ఫ్రిజ్‌ వాడకంలో జాగ్రత్తలు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ఫ్రిజ్‌ వాడకంలో జాగ్రత్తలు

కూరగాయలను కడిగి పూర్తిగా తడి ఆరిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టాలి.
మిరపకాయలను ఫ్రిజ్‌లో పెట్టేముందు వాటి తొడిమలు తీసి పెట్టాలి. లేదంటే ఎక్కువ రోజులు నిలువ ఉండవు.
ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బిన పిండి లాంటివి ఫ్రిజ్‌లో ఉంచినపుడు వాటి మీద మూత పెట్టాలి.
ఆకుకూరల వేళ్ళను కత్తిరించి తడిపోయేలా బాగా ఆరపెట్టి కట్టలను విడదీసి పాలథిన్‌ కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.
వేడి ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
ఫ్రిజ్‌ తలుపులను ఎక్కువసార్లు తీస్తూవేస్తూ ఉండటం, ఎక్కువ సమయం తెరిచి ఉంచడం వలన ఫ్రిజ్‌ త్వరగా పాడైపోతుంది.
అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కండెన్సర్‌ మీద దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేయాలి.
నెలకు రెండుసార్లు డీప్రాస్ట్‌ చేసి ఫ్రిజ్‌ లోపల శుభ్రం చేసి, బయట కూడా మరకలు, దుమ్ము లేకుండా తుడవాలి.
ఫ్రిజ్‌లో పాలు, పెరుగు లాంటివి ఒలికితే స్విచ్‌ ఆఫ్‌ చేసి శుభ్రం చేసుకోవాలి.
ఫ్రిజ్‌లో ఆహారపదార్ధాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టకూడదు. లోపల గాలి ప్రవేశించేలా ఖాళీ వుండేలా చూడాలి.
సువాసన వస్తువులను, పూలను ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు వాటి వాసన బయటకు రాకుండా జాగ్రత్తగా కవర్లో పెట్టాలి.

ఫ్రిజ్‌ వాడకంలో జాగ్రత్తలు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి