అలసట తగ్గేదెలా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

అలసట తగ్గేదెలా?

శారీరకంగా లేదా మానసికంగా ఎక్కువ శ్రమకు లోనవడం వల్ల అలసట కలుగుతుంది. మరి ఆ అలసట వెంటనే తగ్గాలంటే కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు..అలాగే చిన్నచిన్న బ్యూటీ టిప్స్‌తో ముఖంలోని అలసటను ఇట్టే తరిమేయవచ్చంటున్నారు సౌందర్యనిపుణులు.. అవేంటో చూద్దాం..
- నిస్సత్తువ ఆవరించటానికి ఒంట్లో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్‌కి లోనవడం ఒక కారణం. ఫలితంగా శరీరంలో అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరగక మెదడు పనితనం నెమ్మదించడం, పని చేసే సామర్థ్యం తగ్గడం జరుగుతుంది. అందుకని దాహం వేసేవరకు వేచి చూడకుండా మంచినీటిని తరచూ తాగుతూనే ఉండాలి. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది.
- బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే అలసట తప్పదు. కారణం ముందు రోజు రాత్రి నుంచి మధ్యాహ్నభోజనం వరకు శక్తి అందకపోతే శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. మధ్యాహ్నం పూట కార్బొహైడ్రేట్లతో పాటు ప్రోటీన్లతో కూడిన ఆహారం విధిగా తీసుకోవాలి. అప్పుడే శారీరక శక్తి, మానసిక శక్తి సొంతమవుతాయి.
ఫ్రెష్‌లుక్‌తో కనిపించాంటే....
- ఓట్‌ మీల్‌ మంచి నేచురల్‌ స్క్రబ్బర్‌. దీంతో ముఖంపై రుద్దుకుని చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం కాంతివంతమవుతుంది.
- కొన్ని ఐస్‌ క్యూబ్‌లను పల్చటి క్లాత్‌లోకి తీసుకుని ముఖంపై మెల్లగా రుద్దినా, గంధాన్ని ఫేస్‌ ప్యాక్‌లా వేసుకుని పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరిచినా ముఖంలో ఉండే అలసట మటుమాయమవుతుంది.
- అలసట కళ్లపై కనిపించకుండా ఉండాలంటే ఐస్‌ బ్యాగ్స్‌, కీరదోసకాయ ముక్కలు, టీ బ్యాగ్స్‌ వగైరా వాడుకోవచ్చు. 

అలసట తగ్గేదెలా?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి