తరచూ జబ్బు పడుతుంటే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...
వెల్లుల్లి: ఇది యాంటీ వైరల్‌ గుణాలను కలిగి వుంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. గుండె సంబంధిత జబ్బులకు, క్యాన్సర్‌కు వెల్లులి మంచి ఔషధం.
పసుపు: పసుపు ఆయుర్వేద గుణాలు కలిగి ఉండి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్‌ కలిగి వుండటమే కాక మతిమరుపు రాకుండా సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్‌ కణాలను ఎదుర్కొంటుంది. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆహారంలో పసుపు తరచూ వాడితే మంచి ఫలితం ఉంటుంది.
వాము: సాధారణ జలుబు ఉన్న వారు వాము పొడి చేసి బెల్లంతో కలిపి వేడిచేసి ప్రతిరోజూ రెండు టీ స్పూన్లు తీసుకోవాలి. ఇది శ్వాస కోశ సంబంధ వ్యాధుల నుండి కాపాడుతుంది. వాముని సన్నని వస్త్రంలో కట్టి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని పడుకున్నట్లయితే మైగ్రేన్‌ తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అజీర్తి, పంటినొప్పి సమస్యల నుంచి రక్షిస్తుంది.
అల్లం: జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. వాంతులు, క్యాన్సర్‌ నివారణకు, ఆహారం జీర్ణం కావడానికి సహకరిస్తుంది. గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.
కరక్కాయ: కరక్కాయ ఆస్తమా, దగ్గుకు దివ్య ఔషధం. మూత్రంలో ఇన్ఫెక్షన్‌, అజీర్తి సమస్యల నివారణలో సహాపడుతుంది. అయితే కరక్కాయ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
తులసి ఆకులు: శ్వాస సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు, సైన్‌సైటీస్‌, గొంతునొప్పి నివారణకు ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యల నుండి కాపాడుతుంది. షుగర్‌, బీపీని నియంత్రణలో వుంచుతుంది.
పుదీనా: పుదీనా ఆకులు 'టీ'లో గానీ, గోరువెచ్చని నీటిలోగానీ వేసుకుని తరచూ తాగుతుంటే జలుబు, తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తికి, మంచినిద్రకు సహాయపడుతుంది. శరీరానికి తజాదనాన్ని ఇస్తుంది.
- వాణి, న్యూట్రీషియన్‌, 9959361180

తరచూ జబ్బు పడుతుంటే...

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి

manavi

ఆరోగ్యం

పటిక బెల్లంతో...

04-03-2020

కండ చక్కెర.. మిశ్రి.. ఇలా అనేక పేర్లతో పెద్దపెద్ద స్ఫటికాలుగా ఉండే ఒక రకమైన పంచదార పటికబెల్లం. ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే దగ్గు, గొంతునొప్పి