పటిక బెల్లంతో... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

పటిక బెల్లంతో...

కండ చక్కెర.. మిశ్రి.. ఇలా అనేక పేర్లతో పెద్దపెద్ద స్ఫటికాలుగా ఉండే ఒక రకమైన పంచదార పటికబెల్లం. ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.
- చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే దగ్గు, గొంతునొప్పి మెల్లగా తగ్గుతాయి.
- గ్లాసు గోరువెచ్చని పాలలో అరచెంచా మిరియాల పొడి, కొద్దిగా పటికబెల్లం బాగా కరిగించి తీసుకుంటే వెంటనే గొంతులో కిచ..కిచ.. మాయమవుతుంది.
- రోజూ పడుకునే ముందు గ్లాసుపాలల్లో చెంచా పటికబెల్లం పొడి కలిపి తాగితే ఎలాంటి బలహీనత దరిచేరదు.
- పిల్లలు, గర్భిణీ స్త్రీలు పంచదారకు బదులుగా పటికబెల్లం వాడడం శ్రేయష్కరమని మన పెద్దలు సూచిస్తుంటారు.
- గొంతుపట్టింది.. అంటూ అసలు మాట్లాడడానికే ఇబ్బందిపడేవారు వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి తీసుకుంటే సరిపోతుంది. గొంతు బొంగురు ఇట్టే నయమవుతుంది కూడా.
- నీళ్ల విరేచనాలు అరికట్టడానికి అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తినాలి.
- చిన్నగా కోసిన నిమ్మకాయ ముక్కపై పటికబెల్లం పొడి చల్లి బుగ్గన పెట్టుకుంటే వికారం, వాంతులు ఇట్టే తగ్గిపోతాయి.
- పిల్లలు వేడిచేసి ఏడుస్తూంటే మంచినీళ్ళలో చిన్న పటికబెల్లం ముక్క వేసి కరిగించిన నీటిని పట్టించాలి. వీటితో దాహం కూడా తీరుతుంది.

పటిక బెల్లంతో...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి