బాల్యం నుంచే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

బాల్యం నుంచే...

పిల్లలు పసితనంలో ఎక్కువగా బయట తిరగడం, పరుగులు పెట్టడం, ఆటలాడటంతో చెమటవల్ల శరీరం అపరిశుభ్రంగా మారుతుంది. అదేవిధంగా తినేటప్పుడు ఆహార పదార్థాలు మీద పడేసుకుంటారు. వీటి ద్వారా పిల్లలకు చర్మ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది సహజం. అయితే తల్లిదండ్రులు కొంచం శ్రద్ధ తీసుకొని వారికి బాల్యం నుంచే పరిశుభ్రత అలవరచడం వల్ల చర్మవ్యాధులు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.
పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు, చేతులు, పాదాలు, ధరించే దుస్తులు, షూ, సాక్స్‌, జుట్టు విషయంలో బాల్యం నుంచే వారు పరిశుభ్రతను నేర్చుకునేవిధంగా పెద్దలు శిక్షణ ఇవ్వాలి. వారికి మంచి అలవాట్లను నేర్పించే బాధ్యత పెద్దలదే. పరిశుభ్రతను పాటించకపోతే ఆరోగ్యంమీద ఏవిధమైన దుష్ఫలితాలు ఉంటాయన్నది పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి.
నోటి శుభ్రత: పిల్లలకు బాల్యం నుంచే దంతాలను సరైన విధంగా తోముకోవడం నేర్పించాలి. బేబీ బ్రష్‌నే వాడాలి. బ్రెష్‌ హెడ్‌ చిన్నదిగా ఉండాలి. నీటితో శుభ్రపరచిన తర్వాతనే బ్రెష్‌ను ఉపయోగించాలి. తల్లికానీ, తండ్రికానీ దగ్గరుండి పళ్లు తోముకునే పద్ధతిని నేర్పించాలి. నాలుకను టంగ్‌ క్లీనర్‌తో శుభ్రపరచుకోమని చెప్పాలి. బిస్కెట్లు, చాక్‌లెట్స్‌ వంటి ఆహారం ఏం తిన్నా వెంటనే నోట్లో నీరు పోసుకుని పుక్కిలించి ఉమ్మడం అలవాటు చేయాలి. చిన్నతనం నుంచే నోటి పరిశుభ్రత విషయంలో పిల్లలు సరైన శ్రద్ధ తీసుకునే విధంగా పెద్దలు నేర్పాలి.
చేతుల శుభ్రత: సూక్ష్మక్రిములు ఎక్కువగా చేతుల ద్వారానే వ్యాపిస్తాయి. గోళ్ళల్లో మట్టిచేరకుండా, చిన్న పిల్లల గోళ్లను బేబీ నెయిల్‌ కట్టర్‌ ద్వారా కత్తిరించాలి. ముక్కులో చేతులు పెట్టుకోకూడదని చెప్పాలి. జలుబు చేసినప్పుడు, తుమ్ము వచ్చినప్పుడు చేత్తో ముక్కు తుడుచుకోకుండా, ఒక చేతి రుమాలునో, శుభ్రమయిన పాతబట్టనో ఉపయోగించమని చెప్పాలి. అయినప్పటికీ, చేతులు కడుక్కున్న తర్వాతనే ఆహారం తీసుకోమని చెప్పాలి.
దుస్తుల శుభ్రత: పిల్లలు పాఠశాల నుంచి రాగానే స్కూలు దుస్తులను మార్చాలి. పాదాలు, ముఖం, చేతులు సబ్బుతో శుభ్రపరచుకోమని చెప్పాలి. ఉతికిన యూనిఫాంనే ప్రతిరోజూ ధరించేవిధంగా చూడాలి. యూనిఫాంను ఎప్పకప్పుడు శుభ్రపరచకుండా వేసుకుంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి.
పాదాల శుభ్రత: బయటి నుంచి రాగానే పిల్లలు పాదాలను శుభ్రపరచుకునే అలవాటు బాల్యం నుంచే అలవడాలి. కాటన్‌ సాక్స్‌ వాడటమే మంచిది. సాక్స్‌లను ప్రతిరోజూ ఉతకాలి. లిక్విడ్‌ లోషన్‌తో కానీ, సబ్బుతోకానీ పాదాలను మట్టిపోయేలా శుభ్రంగా తోముకుని, కడుక్కోవాలి.
ఆటబొమ్మల శుభ్రత: సాధారణంగా పిల్లలు ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారు. అందుకే పిల్లల ఆట వస్తువులు ఎంతో శుభ్రంగా ఉండాలి. అంటే, ఆ ఆటబొమ్మలు నీటితో శుభ్రపరిచే విధంగా ఉండాలి. బొమ్మలు శుభ్రంగా లేకపోతే, వాటితో ఆడుకునే పిల్లలకు జలుబు, దగ్గు, ఫ్లూ, ఆస్మా, ఎలర్జీ లాంటి
అనారోగ్యాలు వస్తాయి: పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పరిశుభ్రతపై పిల్లలకు బాల్యం నుండే అవగాహన కల్పించాలి. దానితో వారు పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పెరుగుతారు. అది వారికి జీవితాంతం ఉపయోగపడుతుంది. ు

బాల్యం నుంచే...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి