కారణాలు ఎన్నో..? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఆరోగ్యం

కారణాలు ఎన్నో..?

మహిళల ఆరోగ్యం పీరియడ్స్‌ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెలసరి సరైన సమయానికి రాకపోవడం వల్ల లెక్కనేనన్ని సమస్యలు వచ్చిపడుతుంటాయి. పీరియడ్స్‌ ఆలస్యంగా వచ్చినా, రావాల్సిన దానికన్నా ముందే వచ్చేసినా కూడా సమస్యే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రెండు మూడు నెలల వరకూ రాని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ పరిస్థితి వస్తే కానీ కొందరు దీని గురించి ఆలోచించరు. అదేదే ముందే నెలసరి ఎందుకు క్రమం తప్పుతుందో తెలుసుకుంటే సమస్య ఆదిలోనే అంతమవుతుంది. కాబట్టి మీ సమస్యకి వీటిలో ఏది కారణమో వెంటనే తెలుసుకోండి.
- ఒత్తిడి ఎక్కువైతే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల స్థాయిలో మార్పులు వస్తాయి. ఆ ప్రభావం రక్త ప్రసరణపై పడి నెలసరిలో తేడాలు వస్తాయి.
- ఆహారపు అలవాట్లలో తేడా వచ్చినా కూడా సమస్య వస్తుంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల బరువు తగ్గి రుతుక్రమంపై ప్రభావం పడుతుంది. లేదా జంక్‌ ఫుడ్‌ లాంటివి ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగి సమస్య వచ్చి ఉండొచ్చు.
- హార్మోన్ల అసమతుల్యతను లెక్క చేయకపోవడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల క్రమక్రమంగా పీరియడ్స్‌ లో తేడా వస్తుంది.
- చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... మితిమీరి వ్యాయామం చేయడం కూడా ఈ సమస్యను తెచ్చి పెడుతుంది. ఎక్సర్‌ సైజ్‌ మోతాదు మించడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందట. తద్వారా సమస్య ఏర్పడుతుందన్నమాట.
- దీర్ఘకాలిక వ్యాధులకు యాంటి బయొటిక్స్‌ వాడటం వల్ల కూడా సమస్య వస్తుంది.
- కొంతమంది ఏవో ముఖ్యమైన పనులున్నాయనో, పూజలూ వ్రతాలూ ఉన్నాయనో పీరియడ్స్‌ రాకుండా మందులు వేసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఓసారయితే ఫర్వాలేదు కానీ తరచుగా ఇలా చేస్తుంటే మాత్రం సమస్యలు రావడం ఖాయం. సహజంగా వచ్చేదాన్ని డిస్టర్బ్‌ చేయడం వల్ల అది క్రమం తప్పి మనల్ని ఇబ్బంది పెడుతుంది.
చూశారు కదా! వీటిలో ఏ కారణమైతేనేమి... పీరియడ్స్‌కి అడ్డు పడుతోందంటే దాన్ని మనం అడ్డుకునే తీరాలి. కాబట్టి వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లండి. కారణం తెలుసుకోండి... దానికి తగిన చికిత్స తీసుకోండి.

కారణాలు ఎన్నో..?

MORE STORIES FROM THE SECTION

manavi

ఆరోగ్యం

కాబోయే అమ్మలూ కాస్త జాగ్రత్త

18-04-2020

రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ వుంటుందే వారిపైనే కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా వుంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు గర్భిణీలకు కూడా

manavi

ఆరోగ్యం

రోజూ ఓ ఉసిరి

18-04-2020

రోజుకో ఉసిరికాయను తీసుకుంటే చాలు.. ఆరోగ్యం మీవైపే వుంటుందని వైద్యులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలను, నీరసాన్ని దూరం

manavi

ఆరోగ్యం

నల్లద్రాక్షతో...

14-04-2020

నల్లద్రాక్ష తీసుకుంటే మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలో సి విటమిన్‌

manavi

ఆరోగ్యం

గొంతు సమస్యలకు...

10-04-2020

కరోనా వల్ల దగ్గు, జలుబు వస్తే చాలు కంగారు పడిపోతున్నారు. వచ్చే ప్రతి జలుబు కరోనా కాదని వైద్యులు అంటున్నారు. సాధారణంగా సీజన్‌

manavi

ఆరోగ్యం

ఆ నాలుగు...

10-04-2020

కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, ఆల్మండ్‌ ఆయిల్‌, నువ్వుల నూనెలు ఏ కాలంలోనైనా చర్మాన్ని రక్షించగలిగే శక్తి వీటికి వుంది. ఈ నూనెలను రాయడం

manavi

ఆరోగ్యం

కడుపు మాడ్చుకోవద్దు

19-03-2020

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ, కంటినిండా నిదురపోతే బరువు తగ్గే అవకాశం వుందంటున్నారు నిపుణులు.

manavi

ఆరోగ్యం

తరచూ జబ్బు పడుతుంటే...

18-03-2020

పిల్లలు, వృద్ధులు చాలా త్వరగా జబ్బు పడుతుంటారు. దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. కొన్ని ఆహార పదార్థాలు చిన్నతనం నుండే తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

చుండ్రు సమస్యకు...

15-03-2020

కాసింత బేకింగ్‌ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ ఎక్కువగా బేకింగ్‌ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకో వడం

manavi

ఆరోగ్యం

తాజా పరిమళం కోసం

14-03-2020

- ఒక సీసాలో నీళ్లూ, చక్రాల్లా తరిగిన నాలుగైదు నిమ్మకాయ ముక్కలూ, చిన్న దాల్చినచెక్కా, రెండుమూడు లవంగాలు వేసి.. గదిలో ఓ చోట ఉంచండి. గదంతా పరిమళం పరుచుకుంటుంది.