కాబోయే అమ్మలూ కాస్త జాగ్రత్త | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

కాబోయే అమ్మలూ కాస్త జాగ్రత్త

రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ వుంటుందే వారిపైనే కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా వుంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు గర్భిణీలకు కూడా రోగనిరోధక శక్తి తక్కువగా వుంటుంది. మన దేశంలోనే ఈ సమస్య మరీ ఎక్కువ. చాలా సర్వేల ప్రకారం మనదేశంలో రక్తహీనతతో బాధపడే మహిళల సంఖ్య ఎక్కువ. కడుపులో ఓ బిడ్డను మోస్తూ రక్తహీనత కూడా వుంటే అలాంటి వారికి ఈ కరోనా వైరస్‌ తొందరగా సోకే అవకాశం వుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణీలు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటే తెలుసుకుందాం...
సాధారణంగా గర్భం ధారణ సమయంలో మూడు దశలు వుంటాయి. మొదటి మూడు నెలలు మొదటి దశ, మూడో నెల నుండి ఆరో నెల వరకు రెండో దశ, ఆ తర్వాత తొమ్మిదో నెల వరకు మూడో దశ. ఈ మూడు దశల్లో ఒక్కో సమయంలో కొన్ని ప్రత్యేక మైన జాగ్రత్త తీసుకోవల్సివల్సి వుంటుంది.
వాంతులు అయినా తినాల్సిందే
అప్పుడే నెల తప్పి వుంటారు. పిండం ఏర్పడుతున్న దశ కూడా ఇదే. ఈ మొదటి మూడు నెలలు అత్యంత జాగ్రత్తగా వుండాలి. సాధారణంగా ఈ సమయంలో వికారం, వాంతులు, నీరసం ఎక్కువగా వుంటాయి. చాలా మందికి తిన్నది తిన్నట్టు వాంతుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం సరిగ్గా తీసుకోబుద్ది కాదు. నీరసం వస్తుంది. అలాంటప్పుడు డీహైడ్రేట్‌ సమస్య కూడా ఎక్కువగా వుంటుంది. ఈ సమయంలో ఎన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే వాంతులు అవుతున్నా కచ్చితంగా ఏదో ఒకటి తింటూ వుండా. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినాలి. అదే ఈ సమస్యకు పరిష్కారం. సాధారణంగా మొదటి మూడు నెలలు పోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, కాల్షియం టాబ్లెట్స్‌ ఇస్తారు. అవి కొనసాగిస్తే సరిపోతుంది.
డాక్టర్ల దగ్గరు పరిగెత్తాల్సిన పని లేదు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధారణ సమస్యలకు డాక్టర్లు అందుబాటులో వుండడం లేదు. కాబట్టి ప్రతి సమస్యకు డాక్టర్ల దగ్గరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అసలు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఇతర ఏ సమస్యలూ లేకపోతే మొదటి మూడు నెలలు వరకు పొలిక్‌ యాసిడ్‌ గోలీలు కచ్చింతగా వాడి ఆ తర్వాత నుండి కాల్షియం, ఐరన్‌ మందులు కొనసాగిస్తే సరిపోతుంది. హెల్ప్‌ లైన్‌ నుండి చాలా మంది ఫోన్లు చేసి ''నాకు స్కానింగ్‌ కోసం రమ్మనమని డేట్‌ ఇచ్చారు. వెళ్ళకపోతే ఏమైనా అవుతుందా'' అని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి చెప్పేది ఒక్కటే స్కానింగ్‌ చేయించుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. ముందే చెప్పినట్టు ప్రత్యేకమైన సమస్యలు ఏమీ లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో వుండడం మంచిది. లోబల బిడ్డ తిరుగుతూ ఆరోగ్యంగా వుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ కదలికలు లేకపోతేనో, బ్లీడింగ్‌ కనిపిస్తేనో అప్పుడు కచ్చింతంగా డాక్టర్‌ను సంప్రదించాలి. అలాంటి సమస్యలు ఏమీ లేకుండా సాధారణంగా చెకప్‌ల కోసం డాక్టర్ల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వెళితేనే సమస్య అని గుర్తుపెట్టుకోవాలి.
సమస్యలు కొని తెచ్చుకోవద్దు
హాస్పిటల్‌కి వెళ్ళి స్కానింగ్‌ల కోసం ఎదురు చూడాలి. అక్కడ పడుకొని, కూర్చొని స్కానింగ్‌లు చేయించుకోవాలి. మిగతా వారితో కలవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం నూటికి 20 మందిలో ఒకవేళ కరోనా వున్నా ఎలాంటి లక్షణాలు పైకి కనిపించడం లేదు. కాబట్టి బయటకు వెళ్ళి అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవడమే. మరీ అంతగా తెలుసుకోవాలంటే ప్రస్తుతం చాలా చోట్ల వీడియో, స్కైప్‌ కాల్స్‌ ద్వారా సలహాలు ఇస్తున్నారు. అవకాశం వున్న వారు వాటి సహాయం తీసుకుంటే సరిపోతుంది.
పరిశుభ్రత పాటించండి
కచ్చితంగా ప్రతి గంటలకు ఓసారి 20 నిమిషాల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కడ తాకుతారో తెలియదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణులు అతి జాగ్రత్తగా వుండాల్సిందే. కళ్ళు, ముక్కు, నోరు ద్వారానే వైరస్‌ సోకే అవకాశం వుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో చేతులో ఆ ప్రదేశాలకు వెళ్ళకుండా చూసుకోవాలి. అపార్ట్‌మెంట్లోనే, బయట గాలికి నిలబడాలన్నా మాస్క్‌ కట్టుకోవడం మంచిది. మాస్కులు అంటే సర్జికల్‌వే అవసరం లేదు. కర్చీఫ్‌ లాంటివి కట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు గాలి ద్వారా కూడా వైరస్‌ సోకే అవకాశం వుందని ఈ మధ్య రుజువయింది. కాబట్టి మన జాగ్రత్తలో మనం వుంటే మంచిది.
మంచి ఆహారం
వీలైనంత వరకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. వాటిలో ప్రోటీన్లు ఎక్కువగా వుండేలా చూసుకోవాలి. గుడ్లు, మాంసం, పాలు, పెరుగు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఆకుకూరలు, కొద్దిగా పండ్లు తీసుకుంటే సరిపోతుంది. పచ్చివి, వుడకబెట్టనివి అస్సలు తినకూడదు. బయట నుండి ఏం తెచ్చుకున్నా గోరు వెచ్చని నీళ్ళలో శుభ్రం చేసి వాడుకోవాలి. మరీ ముఖ్యంగా అనవసరంగా ఆందోళన పడొద్దు. పూర్వకాలంలో ఎలాంటి డాక్టర్లు లేకుండా సుఖంగా ప్రసవాలు జరిగేవి. ఇప్పుడు ఈ కార్పొరేట్‌ ఆస్పత్రులు వచ్చాక మాటి మాటికి టెస్టులనో, స్కానింగులనో రమ్మనడం వల్ల వెళ్ళకపోతే ఏమౌతుందో అని చాలా మంది ఆందోళన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటూ, ప్రశాంతంగా ఉంటూ, పరిశుభ్రత పాటిస్తే ఎలాంటి సమస్య వుండదు.
బీపీతో పాటు కాళ్ళవాపు వుంటే...
థైరాయిడ్‌ వున్న వారు వుంటే చివరి వరకు ఆ మందులు కొనసాగించాలి. బీపీ చూసుకునేందుకు హాండ్‌మేడ్‌ చెకప్‌లు వున్నాయి. అవకాశం వున్న వారు ఇంట్లో చూసుకుంటే సరిపోతుంది. అయితే మరో సమస్య ఏమిటంటే సాధారణంగా ఈ సమయంలో కాళ్ళ వాపు వస్తుంది. కాళ్ళు పైకి పెట్టుకుని పడుకుంటే సమస్య తగ్గిపోతుంది. బీపీ లేకపోతే దీని వల్ల పెద్ద సమస్య ఏమీ వుండదు. అదే బీపీ వుండి కాళ్ళ వాపు ఇబ్బంది పెడుతుంటే కచ్చితంగా డాక్టర్‌ సలహా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీలు బయటకు వెళ్ళ కూడదు. ఎవైనా అత్యవసర వస్తువులు తెచ్చుకోవాలనుకుంటే ఇంట్లో వున్న వారిని పంపాలి తప్ప వీరు మాత్రం అస్సలు వెళ్ళ కూడదు. అలాగే ఇంట్లో వారు ఉద్యోగ రీత్యా బయటకు వెళ్ళాల్సి వస్తే అలాంటి వారు వీరికి దూరంగా వుండాలి. ఎలాంటి వైరస్‌ లేకపోయినా ముందు జాగ్రత్తగా దూరంగా వుంటేనే మంచిది.
- డా|| రమాదేవి, జనవిజ్ఞాన వేదిక

కాబోయే అమ్మలూ కాస్త జాగ్రత్త

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కారణాలు ఎన్నో..?

20-05-2020

మహిళల ఆరోగ్యం పీరియడ్స్‌ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెలసరి సరైన సమయానికి రాకపోవడం వల్ల లెక్కనేనన్ని సమస్యలు వచ్చిపడుతుంటాయి. పీరియడ్స్‌ ఆలస్యంగా వచ్చినా, రావాల్సిన దానికన్నా ముందే వచ్చేసినా

manavi

ఆరోగ్యం

రోజూ ఓ ఉసిరి

18-04-2020

రోజుకో ఉసిరికాయను తీసుకుంటే చాలు.. ఆరోగ్యం మీవైపే వుంటుందని వైద్యులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలను, నీరసాన్ని దూరం

manavi

ఆరోగ్యం

నల్లద్రాక్షతో...

14-04-2020

నల్లద్రాక్ష తీసుకుంటే మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలో సి విటమిన్‌

manavi

ఆరోగ్యం

గొంతు సమస్యలకు...

10-04-2020

కరోనా వల్ల దగ్గు, జలుబు వస్తే చాలు కంగారు పడిపోతున్నారు. వచ్చే ప్రతి జలుబు కరోనా కాదని వైద్యులు అంటున్నారు. సాధారణంగా సీజన్‌

manavi

ఆరోగ్యం

ఆ నాలుగు...

10-04-2020

కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, ఆల్మండ్‌ ఆయిల్‌, నువ్వుల నూనెలు ఏ కాలంలోనైనా చర్మాన్ని రక్షించగలిగే శక్తి వీటికి వుంది. ఈ నూనెలను రాయడం

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.