ప్రసవం తర్వాత... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

ప్రసవం తర్వాత...

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.
- ప్రసవం తరువాత సుమారుగా రెండు వారాల పాటు బ్లీడింగ్‌ అవుతుంది. ఆ సమయంలో శుభ్రమైన పాడ్స్‌ని వాడాలి.
- ప్రసవం తరువాత వచ్చే కడుపు నొప్పికి డాక్టర్‌ రాసిన మందుల్ని వాడండి.
- యోని ముఖద్వారంలో వాపు లేక నొప్పి ఉంటే ఐస్‌ ముక్కను పలచటి గుడ్డతో చుట్టి అక్కడ
10- 20 నిమిషాలపాటు కాపడం పెట్టండి.
- గోరువెచ్చటి నీటితో జననాంగాల్ని శుభ్ర పరచుకోండి.
- రోజుకు మూడు సార్లు, ముఖ్యంగా విరేచనం తరువాత ఒక టబ్‌ లేక బేసిన్‌లో వేడినీళ్ళు పోసి దానిలో కూర్చోండి(సిట్జ్‌ బాత్‌)
- పైల్స్‌ లేక మొలలు లేక మూలశంక ఉంటే అక్కడ, యోనికి మలద్వారానికి మధ్య ఐస్‌తో కాపడం పెట్టుకోండి
- సమృద్ధిగా ద్రవాల్ని తాగడం, పీచు ఎక్కువ ఉన్న పదార్ధాల్ని తినడం ద్వారా మలబద్ధకం రాకుండా, విరేచనం సాఫీగా అయేలా చూసుకోండి
- తరచుగా మూత్ర విసర్జన చెయ్యండి
- పెల్విక్‌ ఫ్లోర్‌, పొట్టకు సంబంధించిన వ్యాయామాల్ని ప్రారంభించండి
- రోజుకు 8-10 గంటలు విశ్రాంతి తీసుకోండి
- పాపాయికి మీ పాలను తాగించండి
వీటిని మానేయాలి
- కారం, మసాలా పదార్ధాల్ని తినకండి
- సుమారుగా 4-6 వారాల పాటు, పూర్తిగా శరీరం కోలుకునేదాకా లైంగికంగా కలవకండి.
- 5-6 వారాలదాకా పాపాయితో కలిసి ప్రయాణాలు చెయ్యకండి.
- ఎక్కువ దూరం కారుప్రయాణం చెయ్యవలసి వస్తే మధ్య మధ్యలో ఆగి కొంచెం అటూ ఇటూ నడవండి
- యోనిలోపల ఏ ద్రవాలతోనూ కడుక్కోవద్దు.
- డా|| ఆలూరి. విజయలక్ష్మి, శ్రీశ్రీ హౌలిస్టిక్‌ హాస్పిటల్‌,
హైదరాబాద్‌, సెల్‌ : 9849022441

ప్రసవం తర్వాత...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి

manavi

ఆరోగ్యం

పటిక బెల్లంతో...

04-03-2020

కండ చక్కెర.. మిశ్రి.. ఇలా అనేక పేర్లతో పెద్దపెద్ద స్ఫటికాలుగా ఉండే ఒక రకమైన పంచదార పటికబెల్లం. ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే దగ్గు, గొంతునొప్పి