వంటింటి మొక్కలు... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

వంటింటి మొక్కలు...

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి స్థలంలోనైనా కుండీలలో వంటింటికి అవసరమైన ఆకుకూరల్ని, కూరగాయల్ని పండించడంపై ఇప్పుడు అందరు శ్రద్ధ పెట్టారు. బాల్కనీలో పెంచే పూల మొక్కలకు తోడు రకరకాల వంటింటి మొక్కలు పెంచుతున్నారు.
ఎ వంటల్లో సువాసనలు వెదజల్లే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు.. పోషక విలువలు పుష్కలంగా లభించే పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరల్నీ పెంచుకోవాలి. పచ్చిమిర్చి, టమాట, వంకాయ.. ఇటువంటి కూరగాయల మొక్కలు కూడా పెంచుకుంటే వంటల రుచి పెరగడమేకాక ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. కుండీల్లో సునాయసంగా పెంచుకోగలిగే ఉల్లి, వెల్లుల్లి కాడలు, గోధుమ గడ్డి.. అనేక రుగ్మతలను పారదోలడంలో సహాయపడతాయి.
ఎ మొక్కల కోసం వాడే కుండీలు, మట్టి ఎంపికలో తగు జాగ్రత్తలు అవసరం. అలాగే గాలి, వెలుతురు విషయంలోనూ దష్టి పెట్టాలి. వాము, కలబంద మొక్కలు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుస్తాయనడంలో సందేహం లేదు. వాము ఆకు వంటల్లో మంచి రుచిని అందిస్తుంది. చక్కని ఆక్సీజన్‌ను అందించడంతో పాటు కలబంద సౌందర్య పోషణలోనూ మేటి. చిన్నచిన్న గాయాలకు చక్కని ఔషధం కూడా.
ఎ అయితే ప్లాస్టిక్‌ కుండీలకన్నా మట్టి కుండీలను వాడటం ఎంతో మంచిది. కుండీకి అడుగున కన్నం చేయడం, ఓ ప్లాస్టిక్‌ ప్లేటు ఉంచడం మరవద్దు. కుండీల్లో నింపే మట్టి గుల్లగా ఉండేలా చూసుకోవాలి. కావాలంటే మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే పాటింగ్‌ మిక్సర్‌ వాడుకోవచ్చు. రసాయన ఎరువుల జోలికిపోకుండా వంటింటి వ్యర్థాలతోనే కంపోస్ట్‌ ఎరువులను తయారు చేసుకోవాలి. దీనికి వాడేసిన టీ పొడి, కోడిగుడ్డు పెంకులు, ఉల్లిపాయ పొట్టు, బియ్యం కడిగిన నీళ్లు.. మొదలైనవి ఉపయోగపడతాయి. వంటింట్లో కూరగాయలు కడిగిన నీరు మొక్కలకు వాడుకోవాలి.

వంటింటి మొక్కలు...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి

manavi

ఆరోగ్యం

పటిక బెల్లంతో...

04-03-2020

కండ చక్కెర.. మిశ్రి.. ఇలా అనేక పేర్లతో పెద్దపెద్ద స్ఫటికాలుగా ఉండే ఒక రకమైన పంచదార పటికబెల్లం. ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే దగ్గు, గొంతునొప్పి