రోజూ ఓ ఉసిరి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

రోజూ ఓ ఉసిరి

రోజుకో ఉసిరికాయను తీసుకుంటే చాలు.. ఆరోగ్యం మీవైపే వుంటుందని వైద్యులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలను, నీరసాన్ని దూరం చేసుకోవాలంటే ఉసిరికాయను తినాలి. పెద్దలు, పిల్లలు ఏదో ఒక రూపంలో వయోబేధం లేకుండా ఉసిరిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పుష్కలమైన విటమిన్‌-సి, బ్రహ్మాండమైన రోగనిరోధక శక్తి, ఎల్లప్పుడూ ఉత్సాహం, సకల రోగాల పాలిటి శత్రువుగా ఉసిరికాయ పనిచేస్తుంది. జీవితమంతా ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకో ఉసిరికాయ తినాల్సిందే. ఇందులో విటమిన్‌-సి, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. కెలోరీలు తక్కువ. చర్మరక్షణ, కేశ సంరక్షణ, రోగనిరోధక వ్యవస్థలకు ఆమ్లా ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి వాటి బారిన పడకుండా ఇది మనల్ని కాపాడుతుంది. బరువు తగ్గాలని కోరుకునే వారు కచ్చితంగా ఉసిరి కాయను టేస్టు చేయాల్సిందే. రోజుకు ఒకటి తీసుకోవాల్సిందే. నడుం దగ్గరి కొవ్వును కరిగించి, సన్నని, నాజూకైన నడుమును మీకు బహుమతిగా ఇస్తుంది. అలాగే డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది ఓ మంచి ఔషధం లాంటిది.
ఇన్సులిన్‌ స్పందనను పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించగలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు కూడా ఉసిరిని తమ ఆహారంలోకి చేర్చుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు.
ఉసిరికాయలోని రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు, గాయాలను త్వరగా నయం చేయడంలో బాగా ఉపయోగపడతాయి. ప్రకాశవంతమైన చర్మం, నల్లటి కేశాలు కావాలంటే ఉసిరిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. కంటి, దంత సమస్యలను కూడా ఉసిరికాయ తొలగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

రోజూ ఓ ఉసిరి

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కారణాలు ఎన్నో..?

20-05-2020

మహిళల ఆరోగ్యం పీరియడ్స్‌ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెలసరి సరైన సమయానికి రాకపోవడం వల్ల లెక్కనేనన్ని సమస్యలు వచ్చిపడుతుంటాయి. పీరియడ్స్‌ ఆలస్యంగా వచ్చినా, రావాల్సిన దానికన్నా ముందే వచ్చేసినా

manavi

ఆరోగ్యం

కాబోయే అమ్మలూ కాస్త జాగ్రత్త

18-04-2020

రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ వుంటుందే వారిపైనే కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా వుంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు గర్భిణీలకు కూడా

manavi

ఆరోగ్యం

నల్లద్రాక్షతో...

14-04-2020

నల్లద్రాక్ష తీసుకుంటే మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలో సి విటమిన్‌

manavi

ఆరోగ్యం

గొంతు సమస్యలకు...

10-04-2020

కరోనా వల్ల దగ్గు, జలుబు వస్తే చాలు కంగారు పడిపోతున్నారు. వచ్చే ప్రతి జలుబు కరోనా కాదని వైద్యులు అంటున్నారు. సాధారణంగా సీజన్‌

manavi

ఆరోగ్యం

ఆ నాలుగు...

10-04-2020

కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, ఆల్మండ్‌ ఆయిల్‌, నువ్వుల నూనెలు ఏ కాలంలోనైనా చర్మాన్ని రక్షించగలిగే శక్తి వీటికి వుంది. ఈ నూనెలను రాయడం

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.