ను సూచిస్తుంది.
- గోళ్లపై ముదురు రంగులో గీతలు ఉంటే మెలనోమా అనే స్కిన్‌ క్యాన్సర్‌ను సూచిస్తుంది. ఇటువంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవడం మంచిది.
- గోళ్లు కొరకడం ఒత్తిడికి సంబందించిన సంకేతాన్ని, ఒక్కోసారి కంపల్సివ్‌ అబ్‌సెసివ్‌ డిసార్డర్‌ అనే మానసిక వ్యాధిని సూచిస్తుంది. ఎంత ప్రయత్నించినా తరచూ గోళ్లు కొరకడం మానలేకపోతుంటే వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే ఒక్కోసారి అనేక కారణాల వల్ల గోళ్లల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రానే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.

మార్పులు కనిపిస్తే..!

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి