కడుపు మాడ్చుకోవద్దు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.
ప్రతీ రోజు నెయ్యి: ఇదివరకటి రోజుల్లో నెయ్యి లేకుండా ఏం తినేవారు కాదు. కానీ ఇప్పుడు సన్నబడాలనే మోజులో నెయ్యిని పూర్తిగా దూరం పెడుతు న్నారు. అయితే ప్రతి రోజూ నిరభ్యంతరంగా నెయ్యిని తినొచ్చు. కొన్ని పదార్థాలను ఎక్కువ నెయ్యితో, కొన్నింటిని తక్కువ నెయ్యితో కలిపి తినొచ్చు. అయితే పరిమితంగా తినటం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది, జాయింట్ల సమస్యలు దరి చేరవు.
పళ్లు తినండి: ప్రస్తుతం ఎక్కువ మంది జ్యూసులు తాగడానికే ఇష్టపడుతున్నారు. అయితే జ్యూసులకన్నా డెరెక్టుగా పళ్లు తినడం మంచిది. దీని వల్ల పీచు పదార్థాలు, ఇతర పోషకాలూ మన శరీరంలోకి వెళతాయి. కేక్‌, బిస్కెట్స్‌, బ్రెడ్‌, పాస్థా, పిజ్జా లాంటి జంక్‌ఫుడ్‌ జోలికి వెళ్ళకండి.
పొద్దున్నే టీ మానండి: చాలా మందికి ఉదయాన్నే టీ తాగనిదే ఏ పని చేయబుద్ధి కాదు. అయితే ధీర్ఘకాలంలో ఇలాంటి అలవాటు ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా ఆకలేస్తే టీతో సరిపెట్టడం మానండి. తప్పదు అనుకున్నప్పుడు రోజులో 2-3 సార్లు తీసుకోవచ్చు.
ఏదో ఒకటి తినండి: ఇదివరకటి రోజుల్లో ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే మధ్యలో వంటింట్లో వుండే ఏదో ఒకటి తీసుకునేవారు. దీని వల్ల పనిలో అలసట ఉండకపోవడమే కాక నాజుగ్గా ఉంటారు. అలాగే భోజన సమయంలో ఎక్కువ తినలేరు.

కడుపు మాడ్చుకోవద్దు

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.

manavi

ఆరోగ్యం

ప్రసవం తర్వాత...

11-03-2020

ప్రసవం తరువాత మళ్ళీ మామూలు రోజువారీ కార్యక్రమాలు చెయ్యడానికి కొంత సమయం కావాలి. బిడ్డకు జన్మనిచ్చాక బిడ్డతో పాటు మీ శరీర సంరక్షణ మీద, గాయాలు మానడం మీద కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

manavi

ఆరోగ్యం

ప్రమాదం తప్పదు

10-03-2020

ర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే

manavi

ఆరోగ్యం

వంటింటి మొక్కలు...

07-03-2020

వంటింటి మొక్కలు.. ఇవేంటనేనా మీ సందేహం.. ఘుమఘుమలాడే వంటకాల కోసం వాడే కొత్తిమీర, కరివేపాకు.. లాంటివి అప్పటికప్పుడు కావాలంటే మీ పెరటి మొక్కల్లో ఇవి ఉండాలి. అలాగే మరికొన్ని ఆకుకూరలు, కూరగాయల మొక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఉన్న కొద్దిపాటి

manavi

ఆరోగ్యం

అనారోగ్యం దరిచేరకుండా...

06-03-2020

ఇల్లు రోజూ శుభ్రపరచడంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. ఫ్లోర్‌తో పాటు గోడల నలు మూలల్లో ఉన్న బూజు, దుమ్ము రేణువుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ముఖ్యంగా స్నానాలగది, వంటగదుల్లో ఎక్కువగా సూక్ష్మజీవులు పెరగటానికి ఆస్కారమున్న కారణంగా తరచూ శుభ్రపరచడమే కాక ఎప్పుడూ అంతా పొడిగా

manavi

ఆరోగ్యం

నోటిపూత తగ్గాలంటే...

05-03-2020

తరచూ నోటిపూతకు కారణం మానసిక ఆందోళన, పోషకాహార లోపం, అజీర్ణం కావచ్చు. రెండు పూటలా బ్రష్‌ చేసుకోక ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణాన్ని గ్రహించి చికిత్స తీసుకోవడం తప్పనిసరి. తాత్కాలికంగా నోటి

manavi

ఆరోగ్యం

పటిక బెల్లంతో...

04-03-2020

కండ చక్కెర.. మిశ్రి.. ఇలా అనేక పేర్లతో పెద్దపెద్ద స్ఫటికాలుగా ఉండే ఒక రకమైన పంచదార పటికబెల్లం. ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే దగ్గు, గొంతునొప్పి