తాజా పరిమళం కోసం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

తాజా పరిమళం కోసం

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.
- ఒక గాజు పాత్రలో నిమ్మ నూనెలో ముంచిన దూదిని ఉంచి దాన్ని స్నానాల గదిలో పెట్టండి. దుర్వాసన పోయి అక్కడ సువాసన వస్తుంది.
- వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా వస్తాయి. కొద్దిగా వేడినీటిలో ఉప్పు కలిపి ఈ నీటిని ఈగలు ముసిరిన దగ్గర చల్లి తుడిస్తే ఈగలు పోతాయి
- నేలను తుడుస్తున్నప్పుడు నీటిలో రెండు చుక్కలు నిమ్మగడ్డి నూనె వేయండి. ఈగలూ, దోమలూ వంటివి ముసరవు. చక్కని సువాసనా వస్తుంది. లేదంటే పావువంతు నీళ్లల్లో రెండు చెంచాల నిమ్మగడ్డి నూనె కలిపి మరిగించండి. చక్కని ఫలితం ఉంటుంది. దాల్చినచెక్కను పొడిగా చేసి సాంబ్రాణి పొగగా వేస్తే సరి. గదంతా పరిమళాలు వ్యాపిస్తాయి.
- పుల్లటి వాసనలకి ఎంతటి దుర్వాసనైనా తొలగించే శక్తి ఉంటుంది. అందుకే రెండు నిమ్మచెక్కల్ని నీళ్లల్లో పిండి గదిలో స్ప్రే చేయండి. అలానే నారింజ తొక్కలను నీటిలో వేసి ఉడికించినా సరే! సువాసనలు గదంతా వ్యాపిస్తాయి.
- ఇక తాజా పూల పరిమళాల సంగతి సరేసరి! చామంతి, మల్లెలను గదిలో వేలాడదీయండి. ఇవి చక్కటి సువాసనను మనసుకి ఆహ్లాదాన్ని పంచుతాయి. ఓ రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో తాజా గులాబీలు ఉంచండి చక్కటి సువాసనను ఆస్వాదించండి
- అద్దాలూ, కిటికీలూ, ఇతర గాజు వస్తువులపై మురికి పేరుకుని, మరకలు పడ్డాయా.. వాడేసిన టీపొడినే మళ్లీ నీళ్లల్లో వేసి.. తీసుకోవాలి. దీన్ని వాటిపై చల్లి.. మెత్తని వస్త్రంతో తుడిస్తే.. మురికీ, మరకలు పోయి.. కొత్తవాటిలా మారతాయి.చామంతి రేకల్ని దానిలో వేసి గది మధ్యలో ఉంచండి. చక్కని సువాసనలతో పాటు కంటికింపుగానూ కనిపిస్తాయి.
- వెడల్పాటి గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని నాలుగైదు యాపిల్‌ ముక్కలూ, రెండు దాల్చిన చెక్క ముక్కలూ, నాలుగు లవంగాలు వేసి పొయ్యిమీద పెట్టండి. నీళ్లు కాస్త వేడయితే చాలు.. ఆ పరిమళం ఇల్లంతా వ్యాపిస్తుంది.
- కమలాఫలం తొక్కల్ని సేకరించండి. వాటితోపాటూ దాల్చినచెక్క ముక్కలూ, బిర్యానీ ఆకులూ కొన్ని తీసుకుని పూలదండలా తయారుచేసి గదిలో ఎక్కడయినా వేలాడదీసి చూడండి. ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో.
- అరోమా కొవ్వొత్తుల్ని అలాగే వెలిగించేయొద్దు. ముందు వాటిని కాఫీ గింజలు వేసిన కప్పులో ఉంచండి. దీనివల్లా ఇల్లంతా పరిమళం సొంతమవుతుంది.

తాజా పరిమళం కోసం

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి

manavi

ఆరోగ్యం

పటిక బెల్లంతో...

04-03-2020

కండ చక్కెర.. మిశ్రి.. ఇలా అనేక పేర్లతో పెద్దపెద్ద స్ఫటికాలుగా ఉండే ఒక రకమైన పంచదార పటికబెల్లం. ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే దగ్గు, గొంతునొప్పి